Join us LIVE via Facebook or YouTube every Sunday at 5:30 PM (NZ) or 9:15 AM (India)
Daily Devotions and Meditation - Read and get encouraged
United Evangelical Church Logo

ఓ... నా...ఆశ ...

Category:
Author: UEC Team
Date: November 13, 2016

దేవుని వాక్యం

[ecko_quote source="సామెతలు 28:25"]పేరాసగలవాడు కలహమును రేపును యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. A greedy man stirs up strife, but the one who trusts in the Lord will be enriched  [/ecko_quote]

వాక్యధ్యానం

ఆశ లేని జీవితం గింజ కట్టని పొల్లువెన్ను లాంటిది, అత్యాశ ఉన్న జీవితం విరగకాసిన చెట్టు లాంటిది- అన్నాడో ఆధునిక కవి. వాస్తవానికి సృష్టిని నడిపించే ఇంధనం- ఆశ. తగు మోతాదులో వినియోగిస్తేనే జీవిత నౌక సాఫీగా సాగుతుంది. పోటీపడేవారంతా విజేతలు కావాలనే ఆశిస్తారు. గెలిచేది ఒక్కరే. అయినా పోటీపడటం మానరు. గెలవలేమేమో అనే నిరాశ వారిలో తలెత్తనే కూడదు. ఆరోగ్యకరమైన ఆశకు అది ఉదాహరణ. అలాగే అర్హత, స్థాయి, స్థోమత లేని వాటికోసం ఆశపడటం అనర్థదాయకం. అత్యాశ మనిషిని గుడ్డితనము కలుగచెయును. ఇట్టి వారు ప్రతి వారితో కలహమునకు కాలుదువ్వేవారు, వీరిలో పదవి వ్యామోహం పుష్కలము. కలహామునకు ప్రధాన కారణము ఒకని దురాశ. ఈనాటి క్రైస్తవ సంఘములలో విశ్వాసులమని   మరియు ప్రార్థనపరులమని చెప్పుకొనుచు వారి హృదయములో ఊన్న అత్యాశతో ఈడ్వబడి సంఘ సహవాసమును పాడుచేయుచున్నారు. వారికి వున్నా ఒకే ఒక్క కోరిక పదవి వ్యామోహం; మరియు  అర్హత, స్థాయి, దేవుని సామర్ధ్యం, నడిపిoపు శూన్యము.

ఆశకు అంతుండదంటారు అనుభవజ్ఞులు. అనంతమైన ఆశ తన వెంటపడేవారిని పరుగులు పెట్టిస్తుంది. పరిగెత్తేకొద్దీ తీరిక లేకుండా చేసి, ఇంకా తన వైపు ఆకర్షితుల్ని చేయడం దాని లక్షణం. ఆశించింది దొరికితే మరి కొంత కావాలని మనిషి కోరుకుంటాడు. అదీ అమరితే మరొకటి కావాలని ఆత్రపడతాడు. అంతే తప్ప, ఇక్కడితో ఆగుదామనుకోడు. ప్రమిదలో వత్తి లాంటిది ఆశ. అది ఉండేంతవరకు చమురు పోస్తే వెలుగునిస్తుంది. మునిగేంతగా పోస్తే, చీకటినే మిగుల్చుతుంది. ఆశ మనిషికి లోబడి ఉండాలి కానీ, మనిషి ఆశకు లోబడిపోకూడదు.

‘ఆశ లేనివారికి దుఃఖబాధలుండవు, ఆశపడేవారికి లేని బాధలుండవు’ అని కవి వాక్కు. తమకున్నదానితో సంతృప్తిపడేవారు సంతోషం చవిచూస్తారు. అలా కానివారు, కోల్పోతారు. అవగాహన, ప్రణాళిక, పట్టుదల, తగిన కృషి, మరియు దేవుని నడుపుదల ఉంటే ఆశలు వాటంతట అవే నెరవేరతాయి. మనసును కట్టేసే గుణం ఉంది కాబట్టి, ఆశకు పాశం (తాడు)తో పోలిక పెడతారు. జాగ్రత్తగా మసలుకోకపోతే ఆ ఆశే మృత్యుపాశంగా మారే ప్రమాదం ఉంది మరియు వారి కుటుంబము వారి యొక్క అత్యాశకు బాలి.

ఉదాహరణకు ఒక సన్న మూతి జాడీలో జీడిపప్పు ఉంది. ఎవరూ లేనప్పుడు ఓ పిల్లవాడు జాడీలో చెయ్యి పెట్టి పిడికిలి నిండా పప్పు నింపాడు. చెయ్యి బయటకు తీయబోతే రావడంలేదు. తండ్రి చూస్తే కొడతాడనే భయం! మనసు పీకుతోంది. అలాగని పిడికిట ఇమిడిన పప్పును వదలడం అతడికి ఇష్టంలేదు. ఇంతలో తండ్రి రానే వచ్చాడు. బాలుడి అవస్థ చూసి జాలిపడ్డాడు. ‘చేతిలో పప్పు సగం విడిచిపెట్టు. చెయ్యి, పప్పు రెండూ పైకొస్తాయి’ అని సూచించాడు. దాన్ని పిల్లవాడు పాటించాడు. ఇదే కథను నిజ జీవితానికీ అన్వయించుకోవచ్చు.

అతిగా తింటే జీర్ణం కాక ఇబ్బందిపడాల్సి వస్తుంది. క్రమంగా అది అనారోగ్యంగా, ఆపై వ్యాధిగా పరిణమిస్తుంది. అందుకే ‘ఇంకా ఒక ముద్ద తినాలి అనిపిస్తున్నప్పుడే భోజనం ముగించాలి’ అంటారు వైద్యులు. ఆశ అనేక రూపాల్లో ఉంటుంది. మనిషి నిరాశ, అత్యాశ, దురాశల్లో కూరుకుపోవడం మంచిది కాదు. నిరాశ అతణ్ని నిర్వీర్యుడిగా చేస్తుంది. నిరాశ ఉందని గుర్తించిన తరవాత ఏదో ఒకవిధంగా దాన్ని తొలగించుకోవాలి. ఆ స్థానంలో ఆశావహ దృక్పథం పెంచుకోవాలి.

అత్యాశ కలిగినవాళ్లు సుఖసంతోషాలకు దూరమవుతారు. దురాశ వల్ల ఎన్ని నష్టాలున్నాయో బైబిల్ గ్రంధములో ఎన్నో కథలు వివరిస్తాయి. తగిన స్థాయిలో ఆశ ఉంటే కలిగే లాభాలను, మితిమీరిన ఆశ వల్ల దాపురించే నష్టాలను సులువుగా హత్తుకునేలా కథల రూపంలో తీర్చిదిద్దారు బైబిల్ గ్రంధ రచయితలు. చెడు ఆశల మూలాన వాటిల్లే అనర్థాలకు విరుగుడును మన పెద్దలు సూక్తుల రూపంలో సూచించారు. వారి మాటల్లో- లోకంలో అసంతృప్తికి మించిన దారిద్య్రం లేదు. సంతృప్తిపరుడు పొందే సుఖాన్ని ఎంతటి చక్రవర్తి అయినా పొందలేడు. ఆశకు కాకుండా దేవుని నడిపింపుకు అయన యందు నమ్మికయుంచుట ద్వార దేవుని ఆశీర్వాదములు మనము పొందగలము.

తరవాత ఏంటి ( మన కర్తవ్యం)

అత్యాశ కలిగినవాళ్లు సుఖసంతోషాలకు దూరమవుతారు. దురాశ వల్ల ఎన్ని నష్టాలున్నాయో బైబిల్ గ్రంధములో ఎన్నో కథలు వివరిస్తాయి. తగిన స్థాయిలో ఆశ ఉంటే కలిగే లాభాలను, మితిమీరిన ఆశ వల్ల దాపురించే నష్టాలను సులువుగా హత్తుకునేలా కథల రూపంలో తీర్చిదిద్దారు బైబిల్ గ్రంధ రచయితలు. చెడు ఆశల మూలాన వాటిల్లే అనర్థాలకు విరుగుడును మన పెద్దలు సూక్తుల రూపంలో సూచించారు. వారి మాటల్లో- లోకంలో అసంతృప్తికి మించిన దారిద్య్రం లేదు. సంతృప్తిపరుడు పొందే సుఖాన్ని ఎంతటి చక్రవర్తి అయినా పొందలేడు. ఆశకు కాకుండా దేవుని నడిపింపుకు అయన యందు నమ్మికయుంచుట ద్వార దేవుని ఆశీర్వాదములు మనము పొందగలము.

 

Image Source: 

[https://az616578.vo.msecnd.net/files/responsive/cover/main/desktop/2016/04/11/6359595411830984772109554567_Death.jpg]

Copyright © 1991-2023 United Evangelical Church Global
Made with love for Jesus Christ of Nazareth
crossmenu