తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

అందరు మెచ్చిన అందాల తార|Andaru Mechchina Andaala Thaara

అందరు మెచ్చిన అందాల తార / అవనికి తెచ్చెను వెలుగుల మేడ (2) / క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్ / హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ / క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్ / మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు|| / సృష్టికర్తయే మరియ తనయుడై / పశుల పాకలో పరుండినాడు (2) / నీతి జీవితం నీవు కోరగా / నీకై రక్షణ తెచ్చినాడు (2) / నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్|| / ఇంటిని విడిచి తిరిగిన నాకై / ఎదురు చూపులే చూచినాడు (2) / తప్పును తెలిసి తిరిగి రాగా / క్షమియించి కృప చూపినాడు (2) / ఎన్నో వరములు ఇచ్చినాడు ||క్రిస్మస్|| / పాత దినములు క్రొత్తవి చేసి / నీలో జీవము నింపుతాడు (2) / కటిక చీకటే వేకువ కాగా / అంబరమందు సంబరమాయే (2) / హృదయమునందు హాయి నేడు ||క్రిస్మస్||

అంధకార చెరసాలలో|Andhakaara Cherasaalalo

అంధకార చెరసాలలో – బంధకాల ఇరుకులో / పౌలు సీలలు ప్రార్ధించిరి – కీర్తనలు పాడిరి – (2) / భూమియే కంపించెను – చెరసాల అదిరెను / వారి సంకెళ్లు ఊడిపోయెను – విడుదల దొరికెను – (2) / వ్యాధులు ఆవరించగా – మరణము తరుముచుండగా / రండి పారి పోదుము – ఇంక దాగి యుందుము / ఏ తెగులు దరిచేరని – ఏ దిగులు ఉండని / మన దాగు స్థలములో – యేసుని సన్నిధిలో ||అంధకార|| / ప్రార్ధన చేసెదము – దేవుని సముఖములో / ఈ శోధన సమయములో – విరిగిన హృదయముతో / ఈ లోక రక్షణకై – జనముల స్వస్థతకై / యేసుని వేడెదము – శోకము తొలగించమని ||అంధకార|| / మొరలను ఆలకించును – యేసు మనలను విడిపించును / ఈ లోకమును శుద్ధిచేయును – మరణమును తప్పించును / మన రక్షణ వలయముగా – తన రెక్కలు చాపును / దుఃఖమును సంతోషముగా – మార్చివేయును త్వరలో ||అంధకార||

అన్ని కాలంబుల|Anni Kaalambula

అన్ని కాలంబుల – నున్న యెహోవా ని / నెన్నదరంబయో – కన్న తండ్రి / వన్నె కెక్కిన మోక్ష – వాసాళి సన్నుతు / లున్నతమై యుండ – మున్నె నీకు ||అన్ని|| / నిన్ను బ్రకటన సేయ – నిఖిల లోకములను / బన్నుగ జేసిన – బలుడ వీవె / ఉన్న లోకంబుల – నుడుగక కరుణా సం / పన్నతతో నేలు – ప్రభుడ వీవె / అన్ని జీవుల నెరిగి – యాహార మిచ్చుచు / నున్న సర్వజ్ఞుoడవు నీవే / ఎన్న శక్యముగాక – ఉన్న లక్షణముల / సన్నుతించుటకు నే – జాలుదునా ||అన్ని|| / పుట్టింప నీవంచు – బోషింప నీవంచు / గిట్టింప నీవంచు – గీర్తింతును / నట్టి పనికి మాలి – నట్టి మానవుల చే / పట్టి రక్షింప బా – ధ్యుండ వంచు / దట్టమైన కృపను దరి జేర్చ నాకిచ్చి / పట్టయు నిలచియుండు – ప్రభుడ వంచు / గట్టడచే గడ – ముట్టుదనుక నా / పట్టుకొలది నిన్ను – బ్రస్తుతింతు ||అన్ని|| / కారుణ్య నిధి వీవు – కఠినాత్ముడను నేను / భూరి శుద్ధుడ వీవు – పాపి నేను / సార భాగ్యుడ వీవు – జగతిలో నాకన్న / దారిద్రుడే లేడు – తరచి చూడ / సార సద్గుణముల – సంపన్నుడవు నీవు / ఘోర దుర్గుణ సం – చారి, నేను / ఏ రీతి స్తుతియింతు – నే రీతి సేవింతు / నేర మెన్నక ప్రోవ – నెర నమ్మితి ||అన్ని||

అన్నీ సాధ్యమే యేసుకు|Anni Saadhyame

అన్నీ సాధ్యమే / యేసుకు అన్నీ సాధ్యమే (2) / అద్భుత శక్తిని నెరపుటకైనా / ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2) / ఆ యేసు రక్తానికి / సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2) ||అన్నీ సాధ్యమే|| / మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను / మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను (2) / మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెను / మరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను (2) ||అన్నీ సాధ్యమే|| / బండనే చీల్చగా – జలములే పొంగెను / ఎండిపోయిన భూమిపై – ఏరులై అవి పారెను (2) / బందంటే క్రీస్తేనని – నీ దండమే తానని / మెండైన తన కృపలో – నీకండగా నిలచును (2) ||అన్నీ సాధ్యమే|| / ఏకాంతముగా మోకరిల్లి – ప్రార్ధించుటే శ్రేయము / ఏల నాకీ శ్రమలని – పూర్ణ మనసుతో వేడుము (2) / యేసయ్య నీ వేదన – ఆలించి మన్నించును / ఏ పాటి వ్యధలైననూ – ఆ సిల్వలో తీర్చును (2) ||అన్నీ సాధ్యమే|| / కష్టాల కడలిలో – కన్నీటి లోయలో / కనికరమే ప్రభు చూపును – కంటిపాపలా కాయును (2) / కలిగించు విశ్వాసము – కాదేదీ అసాధ్యము / క్రీస్తేసు నామములో – కడగండ్లకే మోక్షము (2) ||అన్నీ సాధ్యమే||

అన్ని సాధ్యమే యేసులో|Anni Saadhyame Yesulo

నన్ను బలపరచు యేసునందే నేను / సర్వము చేయగలను / నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను / సమస్తం చేయగలను / సాధ్యము కానిది ఏదియు లేదే / అన్ని సాధ్యమే యేసులో / సాధ్యము కానిది ఏదియు లేదే / అన్ని సాధ్యమే క్రీస్తులో ||నన్ను బలపరచు|| / నీటిని చీల్చి – బాటను వేసి – నరులను నడిపించెనే / బండను చీల్చి – దాహము తీర్చ – నీటిని పుట్టించెనే / నీటిని ద్రాక్షా రసముగ మార్చెనే / నీటిపై నడిచెనే – నీటినే అణచెనే / నా కన్నీటిని నాట్యముగ మార్చెనే / జీవ జలమైన నా యేసయ్యా… ||సాధ్యము|| / హోరేబు కొండపై – మండే పొద నుండి – మోషేతో మాట్లాడెనే / బలిపీఠముపై – అగ్నిని కురిపించి – మహిమను కనుపరచెనే / షద్రకు మేషాకు అబేద్నెగోలను / అగ్నిలో ఉండియే కాపాడెనే / నరకపు మంటనుండి నను రక్షించిన / అగ్ని నేత్రాల నా యేసయ్యా… ||సాధ్యము||

Most Popular Telugu Songs — Page 16 | UEC Telugu Church