తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

మేలుకో మహిమ రాజు|Meluko Mahima Raaju

మేలుకో! మహిమ రాజు / వేగమే రానై యున్నాడు (2) / పరమునుండి – బూర ధ్వనితో / అరయు నేసు – ఆర్భాటముతో (2) / సర్వలోకము – తేరిచూచును / త్వరపడు ఓ ప్రియుండా (2) ||మేలుకో|| / గురుతులెల్ల – ధరణియందు / సరిగ చూడ – జరుగుచుండ (2) / చిరునవ్వుతో – చేరి ప్రభుని / త్వరపడు ఓ ప్రియుండా (2) ||మేలుకో|| / క్రీస్తునందు – మృతులెల్లరు / కడబూర – మ్రోగగానే (2) / క్రీస్తువలె – తిరిగి లేతురు / లేతువా? నీవు ప్రియుడా (2) ||మేలుకో|| / అరయంగ – పరిశుద్ధులు / మురిసెదరు – అక్షయ దేహులై (2) / పరమందు – ప్రభుక్రీస్తు / నిరతము – ఓ ప్రియుండా (2) ||మేలుకో|| / కరుణలేని – ఓ మరణమా / నిరతము నీకు జయమగునా (2) / మరణ సంహా – రుండేసు / త్వరగా – రానై యున్నాడు (2) ||మేలుకో|| / మాంసలోక – పిశాచాదులు / హింస పరచ – విజృంభించిన (2) / లేశమైనను – జడియకుము / ఆశతో – కాచుకొనుము (2) ||మేలుకో|| / పాపమును – చేయకుమా / రేపకుమా – దైవ కోపమును (2) / శాపమును – తప్పుకొని / శ్రద్ధతో – కాచుకొనుమా (2) ||మేలుకో||

మేం క్రైస్తవులం|Mem Kraisthavulam

ప్రేమ క్షమలను సమపాళ్లుగా / విశ్వాసమే లక్ష్యంగా / మా జీవితాలనే సాక్ష్యంగా / నిజదేవుని జనాంగంగా (2) / పిలువబడిన వారమే మేము / సిగ్గుపడని వారమే మేము (2) / మేం క్రైస్తవులం క్రీస్తనుచరులం / మేం క్రైస్తవులం ప్రేమకు జ్ఞాపికలం / మేం క్రైస్తవులం పరలోక దీపికలం / మేం క్రైస్తవులం బాధ్యత గల పౌరులం / మేం క్రైస్తవులం క్రైస్తవులం / మేం క్రైస్తవులం క్రైస్తవులం / మతానికి అతీతులం / జాతి వర్ణ వర్గాలనేకం / మేం యేసు రక్తంతో కొనబడిన వారం / మేం సత్యమార్గంలో నడిచే వారం (2) / యేసు నీ జీవితమే మాకు పాఠంగా / మా బ్రతుకులకే ఒక యాగంగా / చేసుకొన్న వారమే మేము / ఏక శరీరమై ఉన్నాము (2) ||ప్రేమ|| / మనుష్యులను ప్రేమిస్తాము / దైవ ప్రేమనే ప్రకటిస్తాము / ఏ శోధనకైనా తలవంచని వారం / దేవుని చెంత మోకరించే వారం (2) / లోకం మమ్ములను వేధిస్తున్నా / చులకనగా చూసి నిందిస్తున్నా / బాధను సహించే వారం / మేం శత్రువునైనా క్షమిస్తాము (2) / పాపం అంటే శరీరంతో చేసేదే కాదు / మనసులో తలంచేది అంటాం / ఎందుకంటే మేం క్రైస్తవులం / ఏ మనిషి దేవుని రూపాన్ని చూడలేదు / అందుకే విగ్రహారాధన మేం చెయ్యం / ఎందుకంటే మేం క్రైస్తవులం / దేవుడంటే సృష్టిని చేసిన వాడు / ఆ దేవునికి విదేశీ దేవుడనే మాటే లేదంటాం / ఎందుకంటే మేం క్రైస్తవులం / ఎన్ని బాధలు పెట్టి హింసించినా / ప్రేమతో క్షమిస్తాము / ఎందుకంటే మేం క్రైస్తవులం ||ప్రేమ||

మేము భయపడము|Memu Bhayapadamu

మేము భయపడము – ఇక మేము భయపడము / ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు (2) ||మేము|| / దైవ భ్రష్టులమైన మమ్ము / దివ్యంపుగా రక్షించే (2) / దీవారాత్రులు దేవుడే కాయును ||మేము|| / శత్రు కోటి మమ్ము జుట్టన్ / పాతాళము మ్రింగ జూడన్ (2) / నిత్యుడు యేసు నిత్యము కాయును ||మేము|| / అగ్ని పరీక్షల యందు / వాగ్ధానమిచ్చె మాతో నుండ (2) / ఏ ఘడియైనను విడువక కాయును ||మేము|| / బలమైన ప్రభు హస్తములు / వలయము వలె మమ్ము జుట్టి (2) / పలు విధములుగా కాపాడు మమ్ము ||మేము|| / కునుకడు మన దేవుడు / యెన్నడు నిద్రించడు (2) / కను పాపగా మము కాపాడునెప్పుడు ||మేము|| / జీవిత కష్ట నష్టములు / ఆవరించి దుఃఖపరచ (2) / దేవుడొసంగిన ఈవుల నెంచుచు ||మేము|| / ఇహమందు మన శ్రమలన్ని / మహిమకు మార్చెడు ప్రభున్ (2) / మహిమపరచి మ్రొక్కెదములలో ||మేము||

మోకాళ్ళ అనుభవము|Mokaalla Anubhavamu

మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా / విసుగక ప్రార్ధించే మనసు ఉన్నదా (2) / వెలిగే దీపానికి నూనె అవసరం / నీ ఆత్మా దీపానికి ప్రార్ధనవసరం (2) / నూనె లేని దీపము ఆరిపోవును / ప్రార్ధించలేని జీవితము పతనమవ్వును (2) ||మోకాళ్ళ|| / శోధనలో పడకుండా ప్రార్ధించుము / శోధన తప్పించుటకు ప్రార్ధించుము (2) / కన్నీటితో ప్రార్ధించిన హిజ్కియాను చూడుము (2) / మరణము తప్పించబడి ఆయుష్షు నొందెను (2) ||మోకాళ్ళ|| / ప్రతి నిమిషమందు మనము ప్రార్ధించగలిగినా / పరలోక సంతోషం దేవుడిచ్చును (2) / పట్టుదలతో ప్రార్ధించిన ఏలీయాను చూడుము (2) / ఆకాశ జలములను మూసివేసెను (2) ||మోకాళ్ళ|| / అడుగుడి మీకివ్వబడును తట్టుడి మీకు తీయబడును / అన్నాడు మన యేసు అడిగి చూడుము (2) / సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడు (2) / అడిగిన వారందరికి తప్పక దయచేయును (2) ||మోకాళ్ళ||

మూడునాళ్ళ ముచ్చట కోసం|Moodunaalla muchchata kosam

మూడునాళ్ళ ముచ్చట కోసం / ఈ మనిషి పడే తపన చూడరా (2) / నీటిబుడగలాంటి జీవితం / ఏ నాడు సమసిపోవునో ఎరుగం (2) / మనిషికి తన మనసే చేరసాలరా / మమతలు మమకారాలే బంధాలురా (2) / వల్లకాటి వరకేరా భవబంధాలు / అవి కళ్లానికి చేరవురా అనుబంధాలు (2) / కల్లలైన కళలు మానుకో / ఎల్లవేళలా ప్రభువని వేడుకో (2) ||మూడునాళ్ళ|| / ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము / అది కనిపించీ మాయమయే రంగులవలయం (2) / గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం / అది పాపానికి జీతమురా మనిషికి మరణం (2) / నిత్యమైన సుఖము వెదకరా / నిరతము ఆ ప్రభుని వేడరా (2) ||మూడునాళ్ళ|| / తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు / అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా (2) / జిగటగల ఊభినుండి పైకి లేపి / నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు (2) / తీర్పు తీర్చబడకమునుపే / తప్పక ఆ ప్రభుని కోరరా (2) ||మూడునాళ్ళ||

మోసితివా నా కొరకై|Mosithivaa Naa Korakai

మోసితివా నా కొరకై సిలువ వేదనను / గొల్గొతా నీవు క్రీస్తుకై నిలచితి వేదనలో / సిలువలో రక్తము పాపికి రక్షణ విలువగు మోక్షమును / పాప క్షమాపణ పాపికి ముక్తి పరమ ప్రభుని గనుము ||మోసితివా|| / అమ్మా ఇదిగో నీ సుతుడు వ్రేళాడుచు పిలిచెన్ / ఏలీ ఏలీ లామా సబక్తానీ చే విడిచి / దాహము తీర్చను చేదు చిరకను అందించిరిగా / ముండ్ల మకుట నీ శిరముపై గృచ్చిరి యూదుల రాజని / హేళన చేసిరి గుద్దిరి ఉమిసిరి కొరడా దెబ్బలతో / దేవ నా దేవా ఏల నా చేయి విడనాడితివిలలో ||మోసితివా|| / తర తరాల ఈ లోకం – యుగయుగాల నీ నామం / తరగని వేదన నీకు సిలువ విజయమునకే / కల్వరి ధారా నాథా పాపికి ప్రాణ ప్రదాత / విలువగు రక్త ప్రదాత ఆశ్రిత రక్షణ రాజా / చిందిన రక్తము విలువగు ప్రాణము లోక విమోచనకే / అందదు ఊహకు అంతము ఎప్పుడో సిద్ధపరచు ప్రభువా ||మోసితివా||

మోయలేని భారమంత|Moyaleni Bhaaramantha

మోయలేని భారమంత సిలువలో మోసావు / నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు (2) / అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు / మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు / నాదు గతిని మార్చావు – (2) / కడలి పై నడిచిన పాదాలు / సిలువ బరువుకు తడబడి పోయే / స్వస్థతలు చూపిన హస్తములు / సిలువలో శీలలతో వ్రేళాడే (2) / ఇంత ఘోరము మోపిన నేరము / నేను చేసిన పాప భారము (2) || మోయలేని || / జయము నీకని పలికిన జనము / మహిమ ఏదని నిను నిలదీసిరి / పాపములు క్షమియించిన నిన్ను / పాపివని పలుమారులు తెలిపిరి (2) / తాకినంతనే మహిమ నొసగిన / నీదు వస్త్రము చీట్ల పరము (2) || మోయలేని || / దైవ సుతుడవు అయినా గాని / దొంగలతో దోషిగా నిను చేర్చిరి / మధుర వాక్యము నేర్పిన నోటికి / చేదు చిరకతో దాహము తీర్చిరి (2) / ఇంత జరిగిన ఎంత కరుణ / వదలవేమయ నీ క్షమాపణ (2) || మోయలేని ||