Join us LIVE via Facebook or YouTube every Sunday at 5:30 PM (NZ) or 9:15 AM (India)
Daily Devotions and Meditation - Read and get encouraged
United Evangelical Church Logo

మన విశ్వాసమే మన విజయము...

Category:
Author: UEC Team
Date: October 30, 2016

దేవుని వాక్యం

[ecko_quote source="హెబ్రీయులకు 11:6"]విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా [/ecko_quote]

వాక్యధ్యానం

క్రైస్తవ జీవితములో విశ్వాసము అనునది మూల స్తంభము. విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. విశ్వాసము మన మనసుయందు ఏర్పడు ప్రగాడ భావన. ఈ మనసునందు దేవుడు యున్నాడనియు మరియు తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. అపుడే మనము దేవునికి ఇష్టుడైయుండుటకు సాధ్యము. దేవుడు మన మనసుకు అనంత శక్తి మరియు ముఖ్యముగా ఉహించే శక్తి ప్రసాదించినాడు.ఈ ప్రపంచం కంటే, మన మనసు సృష్టించే ప్రపంచమే గొప్పదని అనిపిస్తుంది. వాస్తవం కంటే, వూహే గొప్పదిగా ఉంటుంది’ అనేవారు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌. ‘భావించు. కల కను. అది ఏనాటికైనా నిజమవుతుంది. కోరుకున్నది నువ్వు ఎంత స్పష్టంగా మనోఫలకం మీద చూస్తావో, అంతే త్వరగా అది వాస్తవమవుతుంది’ అని అబ్దుల్‌ కలామ్‌ చెబుతుండేవారు. మనకు మాత్రము  అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు ౩:20 లో ఈ విధముగా బలపర్చుచున్నాడు  “మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున (అనగా మన విశ్వాసము చొప్పున) మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్‌. మన క్రీస్తు మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా మనకు ఇవ్వగల సమర్థుడు.

అత్యంత శక్తిమంతమైన భావన అంత సులువుగా రాదు, కలగదు. దానికి కారణం- మనసు. మనసుకు అటువంటి శిక్షణ లేదు. దానికి భావనాపూర్వకమైన జ్ఞానం కావాలి. విశ్వాసం కావాలి. తగినంత సాధన కావాలి. విశ్వాసము కేవలము దేవుని వాక్యము వినుట ద్వార మరియు వినిన దానిని నమ్మి జీవితములో ఆచరణలో పెట్టుట ద్వార సాధ్యము అవుతుంది. లేనియెడల కేవలము మనము వినువారామే మరియు మనలను మనము మోసపుచ్చు కొనువారము. విశ్వాసులు భావనతోనే బతుకుతారంటారు. భావన లేనిదే అనుభూతి కలగదు. భావించకుండా మనిషి ఏ కలనూ సాకారం చేసుకోలేడు. తర్క వితర్కాల మధ్య వూగుతుంది మనసు. అది తెల్లగా ఉంటే పాలుగా, నల్లగా ఉంటే నీళ్లుగా నమ్ముతుంది. మనం ఎంత లోతుగా నమ్మకంలో విలీనమవుతామో, అంత తొందరగా ఆ విషయానికి చేరుకుంటాం. నిజం చేసుకుంటాం. అందువలన క్రైస్తవులు తమ మనసును దేవుని వాక్యముతో నింపి అ వాక్య ప్రకారము జీవించుట ద్వార, దేవునికి ఇష్టుడైయుండుట సాధ్యము మరియు తద్వారా విశ్వాసములో పరిపక్వము పొందగలరు.

అన్నింటికీ విశ్వాసమే పునాది. ఆ విశ్వాసానికి మరియు నమ్మకానికి దృశ్యమే ఆధారం. దృశ్యానికి భావనే ఆధారం. భావనకు జ్ఞానమే కారణం. జ్ఞానానికి కారణం- తెలిసికొనవలెనను కుతూహలము మరియు జిజ్ఞాస. దానికి ‘నేను’ కారణం. ‘నేను’ అనేది లేకుంటే జగత్తు లేదు.సర్వ జగత్తు యెహోవా సృష్టి. ఆయనే “ నేను”. The great “I am”. ‘నేనే’ మూలం. ఇదంతా ఒక వలయం.కళ్లు మూస్తే భావం. కళ్లు తెరిస్తే భావం. ఆ భావాల పరంపరతోనే బతుకు సాగుతుంది. ఎక్కువ తక్కువలంటూ విచారించకూడదు. నలుపు తెలుపులుగా విడగొట్టకూడదు. వైరుధ్య, వైవిధ్యాల మధ్య మనసును పరుగెత్తించకూడదు. అలాంటివారు గొప్ప భావాలు పొందలేరు.

అద్భుతమైన ప్రపంచాన్ని మన ప్రభువు  మన ముందుంచాడు. బుద్ధికి ప్రేరణ ఇచ్చి ముందుకు నడిపించే లోతైన భావం ఎప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించగలడు. దేవుడు ఎప్పుడు తన యందు విశావసిoచెవారికీ తన యొక్క ప్రేమ లోతును కనుక్కోమని సెలవించుచున్నాడు . విశ్వాసి దాన్ని కనుగొనాలి. ఒడిసి పట్టుకోవాలి. అలా అన్వేషణ సాగిస్తే, సత్యం తెలుస్తుంది. అలాంటి సత్యాలన్నీ ఒక మహా సత్యానికి అనుసంధానమై ఉంటాయి. ఆ సత్యమే యేసు ప్రభువు.భక్తిభావంతో సర్వమూ సాధించగలం. ప్రేమభావంతో, ఇక ఏదీ మిగలకుండా చేయగలం. ప్రపంచాన్ని దేవుని మనసు సృష్టించింది. అందుకే మనిషి- ప్రేమ అనే భావాన్ని దైవభావంగా స్వీకరించాలి. అప్పుడు ప్రతి భావమూ ఆనందమే!

తరవాత ఏంటి ( మన కర్తవ్యం)

దైవభావంలోనే దైవం ఉన్నాడు. విశ్వసి ఎలా భావిస్తే అలా, ఆయన అనుభవమిస్తాడు. హృదయపూర్వకమైన ప్రతి భావనా విశ్వాసిని దైవానికి దగ్గర చేస్తుంది. దైవ భావమే మనిషి. మనిషిలోని భావమే దైవం. అంటే, భావం లేకుండా మనిషి లేడు. ఆ భావ సంపదనే మరియు విశ్వాస జీవితమే  బైబిల్  ఆధ్యాత్మికత జీవితముగా (spiritual life)  వర్ణించాయి

ప్రత్యేక అబినందనులు: జొన్నలగడ్డ రవీందర్ మరియు  ఆనంద స్వామి

Image Source: 

[http://lifewords.org/wp-content/uploads/2015/03/Victory.jpg]

Copyright © 1991-2023 United Evangelical Church Global
Made with love for Jesus Christ of Nazareth
crossmenu