యేసయ్య నిన్నే సేవింతును
ఆరాధింతును స్తుతింతును (2)
బంధీనైపోయ నీలో మునిగి తేలాక
నావల్ల కాదయ నిను వీడి ఉండుట (2)
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య (2)
నను వీడని నీ ప్రేమను
యెడబాయని నీ కరుణను
వెన్నంటి ఉండే కృపలను
వర్ణించగలనా (2)
నింపావు నీ అగ్నితో
నింపావు నీ శక్తితో
నింపావు జీవ జలముతో
నిన్నే మహిమపరతును (2)
నీలో మునిగి తేలాక
నే విడుదలనే పొందా
నీలో మునిగి తేలాక
నే ఉప్పోంగి పోయా
నీలో మునిగి తేలాక
నే జీవమునే పొందా
నీలో మునిగి తేలాక
నే బంధీనైపోయా