Songs sorted by number of likes. 1604 songs total.
ఎంత చెప్పిన వాక్యమినక పోతివి / సాగిపోతివా చింతతో సమాధికి / వాదమాడి.. పంతమాడి (2) / అంతలోనే కన్ను మూసి పోతివా (2) / ధనము ధాన్యము కూడబెట్టి / మేడ మిద్దెలు కట్టబెట్టి (2) / అంత విడచి ఒంటిగానే పోతివా / ఈ పూట మెతుకుల మేటివాడని మరచిపోతివా (2) ||ఎంత|| / కొండలాంటి అండ బలమును / చూచి ఎంతో అదిరి పడితిని (2) / కండ బలము కరిగిపోయే / నీ అండ ఏది మంటిపాలై పోవునన్నా (2) ||ఎంత||
ఎంత దూరమైనా అది ఎంత భారమైనా (2) / యేసు వైపు చూడు నీ భారమంత తీరు (2) / తీరానికి చేరు (2) ||ఎంత|| / నడచి నడచి అలసిపోయినావా / నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా (2) / కలువరి గిరి దనుక సిలువ మోసిన / నజరేయుడేసు నీ ముందు నడవగా (2) ||యేసు|| / తెలిసి తెలిసి జారిపోయినావా / తెలియరాని చీకటిలో చిక్కుబడినావా (2) / నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే / పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా (2) ||యేసు||
ఎంత జాలి యేసువా / యింతయని యూహించలేను ||ఎంత|| / హానికరుడ హింసకుడను / దేవదూషకుడను నేను (2) / అవిశ్వాసినైన నన్ను (2) / ఆదరించినావుగా ||ఎంత|| / రక్షకుండ నాకు బదులు / శిక్ష ననుభవించినావు (2) / సిలువయందు సొమ్మసిల్లి (2) / చావొందితివి నాకై ||ఎంత|| / ఏమి నీ కర్పించగలను / ఏమి లేమి వాడనయ్యా (2) / రక్షణంపు పాత్రనెత్తి (2) / స్తొత్రమంచు పాడెద ||ఎంత|| / నీదు నామమునకు యిలలో / భయపడెడు వారి కొరకై (2) / నాథుడా నీ విచ్చు మేలు (2) / ఎంత గొప్పదేసువా ||ఎంత|| / నేను బ్రతుకు దినములన్ని / క్షేమమెల్ల వేళలందు (2) / నిశ్చయముగ నీవు నాకు (2) / ఇచ్చువాడా ప్రభువా ||ఎంత|| / నాదు ప్రాణమునకు ప్రభువా / సేద దీర్చు వాడ వీవు (2) / నాదు కాపరివి నీవు (2) / నాకు లేమి లేదుగా ||ఎంత|| / అందరిలో అతి శ్రేష్ఠుండా / అద్వితీయుడగు యేసయ్యా (2) / హల్లెలూయ స్తోత్రములను (2) / హర్షముతో పాడెద ||ఎంత||
ఎంత కృపామయుడవు యేసయ్యా / (నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా (2) / నలిగితివి వేసారితివి (2) / నాకై ప్రాణము నిచ్చితివి (2) ||ఎంత|| / బండలాంటిది నాదు మొండి హృదయం / ఎండిపోయిన నాదు పాత జీవితం (2) / మార్చినావు నీ స్వాస్థ్యముగా (2) / ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము (2) ||ఎంత|| / కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ / ఈ లోకము నన్ను విడచిననూ (2) / మరువలేదు నన్ను విడువలేదు (2) / ప్రేమతో పిలచిన నాథుడవు (2) ||ఎంత|| / కరువులు కలతలు కలిగిననూ / లోకమంతా ఎదురై నిలచిననూ (2) / వీడను ఎన్నడు నీ సన్నిధి (2) / నీ త్యాగమునే ధ్యానించెదన్ (2) ||ఎంత||
ఎంత మధురము యేసుని ప్రేమ / ఎంత మధురము నా యేసుని ప్రేమ (2) / ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (2) ||ఎంత మధురము|| / అంధకార బంధము నన్నావరించగా / అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని (2) / బంధము తెంచెను / బ్రతికించెను నన్ను (2) ||ప్రేమా|| / రక్షించు వారు లేక పక్షినైతిని / భక్షకుడు బాణము గురి పెట్టియుండెను (2) / బంధము తెంచెను / బ్రతికించెను నన్ను (2) ||ప్రేమా||
ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా / చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన / నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2) / సంతోషం ఎక్కడ ఉందనీ / సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ (2) / జగమంతా వెదికాను జనులందరినడిగాను (2) / చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి|| / ప్రేమనేది ఎక్కడ ఉందనీ / క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ (2) / బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను (2) / చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి|| / సత్యమనేది ఎక్కడ ఉందనీ / నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ (2) / ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను (2) / చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి||
ఎంత మంచి దేవుడవయ్యా / ఎంత మంచి దేవుడవేసయ్యా / చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా / ఎంత మంచి దేవుడవేసయ్యా (2) ||ఎంత|| / ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా (2) / నీ ప్రేమతో నను క్షమియించి / నను హత్తుకొన్నావయ్యా (2) ||ఎంత|| / నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ (2) / ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ / నను నీవు విడువలేదయ్యా (2) ||ఎంత|| / నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2) / నీతో కూడా ఈ లోకం నుండీ / పరలోకం చేరెదనేసయ్యా (2) ||ఎంత||
ఎంత మంచి కాపరి – యేసే నా ఊపిరి (2) / తప్పిపోయిన గొర్రె నేను / వెదకి కనుగొన్నావయ్యా / నీ ప్రేమ చూపినయ్య (2) ||ఎంత|| / సుఖములంటూ లోకమంటూ / నీదు వాక్యము మరచితి / నీదు సన్నిధి విడచితి (2) / యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా / నా అతిక్రమములు క్షమియించి / జాలి చూపితివి (2) ||ఎంత|| / నా తలంపులు నా క్రియలు / నీకు తెలిసేయున్నవి / నీవే నిర్మాణకుడవు (2) / యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా / కృతజ్ఞతా స్తుతులు నీకు / సమర్పించెదను (2) ||ఎంత||
ఎంత పాపినైనను / యేసు చేర్చుకొనును / అంచు నీ సువార్తను / అంత జాటించుడి / హల్లెలూయ హల్లెలూయ / ఎంత పాపినైనను / యేసు చేర్చుకొనున / టంచు బ్రకటించుడి / మెండుగా క్షమాపణన్ / పూర్ణ సమాధానము / నెంత పాపి కైన దా / నిచ్చి చేర్చుకొనును ||హల్లెలూయ|| / తన దివ్య సిల్వచే / దీసి పాప శాపమున్ / నను బవిత్రపర్చెను / నాకు హాయి నిచ్చెను ||హల్లెలూయ|| / ఘోర పాపినైనను / నన్ను జేర్చుకొనును / పూర్ణ శుద్ధి నిచ్చును / స్వర్గమందు జేర్చును ||హల్లెలూయ||
ఎంత పెద్ద పోరాటమో / అంత పెద్ద విజయమో (2) / పోరాడతాను నిత్యము / విజయమనేది తథ్యము (2) / వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి / విశ్వాసమనే డాలుని చేత పట్టి (2) / ముందుకే దూసుకెళ్లెదన్ / యెహోవాదే యుద్ధమనుచు (2) ||ఎంత|| / ప్రార్థన యుద్ధములో కనిపెట్టి / సాతాను తంత్రములు తొక్కి పెట్టి (2) / ముందుకే దూసుకెళ్లెదన్ / యెహోవా నిస్సీ అనుచు (2) ||ఎంత|| / యేసు కాడిని భుజమున పెట్టి / వాగ్ధాన తలుపు విసుగక తట్టి (2) / ముందుకే దూసుకెళ్లెదన్ / సిలువలో సమాప్తమైనదనుచు (2) ||ఎంత||
ఎంత ప్రేమ యేసయ్యా – ద్రోహినైన నా కొరకు / సిలువలో ఆ యాగము చేసావు – రక్తము కార్చావు / ఎందుకు ఈ త్యాగము – పాపినైన నా కొరకు / సిలువలో ఆ యాగము నొందను – రక్తము చిందను / సురూపమైనా సొగసైనా లేకపోయెను (2) / యేసు నిలువెల్ల రక్త ధారలు కారిపోయెను (2) / నలిగిపోయెను – విరిగిపోయెను / ఎంత శ్రమను ఎంత బాధను / అనుభవించినాడే విభుడు (2) / మనకు క్షమాపణ ఇచ్చెను / అభయము కలుగజేసెను / హింసింపబడి దూషింపబడి / హింసింపబడి దూషింపబడెను / కరుణతో నను రక్షింప / నా కోసమే ఈ యాగమా ||ఎంత ప్రేమ|| / సమస్తము సంపూర్ణమాయెను / జీవముకై మార్గము తెరిచెను (2) / అపవాదిని అణచివేసి / మరణ ముల్లును విరచి వేసెను / విజయశీలుడై తిరిగి లేచెను / పరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చెను / పునరుత్తానుడు మనకు తోడుగా నిత్యము నిలచే
ఎంత ప్రేమో నాపై యేసయ్యా / నేను ఎలాగ వివరించగలనయ్యా (2) / పెంట కుప్పలలో పడి ఉన్ననూ / నా మెడ మీద పడి ముద్దు పెట్టితివా / జిగట ఊబిలో నేను దిగి ఉన్ననూ / నా చేయి పట్టి నను పైకి లేపితివా ||ఎంత|| / దాహం తీర్చగలేని బావి అయిననూ / నేను పాపపు కుండను విడువకుంటిని (2) / నా పాపమంత క్షమించితివి (2) / జీవ జలమిచ్చి నన్ను చేర్చుకుంటివి (2) ||ఎంత|| / పందులున్న చోట నలిగి పడి ఉంటిని / నా పాపమే చుట్టు ముట్టి పట్టుకున్నది (2) / బుద్ధి వఛ్చి నేను నిన్ను ఆశ్రయించగా (2) / క్షమియించి నీ రక్షణిచ్చితివి (2) ||ఎంత|| / నరికిన కొమ్మ వలె ఎండిపోతిని / నా పాపాన్ని దాచి దాచి నశించితిని (2) / ఒప్పుకొనగా నాకు జీవమిచ్చితివి (2) / (ఎండిన) మొద్దును చిగురింపజేసితివి (2) ||ఎంత||