ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి (2)
నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదను… నా యేసయ్య – నా జీవితము నీకేనయ్యా (2)
హల్లేలూయ.. హల్లేలూయ..
భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన
నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2)
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ..
సన్నుతించెదనూ… (2)
హల్లేలూయ.. హల్లేలూయ..
లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి (2)
నిర్దోషిగ చేయుటకై – నీవు దోషివైనావు
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ..
సన్నుతించెదనూ… (2)
హల్లేలూయ.. హల్లేలూయ..
యే యోగ్యత లేకున్నా, నను ఎన్నుకొంటివి
విలువైన నీసేవలో సాధనముగ మలచితివి (2)
నాదైర్యము నీవెగా, నా రక్షణాధారమ…
నీదు సాక్షిగా ఇలలో జీవింతును…
సన్నుతించెదనూ… (2)
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి (2)
నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2)