Songs sorted by number of likes. 1604 songs total.
దేవా మహోన్నతుడా / మహిమా ప్రకాశితుడా (2) / పదివేలలో అతి సుందరుడా / కీర్తింతు మనసారా (2) ||దేవా|| / వెలిసావు భువిలో మెస్సయ్యగా / ఎడారి బ్రతుకులో సెలయేరుగా (2) / నిస్సారమైన నా జీవితములో / చిగురించె ఆనందము (2) ||దేవా|| / లేచాను ఒంటరి విశ్వాసినై / వెదికాను నీ దారి అన్వేషినై (2) / నీ దివ్య మార్గము దర్శించినా / ఫలియించె నా జన్మము (2) ||దేవా||
దేవా నా హృదయముతో / నిన్నే నేను కీర్తింతును (2) / మారని ప్రేమ నీదే (2) / నిన్ను కీర్తింతును ఓ.. ఓ.. / నిన్ను కొనియాడెద ||దేవా|| / ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా / నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా (2) / నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆలాపన / నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆరాధన ||మారని|| / నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా / పరలోక రాజ్యములో పరవశించాలని (2) / నీ కోసమే నీ కోసమే – నా ఈ నిరీక్షణ (2) ||మారని||
పాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగం / క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరు చేయవలసినది సజీవ యాగం – ఇది శరీర యాగం / దేవా నా జీవితమిదిగో నీ సొంతం / ప్రతి క్షణం నీ పనికై అర్పితం (2) / నా వరకైతే బ్రతుకుట నీ కోసం / చావైతే ఎంత గొప్ప లాభం (2) / నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం / సజీవయాగముగా నీకు సమర్పితం (2) ||దేవా|| / నా కరములు నా పదములు నీ పనిలో / అరిగి నలిగి పోవాలి ఇలలో / సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో / అలసి సొలసి పోవాలి నాలో (2) ||నా శరీరము|| / నా కాలము అనుకూలము నీ చిత్తముకై / ధనము ఘనము సమస్తము నీ పనికి / నా మరణము నీ చరణముల చెంతకై / నిన్ను మహిమపరిచి నేలకొరుగుటకై (2) ||నా శరీరము||
నా ప్రాణం తల్లడిల్లగా / భూదిగంతముల నుండి మొర పెట్టుచున్నాను / దేవా నా మొర ఆలకించుమా / నా ప్రార్థనకు చెవియొగ్గుమా (2) / నా ప్రాణం తల్లడిల్లగా / భూదిగంతముల నుండి మొర పెట్టుచున్నాను (2) / నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి / ఎక్కించుము నను నడిపించుము (2) ||దేవా|| / నీవు నాకు ఆశ్రయముగ నుంటివి / శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి (2) / యుగయుగములు నేను నీ గుడారములో నుందును / నీ రెక్కల చాటున దాగి యుందును (2) / నీ రెక్కల చాటున దాగి యుందును ||దేవా|| / నా రక్షణ మహిమకు ఆధారము నీవే / నా ఆశ్రయ దుర్గం నా నిరీక్షణ మార్గము నీవే (2) / నీ ప్రేమ బాటలో నడిపించుమయ్యా / నీ పోలికగా నన్ను మలచుమయ్యా (2) / నీ పోలికగా నన్ను మలచుమయ్యా ||దేవా||
దేవా నా మొరాలకించితివి / నాకభయము నిచ్చితివి / నాకెంత సంతోషము ||దేవా|| / కనికరించి నా మొరను – ఆలకించితివి / యేసు దేవా నిన్ను చేర – మార్గము చూపితివి (2) / స్తోత్రము చేయుదు హల్లెలూయని / నా జీవిత కాలమంతా (2) / నా జీవిత కాలమంతా… / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయ హల్లెలూయా… ||దేవా|| / కృశించిపోయిన నా ఆత్మకు నీవు – జీవమిచ్చితివి / నా హృదయమున చీకటిమయమును – వెలుగుతో నింపితివి (2) / నీ కృపాతిశయమును నిత్యము / కీర్తింతునో ప్రభువా (2) / కీర్తింతునో ప్రభువా…. / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయ హల్లెలూయా… ||దేవా||
దేవా నీ ఆత్మను నా నుండి / నువ్వు తీసివేయకుమా / నీ సన్నిధిలో నుండి నన్ను / నువ్వు త్రోసివేయకుమా (2) / నీ దృష్టి యెదుటనే / చెడుతనము చేసియున్నాను / పాపిని అని ఒప్పుకొని / క్షమాపణ కోరుచున్నాను / నీవే నీవే కరుణామయుడవు నీవే / నీవే నీవే ప్రేమామయుడవు నీవే / నీ వెలుగుతో నను నింపిననూ / చీకటినే కోరుకున్నాను (2) / నా కళ్ళు నీవు తెరిచిననూ / గ్రుడ్డివాడిలా నడుచుకున్నాను / నీ ఆత్మతో నను నింపిననూ / శరీరమునే తృప్తిపరిచాను (2) / ఆత్మచేత నడిపించబడక / శరీరాశలలో మునిగాను
దేవా నీ గొప్పకార్యములన్ – మదిన్ తలచి స్తుతించెదం / నీ ఆశ్చర్యక్రియలను – పాడి కీర్తించెదం / హల్లెలూయా నా యేసురాజ / హల్లెలూయా నా ప్రాణనాథ (2) / స్తుతులు మహిమ ఘనత నీకే (2) ||దేవా నీ|| / శాశ్వత ప్రేమతో నను ప్రేమించి / పరమును వీడి భువికరుదెంచి / కలువరి సిలువలో రక్తము కార్చి / నీదు కృపతో నను రక్షించిన / నీ దివ్య ప్రేమను అత్యధికముగా / స్మరింతున్ జీవిత కాలమంతా ||దేవా నీ|| / నీ కంటిపాపగా నన్ను కాచి / నీ చేతి నీడలో నన్ను దాచి / నీ అరచేతిలో నను చెక్కుకొని / నీదు సొత్తుగా నను చేసుకొని / అక్షయమైన నీ మధుర ప్రేమను / దీక్షతో ఇలలో చాటెదను ||దేవా నీ||
దేవా నీ నామం… పావన ధామం… / బ్రోవుమయ్యా ప్రేమ రూప / నీదు జనులం (2) / నీదు సన్నిధిలో / నిన్ను వేడుకొందుము… వేచియుందుము (2) / నీదు కృపనొంది మేము ఉత్సాహించెదం / జయించెదము.. స్తుతించెదము (2) ||దేవా|| / శుద్ధ మనసు లేక మేము దూరమైతిమి / శ్రద్ధతో నీదు మార్గం వెదకమైతిమి (2) / బుద్ది కలిగి నీదు మాట వైపు తిరిగెదం / తగ్గి యుండెదం.. మొర్ర పెట్టెదం (2) ||దేవా|| / విన్నపములన్ని విని క్షమియించుము / సన్నుతుండా స్వస్థపరచు మాదు దేశమున్ (2) / నిన్ను చాటి చూపి నిలిచి యుండెదం / గెలిచి వెళ్లేదం సేవ చేసెదం (2) ||దేవా||
దేవా నీ నామం / బలమైనది నీ నామం (2) / స్తుతియింతును నీ నామం / ఘనపరతును నీ నామం (2) / అన్నిటి కన్న పై నామం / యేసయ్యా నీ నామం (2) / ఆశ్రయ దుర్గము నీ నామం / నా కొండా నా కోట (2) / స్తుతియింతును నీ నామం / ఘనపరతును నీ నామం (2) / అన్నిటి కన్న పై నామం / యేసయ్యా నీ నామం (4)
దేవా నీ సన్నిధిలో నిలచి / దీనులమై మొరపెట్టుచున్నాము – (2) ||దేవా|| / అపరాధులగు నీదు ప్రజల / నెపములన్నియు బాపి (2) / కృపాళుండగు యేసు ప్రభువా / కృపను జూపి రక్షించుమయా (2) ||దేవా|| / చేసి యున్నాము నేరములెన్నో / చేసిన మేలులను మరచి (2) / మోసములలో బడియున్నాము / యేసుప్రభు జయమునిమ్ము (2) ||దేవా|| / లోకపు మర్యాదలకు లొంగి / లోకుల మాటలను వినియు (2) / నీ కట్టడలను మరచితిమి / కట్టుము మమ్ము నీ వాక్యముచే (2) ||దేవా|| / నిస్వార్థులగు నీ దాసులను / విశ్వాస ప్రమాణికులన్ (2) / శాశ్వతమైన ప్రేమతో నింపు / విశ్వాసులు స్థిరపడి నడువ (2) ||దేవా|| / సహవాసములో మమ్ము నిలిపి / సహనము మాకు నేర్పించి (2) / మహిమా పూర్ణుడ యేసు నిన్ను / ఈ మహిలో చాటించుటకు (2) ||దేవా||
దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ / నా యెడల నీ కరుణ / సర్వ సదా నిలుచుచున్నది (2) ||దేవా|| / స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే / స్తుతి పాడేను హృదయముతో (2) / స్తుతించి వర్ణించి ఘనపరతున్ (2) / నీవే నా రక్షకుడవని ||దేవా|| / మొదట నిన్ను ఎరుగనైతిని / మొదటే నన్ను ఎరిగితివి (2) / వెదుకలేదు ప్రభువా నేను (2) / వెదకితివి ఈ పాపిని ||దేవా|| / అద్భుతమైనది సిలువ దృశ్యం / ప్రభును కొట్టి ఉమ్మి వేసిరి (2) / ప్రభును వర్ణింప నశక్యము (2) / ప్రభువే సహించె దుఃఖము ||దేవా|| / ఎట్లు మౌనముగా నుండు ప్రభు / చెల్లింపక స్తోత్ర గీతము (2) / కాలమంతా పాడుచుండెద (2) / నీ ప్రేమ అపారమైనది ||దేవా||
దేవా పాపిని నిన్నాశ్రయించాను / ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా (2) ||దేవా|| / అపరాధినై అంధుడనై / అపవాదితో అనుచరుడై (2) / సంచరించితి చీకటిలో / వంచన చేసితి ఎందరినో – (2) ||దేవా|| / కలువరిలో సిలువొంద / కలవరమొందె జగమంతా (2) / పాపినైన నా కొరకు / మరణమునే భరించితివి / మరణమునే జయించితివి ||దేవా||