Songs sorted by number of likes. 1604 songs total.
కలువరి గిరి సిలువలో పలు శ్రమలు పొందిన దైవమా (2) / విశ్వ మానవ శాంతి కోసం ప్రాణమిచ్చిన జీవమా (2) / యేసు దేవా నీదు త్యాగం వివరింప తరమా (2) ||కలువరి|| / కరుణ లేని కఠిన లోకం కక్షతో సిలువేసినా (2) / కరుణ చిందు మోముపైన గేలితో ఉమ్మేసినా (2) / ముళ్ళతోన మకుటమల్లి / నీదు శిరమున నుంచినా – (2) ||కలువరి|| / జాలి లేని పాప లోకం కలువలేదో చేసినా (2) / మరణమందు సిలువలోన రుధిరమే నిను ముంచినా (2) / కలుష రహిత వ్యధను చెంది / అలసి సొలసి పోతివా – (2) ||కలువరి||
కలువరిగిరిలో సిలువధారియై / వ్రేలాడితివా నా యేసయ్యా (2) / అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను / ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా (2) / నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా / నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా (2) ||కలువరిగిరిలో|| / దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను / ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను (2) / ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి / నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా (2) ||కలువరిగిరిలో||
కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు / పలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను (2) / నీ కోసమే అది నా కోసమే (2) / ప్రతివానికి రూపు నిచ్చె / అతనికి రూపు లేదు (2) / పదివేలలో అతిప్రియుడు / పరిహాసములనొందినాడు (2) ||నీ కోసమే|| / వధ చేయబడు గొర్రెవలె / బదులేమీ పలుకలేదు (2) / దూషించు వారిని చూచి / దీవించి క్షమియించె చూడు (2) ||నీ కోసమే|| / సాతాను మరణమున్ గెల్చి / పాతాళ మందు గూల్చి (2) / సజీవుడై లేచినాడు / స్వర్గాన నిను చేర్చినాడు (2) ||నీ కోసమే||
కల్వరి గిరిపై సిలువ భారం / భరించితివా ఓ నా ప్రభువా / నా పాపముకై నీ రక్తమును / సిలువ పైన అర్పించితివా (2) / దుష్టుండనై బల్లెము బూని / గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన (2) / కేక వేసి నీదు ప్రాణం / సిలువ పైన అర్పించితివా (2) ||కల్వరి|| / మూడు దినములు సమాధిలో / ముదము తోడ నిద్రించితివా (2) / నా రక్షణకి సజీవముతో / సమాధిన్ గెల్చి లేచిన తండ్రి (2) ||కల్వరి|| / ఆరోహణమై వాగ్ధానాత్మన్ / సంఘము పైకి పంపించితివా (2) / నీ రాకడకై నిరీక్షణతో / నిందలనెల్ల భరించెదను (2) ||కల్వరి||
కల్వరి ప్రేమను తలంచునప్పుడు / కలుగుచున్నది దుఃఖం / ప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు / పగులుచున్నది హృదయం (2) / గెత్సేమనే అను తోటలో / విలపించుచు ప్రార్ధించు ధ్వని (2) / నలువైపులా వినబడుచున్నది / పగులుచున్నవి మా హృదయములు / కలుగుచున్నది దుఃఖం / సిలువపై నలుగ గొట్టిననూ / అనేక నిందలు మోపిననూ (2) / ప్రేమతో వారిని మన్నించుటకై / ప్రార్ధించిన ప్రియ యేసు రాజా / మమ్మును నడిపించుము ||కల్వరి|| / మమ్మును నీవలె మార్చుటకై / నీ జీవమును ఇచ్చితివి (2) / నేలమట్టుకు తగ్గించుకొని / సమర్పించితివి కరములను / మమ్మును నడిపిపంచుము ||కల్వరి||
కల్వరి సిలువలో – యేసయ్య నీ రక్తమే (2) / క్షమియించెను పాపము కడిగె – యేసయ్య నీ రక్తమే / పరిశుద్ధులుగా మము చేసెను – యేసయ్య నీ రక్తమే / కలుషములను కడిగేను – యేసయ్య నీ రక్తమే / కలవరము బాపెను – యేసయ్య నీ రక్తమే / సీయోనును మేము చేర్చెను – యేసయ్య నీ రక్తమే (2) / నీ రక్తమే – నీ రక్తమే / నీ రక్తమే – యేసు నీ రక్తమే / విడుదలను దయచేసెను – యేసయ్య నీ రక్తమే / విజయమును చేకూర్చెను – యేసయ్య నీ రక్తమే / శిక్షంతటిని తొలగించెను – యేసయ్య నీ రక్తమే (2) / నీ రక్తమే – నీ రక్తమే / నీ రక్తమే – యేసు నీ రక్తమే / వేదనను మాన్పెను – యేసయ్య నీ రక్తమే / ఓదార్పు మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే / శాశ్వత జీవం మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే (2) / నీ రక్తమే – నీ రక్తమే / నీ రక్తమే – యేసు నీ రక్తమే / అర్హతను మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే / ఆనందముతో నింపెను – యేసయ్య నీ రక్తమే / ఆశీర్వాదం మాకొసగెను – యేసయ్య నీ రక్తమే (2) / నీ రక్తమే – నీ రక్తమే / నీ రక్తమే – యేసు నీ రక్తమే (2)
కల్వరిలోన చేసిన యాగం / మరణము గెలిచిన నీ యొక్క త్యాగం (2) / కడిగి వేసెను నాదు పాపం / నిలిపె నాలో నీ స్వరూపం (2) ||కల్వరిలోన|| / ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలు / తొలగించే నాపై ఉన్న ఆ ఘోర శాపాలు / పరిశుద్ధ దేహముపై చెలరేగెను కొరడాలు / నాలోని రోగాలకై పొందితివా గాయాలు (2) / దైవ సుతుడవే అయిన గాని / కనికరము వీడవు ఏల క్షణమైనా గాని (2) ||కల్వరిలోన|| / ఏ దోషం లేని దేహం మోసెను సిలువ భారం / రద్దాయెను నాలో నేరం తగ్గించెను నా భారం / నువ్వు పొందిన అవమానం నను ఉన్నతి చేర్చెను / చిందించిన నీదు రక్తం పరిశుద్ధుని చేసెను (2) / నిన్నే బలిగా నువ్వు మార్చుకుంటివి / నన్ను రక్షించుటకు వేదన పడితివి (2) ||కల్వరిలోన|| / సిలువలో వ్రేలాడుతూ నువ్వు పొందిన దాహము / అందించేను నా కొరకై ఆ జీవ జలము / కఠినులుగా మారి నీకు అందించిన ఆ చేదు / నింపేను నాలో మధురం తొలగించే నా కుటిలం (2) / అధికారమే లేని మరణము నిలిచెను / నిన్ను తాకేందుకు అనుమతి కోరెను (2) ||కల్వరిలోన||
కళ్యాణం కమనీయం / ఈ సమయం అతి మధురం (2) / దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2) ||కళ్యాణం|| / ఏదెను వనమున యెహోవ దేవా / మొదటి వివాహము చేసితివే (2) / ఈ శుభ దినమున / నవ దంపతులను (2) / నీ దీవెనలతో నింపుమయ్యా ||దేవా రావయ్యా|| / కానా విందులో ఆక్కరనెరిగి / నీళ్ళను రసముగ మార్చితివే (2) / కష్టములలో నీవే / అండగా నుండి (2) / కొరతలు తీర్చి నడుపుమయ్యా ||దేవా రావయ్యా|| / బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు / గుప్తమైయున్నవి నీయందే (2) / ఇహ పర సుఖములు / మెండుగ నొసగి (2) / ఇల వర్ధిల్లగ చేయుమయ్యా ||దేవా రావయ్యా||
కమనీయమైన నీ ప్రేమలోన / నే నిలువనా నా యేసయ్యా / కమనీయమైన నీ ప్రేమలోన / నే నిలువనా నా యేసయ్యా / (తీయ) తీయని నీ పలుకలలోన / నే కరిగిపోనా నా యేసయ్యా (2) / నా హృదిలో కొలువైన నిన్నే / సేవించనా/సేవించెదా నా యేసయ్యా (2) / విస్తారమైన ఘన కీర్తి కన్నా / కోరదగినది నీ నామం / జుంటె తేనె ధారల కన్నా / మధురమైనది నీ నామం (2) / సమర్పణతో నీ సన్నిధిని చేరి / నిత్యము నిన్నే ఆరాధించనా (2) ||కమనీయమైన|| / వేసారిపోయిన నా బ్రతుకులో / వెలుగైన నిన్నే కొనియాడనా (2) / కన్నీటితో నీ పాదములు కడిగి / మనసారా నిన్నే పూజించనా (2) / నీ కృపలో గతమును వీడి / మరలా నీలో చిగురించనా (2) ||కమనీయమైన||
కమ్మని బహుకమ్మని – చల్లని అతి చల్లని / తెల్లని తేట తెల్లని – యేసు నీ ప్రేమామృతం (2) / జుంటె తేనె కన్న మధురం – సర్వ జనులకు సుకృతం (2) / యేసు నీ ప్రేమామృతం (2) ||కమ్మని|| / ఆశ చూపెను ఈ లోకం – మలినమాయెను నా జీవితం / యేసూ నీదు ప్రేమ – దయ చూపెను ఈ దీనురాలి పైన (2) / వెలిగెను నాలో నీ ఆత్మ దీపము (2) / కడిగిన ముత్యముగా అయ్యాను నేను (2) ||కమ్మని|| / నా కురులతో పరిమళమ్ములతో – చేసెద నీదు పాద సేవ / నా గుండె గుడిలో కొలువైయున్న – నీకు చేసెద నేను మధుర సేవ (2) / ఆరాధింతును నిన్ను అనుదినము (2) / జీవింతును నీకై అనుక్షణము (2) ||కమ్మని||
కనలేని కనులేలనయ్యా / వినలేని చెవులేలనయ్యా / నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా / ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా (2) / అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| / దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా (2) / అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| / మరణించావు యేసయ్యా మరణించి నన్ను లేపావుగదయ్యా (2) / అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| / రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా (2) / అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| / అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేకన్నా (2) / ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నియ్య వేసయ్యా ||కనలేని||
కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై / మనలేను ప్రభు జూచి కఠినాత్మునై / కఠినాత్మునై… ||కనలేను|| / పాపులనేలేటి ప్రభునేలనో / బల్లెంపు పోటుల బంధించిరి (2) / కనుపించు పాపాలు రక్తాలలో / ప్రభు బాధలో ||కనలేను|| / ముండ్ల కిరీటము ప్రభుకేలనో / మూఢులు మోపిరి ప్రభు నెత్తిని (2) / ప్రభు రక్త గాయాలు నా పాపమా / ప్రభు శాపమా ||కనలేను|| / తన జంపు శత్రువుల క్షమియించెను / క్షమియింపుమని తండ్రిని వేడెను (2) / క్షమా బుద్ధి నేర్పించి చితి నోర్చెను / భరియించెను ||కనలేను|| / మోయజాలని సిలువ మోయించిరి / దివినేలు బాహువులు బంధించిరి (2) / నా పాపమంతయు ప్రభు మోసెను / భరియించెను ||కనలేను|| / జీవజలముల నిచ్చుఁ ప్రభుకేలనో / చేదు చిరక త్రాగను అందించిరి (2) / ఆత్మ దాహము తీర్చ బలి అయ్యెను / సిలువొందెను ||కనలేను|| / తన ఆత్మ తండ్రికి సమర్పించెను / తనదంతా తండ్రితో చాచుంచెను (2) / తలవంచి తండ్రిలో తుది చేరెను / కను మూసెను ||కనలేను|| / లోకాలనేలేటి ప్రభువేలనో / ఈ ఘోర మరణంబు గురి అయ్యెనో (2) / నా పాప బ్రతుకేల ప్రభువేడ్చెనో / సిలువేసెనో ||కనలేను||