Songs sorted by number of likes. 1604 songs total.
ఇదియేనయ్య మా ప్రార్థన / ఇదియే మా విజ్ఞాపన / ఆలకించే దేవా / మము నీ ఆత్మతో నింపగ రావా (2) / నీ వాక్యములో దాగియున్న / ఆంతర్యమును మాకు చూపించయ్యా / నీ మాటలలో పొంచియున్న / మర్మాలను మాకు నేర్పించయ్యా (2) / నీ జ్ఞానమే మా వెండి పసిడి / నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా|| / నీ దృష్టిలో సరిగా జీవించే / మాదిరి బ్రతుకును మాకు దయచేయయ్యా / నీ సృష్టిని మరిగా ప్రేమించే / లోబడని మా మనసులు సరిచేయయ్యా (2) / నీ జ్ఞానమే మా వెండి పసిడి / నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా|| / నీ సువార్తను గొప్పగ చాటే / బెదరని పెదవులు మాకు ఇవ్వుము దేవా / నీ సేవలో తప్పక కొనసాగే / అలుపెరుగని పాదములు నొసగుము ప్రభువా (2) / నీ జ్ఞానమే మా వెండి పసిడి / నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా||
ఇహలోక పాపి కొరకు / ఎనలేని ప్రేమను చూపి / గెలిచావుగా నా ప్రేమను / నా ప్రేమ నీవే యేసు / నీ కృప నాకు చాలు / నేనెలా నిను మరతును ||ఇహలోక || / నీ శక్తియే అద్భుతం / నీ సృష్టియే అద్భుతం (2) / యేసయ్యా యేసయ్యా / యేసయ్యా యేసయ్యా (2) ||ఇహలోక ||
ఇహమందున ఆ పరమందు నాకు / గృహమొసగిన నా దైవమా / మితిలేని ప్రేమతో గతిలేని నాకు / స్థితినొసగిన నా స్నేహమా (2) / యేసయ్యా నీవే నా ఆద్యంతం / యేసయ్యా నీలోనే నా ఆత్మీయం / యేసయ్యా నీకై నా ఆరాటం / యేసయ్యా నీతోనే నా ఆనందం / నీవే నా ఆశీర్వాదం / నీతోనే నా అనుబంధం (2) ||ఇహమందున|| / నేనునూ నా ఇంటి వారును / యెహోవాను సేవించెదం (2) / అని యెహోషువా నిను కొనియాడినంతగా / కీర్తించనా నిను స్తుతియించనా / నీ మేలులను నే చాటించనా (2) / యేసయ్యా నీవే నా సమీపం / యేసయ్యా నీలోనే నే సంపూర్ణం / యేసయ్యా నీకై నా సామర్ధ్యం / యేసయ్యా నీతోనే నా సంతోషం / నీవే నా సర్వస్వం / నీతోనే నా సహవాసం (2) ||ఇహమందున|| / నీ ఇంటి లోనికి నను చేర్చడానికి / ఈ భువికేగి సిలువలో బలి అయితివా (2) / మరిలేచి మహిమతో ఏతెంచితివే / మధ్యాకాశమున నిను వీక్షించుటే / నీ కొరకు నాకున్న నిరీక్షణ (2) / యేసయ్యా నీవే నా ప్రస్థానం / యేసయ్యా నీలోనే నే ప్రత్యేకం / యేసయ్యా నీకై నా ప్రావీణ్యం / యేసయ్యా నీతోనే నా ప్రయాణం / నీవే నా ప్రపంచం / నీతోనే నా ప్రతి నిమిషం (2) ||ఇహమందున||
ఇకనైన కానీ ఇప్పుడైన కానీ / దర్శించగా రావా / అభిషేకం లేక దర్శనము రాక / నశియించుచున్నానయ్యా (2) / కావలివాడు ఉదయం కోసం / మెలుకువ కలిగి చూచునట్లుగా (2) / నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా / నా జీవం నీవేనయ్యా (4) / ఎండిన నేల వర్షం కోసం / నేలను విరచి చూచునట్లుగా (2) / నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా / నా జీవం నీవేనయ్యా (4) / దుప్పి నీటి వాగుల కొరకు / ఇలలో ఎదురు చూచునట్లుగా (2) / నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా / నా జీవం నీవేనయ్యా (4)
ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట / ఎందుకో ఎందుకే కోయిలా / చెప్పవే చెప్పవే కోయిలా / మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసె నేడు / ఎందుకో ఎందుకే కోయిలా / చెప్పవే చెప్పవే కోయిలా / ఆ… అర్దరాత్రి కాలమందు వెన్నెల… ఆహా / ఆశ్చర్యకరుడంట వెన్నెల… ఆహా (2) / జన్మించినాడంట వెన్నెలా / ఈ అవనిలోనంట వెన్నెలా (2) ||ఇళ్లలోన|| / హా… ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా / చెప్పవే చెప్పవే కోయిలా (2) / ఆ… యూదా దేశమందు వెన్నెల… ఆహా / బెత్లెహేము పురమునందు వెన్నెల… ఆహా (2) / రాజులకు రాజంట వెన్నెలా / ఆ రాజు యేసంట వెన్నెల (2) ||ఇళ్లలోన|| / ఆహ… తార చూపు దారిలోనే వచ్చినారు ఎవ్వరే కోయిలా / చెప్పవే చెప్పవే కోయిలా (2) / ఆ తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల… ఆహా / దర్శింప వచ్చినారు వెన్నెల… ఆహా (2) / బంగారు సాంబ్రాణి బోళం / తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా (2) ||ఇళ్లలోన|| / ఆ… దివి నుండి ఈ భువికి వచ్చినాడు ఎందుకే కోయిలా / చెప్పవే చెప్పవే కోయిలా (2) / పాపులైన మనకోసం వెన్నెల… ఆహా / ప్రాణాన్ని అర్పించి వెన్నెల… ఆహా (2) / పరలోకానికి మార్గం వెన్నెలా / ఉచితంగా ఇచ్చినాడు వెన్నెలా (2) ||ఇళ్లలోన|| / హా.. పరలోకం చేరుటకై నేనేమి చెయ్యాలి కోయిలా / చెప్పవే చెప్పవే కోయిలా (2) / యేసయ్యను నమ్ముకో వెన్నెల… ఆహా / పాపాలను ఒప్పుకో వెన్నెల… ఆహా (2) / క్రొత్తగా జన్మించు వెన్నెలా / రక్షణను పొందుకో వెన్నెలా (2) ||ఇళ్లలోన||
ఇమ్మానుయేలు దేవుడా – మము కన్న దేవుడా (2) / ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా (4) / మాతో ఉండగ వచ్చిన మరియ తనయుడా (2) / లాలి లాలి లాలమ్మ లాలి (2) / మా పాపము బాపి పరమును మము చేర్చగ / దివిని విడిచి భువికి దిగిన దైవ తనయుడా (2) ||ఇస్సాకు|| / అశాంతిని తొలగించి శాంతిని నెలకొల్పగ / ప్రేమ రూపివై వెలసిన బాల యేసువా (2) ||ఇస్సాకు||
ఇమ్మానుయేలు రక్తము / ఇంపైన యూటగు / ఓ పాపి! యందు మున్గుము / పాపంబు పోవును / యేసుండు నాకు మారుగా / ఆ సిల్వ జావగా / శ్రీ యేసు రక్త మెప్పుడు / స్రవించు నాకుగా / ఆ యూట మున్గి దొంగయు / హా! శుద్ధు-డాయెను / నేనట్టి పాపి నిప్పుడు / నేనందు మున్గుదు / నీ యొక్క పాప మట్టిదే / నిర్మూల మౌటకు / రక్షించు గొర్రె పిల్ల? నీ / రక్తంబే చాలును / నా నాదు రక్తమందున / నే నమ్మి యుండినన్ / నా దేవుని నిండు ప్రేమ / నే నిందు జూచెదన్ / నా ఆయుష్కాల మంతటా / నా సంతసం-బిదే / నా క్రీస్తు యొక్క రొమ్మునన్ / నా గాన-మిద్దియే
ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు / ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2) / ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము / నిన్నే అనుసరింతుము జీవితాంతము (2) / ఘనులైన వారే గతియించగా / ధనమున్నవారే మరణించగా (2) / ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావు / మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2) ||ఇశ్రాయేలు|| / మా కంట కన్నీరు జారకుండగా / ఏ కీడు మా దరికి చేరకుండగా (2) / కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు / దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు (2) ||ఇశ్రాయేలు||
ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము / చల్లని దేవుని నీడలో / గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం / సంతోషించు ఈ దినం ||ఇన్నేళ్లు|| / లోకమే నటనాలయం / జీవితమే రంగుల వలయం (2) / పరలోకమే మనకు శాశ్వతం / పరలోక దేవుని నిత్య జీవం / ప్రేమామయుడే ఆ పరమాత్ముడే / పదిలపరచెనే రక్షణ భాగ్యం ||ఇన్నేళ్లు|| / మారు మనస్సు మనిషికి మార్గం / పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2) / నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా / నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా / పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే / కరుణించునే కలకాలం ||ఇన్నేళ్లు||
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) / ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం|| / ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2) / మారని వీడని ప్రేమే నీదయ్యా / మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) ||ఇంత కాలం|| / నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం (2) / నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా / వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) ||ఇంత కాలం|| / దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా హితులు (2) / శోధన వేదన తీర్చిన యేసయ్యా / తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా (2) ||ఇంత కాలం||
ఇంతవరకు కాపాడినావు వందనాలయ్యా / ఎన్నో మేళ్లతో నింపినందుకు వందనాలయ్యా (2) / అమ్మ వలె చూచినందుకు వందనాలయ్యా (2) / (మా) నాన్న వలె కాచినందుకు వందనాలయ్యా (2) / వందనాలే… ఆ ఆ.. ఆ… / వందనాలే… రాజా… / వందనాలయ్యా వందనాలయ్యా / వందనాలయ్యా వందనాలయ్యా / వ్యాధి వేదనలో స్వస్థతనిచ్చావు వందనాలయ్యా / అప్పు చెరలో విడుదలనిచ్చావు వందనాలయ్యా (2) / మా పరమ వైద్యుడై నిలిచినందుకు వందనాలయ్యా (2) / (నీ) రక్తము కార్చి విడుదలనిచ్చావు వందనాలయ్యా (2) ||వందనాలే|| / నిన్న నేడు మారని వాడవు వందనాలయ్యా / మాపై చూపిన ప్రేమకై వందనాలయ్యా (2) / మేఘ స్తంభమై నిలిచినావు నీకు వందనాలయ్యా (2) / అగ్ని స్తంభమై కాపాడినావు వందనాలయ్యా (2) ||వందనాలే|| / వెక్కి వెక్కి నేను ఏడ్చిన వేళ వందనాలయ్యా / చంకన ఎత్తి ఓదార్చినావు వందనాలయ్యా (2) / కష్ట కాలంలో కాపాడినావు వందనాలయ్యా (2) / (నీ) ధైర్యమిచ్చి నడిపించావు వందనాలయ్యా (2) ||వందనాలే||
ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే / అల్పమైన దానికా ఆరాటం / త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి / స్వల్పమైనదానికా పోరాటం / కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం / దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2) ||ఇంతలోనే|| / బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా / అంతరించిపోయెను భువినేలిన రాజులు (2) / నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా / చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా ||ఇంతలోనే|| / మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో / ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2) / ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున / చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో ||ఇంతలోనే||