Songs sorted by number of likes. 1604 songs total.
మధురం మధురం నా ప్రియ యేసు / నీ ప్రేమలో నను నే మరచితినయ్యా (2) / వాడిన పువ్వులు వికసింప చేసి / పరిమళమిచ్చెడి యేసుని ప్రేమ (2) / చెదరిన మనసును చెలిమితో చేర్చి / సేదదీర్చిన యేసుని ప్రేమ (2) ||మధురం|| / స స ని ప మ మ / రి రి గ రి రి గ ని ని స (2) ||మధురం|| / ప ప ని స స ని స రి స స స ని స ని ప ప ని స / స స స గ రి రి రి గ స స స రి ని ని ని స ని స ని ప ప ని స (2) / ని స ని ప ప ని స / మధురం… మధురం… / అతిమధురం నీ నామం – (2) / కలువరి గిరికరుదెంచితి ప్రభుతో కలుషమెల్ల బాపే / కమణీయమైన కలువరి ప్రేమకు సాక్షిగ నను నిలిపె / ఎటుల నే… మరతును… / ప్రభుని ప్రేమ ఇలలో (2) ||మధురం||
మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం / అమరం అతి విజయం – నీ సిలువ రక్తమే విజయం / ఇమ్మానుయేలుడ నీ ప్రేమ మధురం – నీకే నా వందనం (2) / మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం (2) ||మధురం|| / నా శిక్షకై నా నిందలకై – ప్రాణము పెట్టిన ప్రేమ / నిందలు నిట్టూర్పులు – సేదదీర్చిన ప్రేమ (2) / సర్వోన్నతుడా సహాయకుడా / మరువగలనా నీ ప్రేమను (2) ||మధురం|| / సత్యమును నాకు కేడెమును – ధరియింప చేసిన ప్రేమ / కనికరమును కలిగించగను – కల్వరికేగిన ప్రేమ (2) / మహోన్నతుడా మహా ఘనుడా / మరువగలనా నీ ప్రేమను (2) ||మధురం||
మధురమైనది నా యేసు ప్రేమ / మరపురానిది నా తండ్రి ప్రేమ (2) / మరువలేనిది నా యేసుని ప్రేమ (2) / మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ / ప్రేమా… ప్రేమా… / ప్రేమా… నా యేసు ప్రేమా (2) ||మధురమైనది|| / ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని / నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని (2) / చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి (2) / నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం ||ప్రేమా|| / పర్వతములు తొలగినా మెట్టలు గతి తప్పినా / ఎగసి పడే అలలతో కడలే గర్జించినా (2) / మరణపు ఛాయలే దరి చేరనీయక (2) / కౌగిట దాచిన నీ ప్రేమ మధురం ||ప్రేమా|| / నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి / మార్గమును చూపి మన్నించితివి (2) / మరణపు ముల్లును విరచిన దేవా (2) / జీవము నొసగిన నీ ప్రేమ మధురం ||ప్రేమా||
మహాత్ముడైన నా ప్రభు / విచిత్ర సిల్వ జూడ నా / యాస్తిన్ నష్టంబుగా నెంచి / గర్వం బణంగ ద్రొక్కుదున్ / నీ సిల్వ గాక యో దేవా / దేనిన్ బ్రేమింప నీయకు / నాన్నాహరించు సర్వమున్ / నీ సిల్వకై త్యజింతును / శిరంబు పాద హస్తముల్ / సూచించు దుఃఖ ప్రేమలు / మరెన్నడైన గూడెనా / విషాద ప్రేమ లీ గతిన్? / ముండ్లన్ దుర్మార్గులల్లిన / కిరీట మేసు కుండినన్ / ఈ భూ కిరీటములన్ని / దానం దూగంగ జాలు నే? / లోకంబు నే నేర్పించిన / నయోగ్యమైన యీవి యౌ / వింతైన యేసు ప్రేమకై / నా యావజ్జీవ మిత్తును / రక్షింప బడ్డ లోకమా / రక్షింప జావు బొందిన / రక్షకు-డేసు నిన్ సదా / రావంబు తోడ గొల్వుమా
మహిమ నీకే ఘనత నీకే – నీతి సూర్యుడా (2) / న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకే ఆరాధన (2) / ధనవంతులను అణచేవాడవు / జ్ఞానులను సిగ్గుపరచువాడవు (2) / దరిద్రులను లేవనెత్తువాడవు – నీవే రాజువు (2) / యుద్ధవీరుడా శూరుడా / లోకాన్ని గెలిచిన యేసయ్యా (2) / మార్గమే తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావు / నెట్టివేయబడిన యోసేపుచే – అనేకులను కాపాడినావు ||దరిద్రులను|| / గొఱ్ఱెలకాపరియైన దావీదును – అనేకులకు రాజుగా చేసినావు / నోటి మాంద్యముగల మోషేచే – అనేకులను నడిపించినావు ||దరిద్రులను||
మహిమ ఘనతకు అర్హుడవు / నీవే నా దైవము / సృష్టికర్త ముక్తి దాత (2) / మా స్తుతులకు పాత్రుడా / ఆరాధనా నీకే ఆరాధనా నీకే / ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే (2) / ఆరాధనా నీకే ఆరాధనా నీకే / మన్నాను కురిపించినావు / బండనుండి నీల్లిచ్చినావు (2) / యెహోవా ఈరే చూచుకొనును / సర్వము సమకూర్చును ||ఆరాధనా|| / వ్యాధులను తొలగించినావు / మృతులను మరి లేపినావు (2) / యెహోవా రాఫా స్వస్థపరచును / నను స్వస్థపరచును ||ఆరాధనా||
మహిమాన్వితము మనోహరము / నీ దివ్య సన్నిధానము (2) / నిన్నే కోరానయ్య – నిన్నే చేరానయ్య / నీవే కావాలని యేసయ్య (2) ||మహిమాన్వితము|| / కోరలేదు ధన సంపద / కోరినాను నిను మాత్రమే (2) / ఐశ్వర్యము కంటే అధికుడవు (2) / నీ ఆశ్రయమే చాలునయా (2) ||నిన్నే|| / జీవపు ఊటలు కల చోటికి / జీవ నదులు పారే చోటికి (2) / ప్రేమతో పిలచిన నా యేసయ్యా (2) / నా దాహమును తీర్చెదవు (2) ||నిన్నే|| / తేజోనివాసుల నివాసము / చేరాలనునదే నా ఆశయ్యా (2) / యుగయుగములు నే నీతో ఉండి (2) / నిత్యారాధన చేయాలని (2) ||నిన్నే||
మహిమగల తండ్రి – మంచి వ్యవసాయకుడు / మహితోటలో నర మొక్కలు నాటించాడు (2) / తన పుత్రుని రక్తనీరు – తడి కట్టి పెంచాడు / తన పరిశుద్ధాత్మను – కాపుగా వుంచాడు (2) / కాయవే తోటా – కమ్మని కాయలు / పండవే చెట్టా – తియ్యని ఫలములు (2) ||మహిమ|| / నీతి పూత జాతి కర్త – ఆత్మ సుతా ఫలములు / నీ తండ్రి నిలువచేయు – నిత్య జీవ ఫలములు (2) / అనంతమైన ఆత్మ బంధ – అమర సుధా కాంతులు (2) / అనుకూల సమయమయ్యె – పూయు పరమ పూతలు (2) ||కాయవే|| / అపవాది కంటబడి – కుంటుబడి పోకు / కాపుకొచ్చి చేదు పండ్లు – గంపలుగా కాయకు (2) / అదిగో గొడ్డలి వేరు – పదును పెట్టియున్నది (2) / వెర్రిగా చుక్కలనంటి – ఎదిగి విర్రవీగకు (2) ||కాయవే|| / కలువరి కొండలో పుట్టి – పారిన కరుణా నిధి / కలుషమైన చీడ పీడ – కడిగిన ప్రేమానిధి (2) / నిజముగాను నీవు – నీ సొత్తు కావు (2) / యజమాని వస్తాడు – ఏమి ఫలములిస్తావు (2) ||కాయవే|| / ముద్దుగా పెంచాడు – మొద్దుగా నుండకు / మోదమెంతో ఉంచాడు – మోడుబారి పోకు (2) / ముండ్ల పొదలలో కృంగి – మెత్తబడి పోకు (2) / పండ్లు కోయ వచ్చువాడు – అగ్నివేసి పోతాడు (2) ||కాయవే||
మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా / మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము (2) / మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా / నీవంటి వారు ఎవరు – నీవంటి వారు లేరు (2) / స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం / నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము (2) ||మహోన్నతుడా|| / అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా / మా కరములను జోడించి మేము మహిమ పరచెదం (2) ||మహోన్నతుడా||
మహోన్నతమైన సీయోనులోన సదా కాలము / నా యేసయ్యతో జీవించుటే (2) – నా ఆశ (2) / విరిగిన మనస్సు నలిగిన హృదయం / నాకు కావాలయ్యా.. / యేసయ్యా నాకు కావాలయ్యా (2) / ఆరాధనా ఆరాధనా (2) / ఆరాధనా ఆరాధనా (2) ||మహోన్నతమైన|| / లోకమంతయు నష్టముగా ఎంచి / సంపాదించుకొంటిని – నా యేసయ్యను నేను (2) / బ్రతుకు మూలమునైనా – చావు మూలమునైనా (2) / ఘనపరతును నా దేవుని / స్తుతియింతును నా దేవుని – (2) ||విరిగిన|| / మహా మహిమతో నీవొచ్చు సమయమున / కన్నులారా చూచెదను – నా యేసయ్యను నేను (2) / హింస మూలమునైనా – కరువు మూలమునైనా (2) / సంతోషింతును నా యేసుతో / ప్రకాశింతును ఆ మహిమలో – (2) ||విరిగిన||
మహోన్నతుడా నీ చాటున నే నివసించెదను / సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను / బలవంతుడా నీ సన్నిధినే / నే ఆశ్రయించెదా అనుదినము / యేసయ్యా యేసయ్యా / రాత్రివేళ కలుగు భయముకైనా / పగటిలో ఎగిరే బాణముకైనా / చీకటిలో సంచరించు తెగులుకైనా / దినమెల్లా వేధించు వ్యాధికైనా / నే భయపడను నే దిగులు చెందను / యెహోవా రాఫా నా తోడు నీవే / యేసయ్యా యేసయ్యా / వేయిమంది నా ప్రక్క పడిపోయినా / పదివేలు నా చుట్టు కాలినను / అంధకారమే నన్ను చుట్టుముట్టినా / మరణ భయమే నన్ను వేధించినా / నే భయపడను నే దిగులు చెందను / యెహోవా నిస్సి నా తోడు నీవే / యేసయ్యా యేసయ్యా / నిను ప్రేమించువారిని తప్పించువాడా / నిన్నెరిగిన వారిని ఘనపరచువాడా / నా యుద్ధము జయించి లేవనెత్తువాడా / కృప వెంబడి కృప చూపించువాడా / యేసయ్యా యేసయ్యా / నే భయపడను నే దిగులు చెందను / యెహోవా షాలోం నా తోడు నీవే
మహోన్నతుడా మా దేవా / సహాయకుడా యెహోవా (2) / ఉదయ కాలపు నైవేద్యము / హృదయపూర్వక అర్పణము (2) / మా స్తుతి నీకేనయ్యా / ఆరాధింతునయ్యా (2) ||మహోన్నతుడా|| / అగ్నిని పోలిన నేత్రములు / అపరంజి వంటి పాదములు (2) / అసమానమైన తేజో మహిమ / కలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి|| / జలముల ధ్వని వంటి కంట స్వరం / నోటను రెండంచుల ఖడ్గం (2) / ఏడు నక్షత్రముల ఏడాత్మలను / కలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి|| / ఆదియు అంతము లేనివాడా / యుగయుగములు జీవించువాడా (2) / పాతాళ లోకపు తాళపు చెవులు / కలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి||