
[ecko_quote source="యోహాను 3:16-17"]దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు [/ecko_quote]
మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు. మంచిని తలపెట్టిన ఎడల మనిషికద్దు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే. జీవ కోటి సర్వములో సేశాసతుడు మానవుడే. గ్రహరసులందిగామించి ఘనతా రాల పథము నుంచి, గంగానాతర రోదసిలో ఆకాశ నక్షత్రములు ధాటి, చంద్ర లోకమైన, గ్రహ రాసుల లోకమైన, దేవుడు అనుగ్రహించిన జ్ఞానం వలన జయించి మరల భువికి తిరిగి రాగలిగెనని డాక్టర్ ఆరుద్ర గారు చాల చక్కగా మానవుని శక్తిని మరియు యుక్తిని “మానవుడే మహనీయుడు” అనే పాట ద్వార శ్రోతలను ఆకట్టుకున్నాడు.
మనిషి గురించి మనవాళ్లు చెప్పిన మాటలు ఒక్కోసారి మనకే ఎందుకో నమ్మశక్యం కావు. ‘జంతూనాం నరజన్మ దుర్లభం’ అనేవారు జ్ఞానులు. ‘మానవుడే మహనీయుడు’ అంటారు కవులు. ఇటువంటి మాటలు సామాన్యుల కోసం కాదంటూ, చాలామంది అసలు పట్టించుకోరు. ఇలాంటివి జీవన వాస్తవికతకు దూరమనీ భావిస్తుంటారు! నిజానికి ఆధునిక మానవుడు సాధించిన ప్రగతి అనితర సాధ్యమైంది. ఆర్థిక, సామాజిక రంగాల్లో కనిపిస్తున్న అభివృద్ధి అసాధారణమైంది. ఆ ఫలాలు- ఆధ్యాత్మిక రంగంలో మరియు దేవుని కనుగొనుట అను విషయంలో వెలితి కారణంగా, అవసరమైనంత మేరకు అందుబాటులోకి రాకుండా పోయాయి. అందువల్ల తాను గొప్పవాణ్ని అనే భావన, నమ్మకం అతడి మనసులోకి ఇంకి పోయాయి. ‘ఈక దేవుడే లేడు అనే స్థాయికి దిగజారిపోయాడు.
బైబిల్ గ్రంధమునందు హెబ్రీ 2:6-8 ఈవిధముగా చెప్పబడియున్నది“నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటివాడు? నీవు నీకంటే వానిని కొంచెము తక్కువవానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి, నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి”. దూతలే ఆశ్చర్యపడేంత ప్రజ్ఞ, బుద్ధిశీలత నేటి మనిషి సొత్తు. సముద్రపు లోతును, గగనపు వైశాల్యాన్ని అతడు లెక్కకట్టగలడు. నీటిలో నివసించగలడు. గాలిలో ఎగరగలడు. చిత్రం ఏమిటంటే ఇన్ని సాధించిన మానవుడు- భూమిమీద బతకలేకపోతున్నాడు! అంటే, ఏది సహజమో దానికి అతడు దూరమవుతున్నాడు. సృష్టి గమనాన్ని అంచనా వేయగలిగే మనిషి- తన మనసు ఏ దారిలో పోతోందో తెలుసుకోలేకపోతున్నాడు. ‘మనసే మానవుడు’ అని చెప్పి నారు లోక జ్ఞానులు. మనసు ఎటు పోతోందో తెలియడం లేదంటే, మనిషి ఎటు పోతున్నాడో తేలడం లేదని అర్థమవుతుంది.
అన్ని రంగములలో ప్రగతి సాధించిన మానవుడు పాపము విషయములో మాత్రం ఇంకా ఓనమాలు నేర్చుకునే స్టితిలోఉన్నడు. పాపము మానవుని శాంతిని సమాధానమును మరియు నెమ్మదిని లేకుండా చేస్తూ వారిని నిరాశతో ఈ జీవన యానం సాగిoప చేయుచున్నది. మానవుని మనసు అతని అధీనములో లేదు. అతడు పాపమునకు దాసుడు మరియు పాపం పై పాపం సమకూర్చుకొనుచున్నాడు.
ఎందరో మహానుభావులు, సినిమా నటులు, వ్యాపారవేతలు మరియు రాజకీయనేతలు తమ జీవితములలో నెమ్మది కొరవడి ఆత్మహత్యతో తమ జీవితమును ముగించుకొనుచున్నారు. పాపమునకు వచ్చు జీతం మరణము ( రోమ 6:23). దేవునిలో తప్ప మానవుడికి ముక్తి దేనిలో మరి లేదు. ఆధ్యాత్మికత పాత్ర కీలకం అవుతున్నదీ ఇక్కడే! అద్భుత జీవ రసాయనంగా మన పెద్దలు దేవునితో సాంగత్యం మానవుని జీవితముకు పరమార్థం అని పోల్చినారు. మనిషికి మనసుతో చెలిమి పెంచడంలో ఆధ్యాత్మికతది/వాక్యద్యానం ముఖ్య భూమిక. మంచుకు చల్లదనం సహజ గుణం. కాటుకకు నలుపు సహజ లక్షణం. సూర్యుడి చుట్టూ తిరగడం భూమికి నిత్యకృత్యం. అలాగే, మనసుకు చంచలత్వం సహజ లక్షణమని బైబిల్ గ్రంధం చెబుతుంది. కోరికలు దుఃఖానికి కారణాలని తెలిసీ, వాటి వైపు మనసు పరుగులు పెడుతుంది. దుఃఖాన్ని కొనితెచ్చుకుంటుంది. అది చేటు తెస్తుందని వివేకం మనిషిని పదే పదే హెచ్చరిస్తుంది. ఎద్దుకు ముకుతాడులా, ఏనుగుకు అంకుశంలా- చంచలమైన మనసును ఆధ్యాత్మికత మంచి దారికి తెస్తుంది. అందుకే అతడు వివేకవంతుడు కావాలి అని జ్ఞాని అయిన సొలొమోను సామెతలు గ్రంధంలో పలికినాడు. ఆ వివేకం కేవలము క్రీస్తు ద్వారానే సాధ్యం. కేవలము పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మానవుడు మనసును జయించే మార్గాన్ని పొందగలడు. శక్తిచేత నైనను బలముచేతనై ననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను(జెకర్యా 4:6)
మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు అయిన తన పాప జీవితం మాత్రం తాను మార్చు కొనలేని శక్తిహీనుడు. జన్మ పాపం మరియు కర్మ పాపము మనువుని వెంటాడుచున్నవి. ఏ మానవుడు తన తోటి మానవుల్ని పాపము నుoఛి విముక్తి కల్పించలేడు. అందుకే దేవాది దేవుడు తానే ఈ లోకములో క్రీస్తు ప్రభువుగా జన్మించి మనువుని పాపముల కొరకు సిలువలో ప్రాణం అర్పించి మానవజాతిని తమ పాపము నుoఛి విడిపించినాడు.
అందువలన యేసు ప్రభువు ఒక్కరే ఈ ప్రపంచములో ఈలాగున చెప్పగలిగినాడు ‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి (మత్తయి 11:28) యేసు ప్రభువు వద్దకు మనం వెళ్ళవలసిన అగత్యం ఏoతేయిన వుంది. యేసు ప్రభువే మనకు దీక్కు.
ఈ ప్రక్రియ అంతటికీ ఆధ్యాత్మిక దృక్పథమే మరియు క్రీస్తు మూల విరాట్టు. మనిషి సర్వ సమగ్ర ప్రగతి సౌధానికి ఇదే తొలి మెట్టు!
Image Source:
[http://s.newsweek.com/sites/www.newsweek.com/files/styles/feature/public/2015/03/27/0327scottkelly01.jpg]