
[ecko_quote source="సామెతలు 29:25"]భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మక యుంచువాడు సురక్షిత ముగా నుండును. [/ecko_quote]
భయాన్ని అధిగమించడం అందరికీ సాధ్యం కాదు. దానికి కారణం ఒకటి కాదు, అనేకం ఉంటాయి. అవి మనిషి జీవితమంతా వెన్నంటి వస్తుంటాయి. ఒకదాన్ని అధిగమిస్తే ఒకటి, మరొకటి, ఇంకొకటి. భయం విడనాడితే తప్ప, మనిషి ప్రశాంతంగా జీవించలేడు.
భయం వల్ల కలిగే పరిణామం- పిరికితనం. ఆశ, అపరాధ భావం ఆ పరిస్థితి కలిగిస్తాయి. వాటిని లుప్తం చేసుకుంటేనే భయ రహితులం కాగలం. ఒకటి పొందాలనుకున్నప్పుడే, అది పొందలేమేమో అనే భయం ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక పరిజ్ఞానమే ఔషధం. భక్తిసాధన మరియు దేవుని ప్రేమలో మనము ఉండుట ద్వార భయాన్ని అధిగమించగలము. పరిశుద్ధ బైబిల్ గ్రంధము భయమును గురించి ఈ విధముగా విశ్వాసనులను మందలించుతుంది” ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును; భయము దండనతో కూడినది; భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు.ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు.దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమించవలె నను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము (1 యోహాను 4: 18-21).
ప్రేమించుట అనే విషయము మన హృదయములో తీసుకొన్న ఒక దృఢమయిన నిర్ణయము. ఈ విషయములో మన హృదయములో కలిగే భావము, భావోద్వేగాలు మరియు బలమైన అభిప్రాయములకు మన ప్రేమ అతీతముగా ఉండాలి. భావము,భావోద్వేగాలు మరియు బలమైన అభిప్రాయములతో ప్రేమించె ప్రేమ క్షణికమైనది, అది ఇతర విషయములతో ముడిపడినది. నిర్ణయముతో కూడిన ప్రేమ బహు పటిష్టమైనది. ఎందుకనగా క్రీస్తునందు నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది (రోమీయులకు 5:5)
అన్ని భయాల్నీ మించింది మరణ భయం. మనిషిని అనుక్షణం వెంటాడే భయం అది. మరణం అనివార్యమైనది, అధిగమించలేనిది. ఎంతటివారినైనా అది చివరి క్షణం వరకు వెంబడిస్తుంది... ఒక్క క్రీస్తుని నమ్మిన ఆధ్యాత్మికపరుణ్ని తప్ప, ఒక్క ఆత్మజ్ఞానిని తప్ప, ఆత్మకు మరణం లేదనే పరిజ్ఞానం ఉన్న ఆధ్యాత్మిక చింత గలవాఁడు మరియు అంతర్ముఖుణ్ని తప్ప. ‘శరీరమే నేను’ అనే పూర్తి భ్రాంతిలో జీవిస్తున్న మనిషి, ఆత్మను విశ్వసించలేడు. దేహాన్ని విస్మరించలేడు. వ్యతిరేక దిశగా ప్రయాణిస్తున్న అతడు గమ్యాన్ని ఎన్నడూ చేరుకోలేడు. ఏలయనగా దేవుడు మనలను అయన స్వరూపయందు నిర్మించినాడు. దేవుడు ఆత్మ గనుక మనము ఆత్మసంబందులము. తిరిగి జన్మించిన ఆత్మకు మరణం లేదు గనుక మనము మరణించము గాని నిద్రించి ఈ దేహమును విడిచి తండ్రి యొద్దకు చేరెదము.
మరణ భయం ఎవరికి ఉంటుంది, ఎందుకు ఉంటుంది అని కాదు- అది ఎవరికి ఉండదో, ఎందుకు ఉండదో పరిశీలించడమే ఉత్తమం. అది కేవలము బైబిల్ గ్రంధమునందు గుప్తమైయున్నది. నిజానికి మరణం అనేది మనం భ్రాంతిపడుతున్నట్లు భయావహం కాదు. అసలు అది నిష్క్రమణ కాదు. నిర్మలమైన ఆవిష్కరణ!. క్రీస్తునందు నిద్రించుటయే.
ఎవరెన్ని చెప్పినా, మరణ భయాన్ని మనిషి వీడలేడు. జీవితాన్ని ఆధ్యాత్మికముగా పూజావిధిగా భావించి, దేవుని ఆరాధనలో, దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకొను జీవించే మహాత్ములే, విశ్వాసులే మరణాన్ని ఇష్టముగా స్వీకరించగలరు. క్రీస్తుయేసు దాసుడైన పౌలు ఈ విదముగా పేర్కొన్నాడు “నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము” (ఫిలిప్పీయులకు 1:21)
ఎందుకు, ఎలా? ఇంత ధైర్యముగా పౌలు గారు చెప్పగలిగినాడు!. ఏదైనా మంత్రమో తాత్కాలిక సాధనో ఉన్నపాటున అతడి మరణభయాన్ని పోగొట్టలేవు. జీవిత కాల సాధన అవసరం. సాధకుడు మరణానికి సమాయత్తం కావాలి. దేహ అనిశ్చితి, మరణ అనివార్యత, అది కలిగించే కొన్ని వెసులుబాట్ల పట్ల పూర్ణ జ్ఞానం కలిగినవారు పౌలువలే సమాయత్తం కాగలరు.
మనిషికి ఆ జ్ఞానం ఒక్కటే సరిపోదు. మానవ జన్మ ఉద్దేశాన్ని గ్రహించి, దాన్ని పండించుకునేందుకు సాధన చేయాలి. సకల సత్కర్మములతో విశ్వాసి పునీతుడు కావాలి. అప్పుడు సాధకుడు మరణానికి భయపడడు. పూర్తిగా సిద్ధమై ఉన్న వ్యక్తి ప్రయాణానికి కంగారు పడడు. క్రైస్తవ విలువలతోనే జీవించానన్న ధైర్యం, దేవునికి ప్రీతిపాత్రంగా సాధన చేశానన్న తృప్తి మరణానికి జంకనివ్వవు. దేవుని జీవితాన్ని సాగించి, తనకు ఇచ్చిన బాధ్యతల్ని ప్రసాద భావంతో పూర్తిచేశానన్న అవగాహనే అతడు తుది పయనానికి ఎదురుచూసేలా చేస్తుంది.
జ్ఞానం పొందిన విశ్వాసులు మరణాన్ని కేవలం ఓ మార్పుగా గుర్తిస్తారు. అందుకే వారికి మరణ భయం ఉండదు. ఇచ్చిన కర్తవ్యాన్ని నెరవేర్చినవారిని, మరో నూతన పయనానికి (పర లోక పౌరులుగా) తయారుకావాలన్న బాధ్యత ఉత్తేజితుల్ని చేస్తుంది. ఇక భయానికి అవకాశం ఎక్కడ? వారిలా ప్రతి ఒక్క క్రీస్తు విశ్వసి మరణభయ రాహిత్యంతో జీవించాలి. అందుకు ఎంతగానో సాధన చేయాలి. ఎంత త్వరగా సాధన ప్రారంభిస్తే, అంత త్వరగా ఆ భయం నుంచి విముక్తుడవుతాడు. భయరహితుడై, సాధనను మనసు పూర్తిగా ఆస్వాదిస్తాడు. ప్రశాంతంగా జీవిస్తాడు. భగవంతుడు మానవుణ్ని సృష్టించింది అంతరింపజేయడానికి కాదు. చనిపోతానన్న నిరంతర భయంతో, అతడు నిత్యం చస్తూ బతకడానికీ కాదు.
మనిషికి నిత్య సత్య చైతన్య పదార్థ స్పృహ కావాలి. పాపరహితుడైన మనిషి ప్రకాశంగా మిగులుతాడు. ఆ కాంతి అసలైన జ్యోతిలో అంటే క్రీస్తులో లీనం కావడం ఎంతసేపు!
Image Source:
[https://az616578.vo.msecnd.net/files/responsive/cover/main/desktop/2016/04/11/6359595411830984772109554567_Death.jpg]