Songs sorted by number of likes. 1604 songs total.
తేనెకన్న తీయనైనది / నా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది (2) / నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను / కష్టకాలమందు నాకు తోడైయుండెను (2) ||తేనెకన్న|| / ఆగకనే సాగిపోదును / నా ప్రభువు చూపించు బాటలో (2) / అడ్డంకులన్ని నన్ను చుట్టినా / నా దేవుని నే విడువకుందును (2) ||తేనెకన్న|| / నా వాళ్ళే నన్ను విడిచినా / నా బంధువులే దూరమైనా (2) / ఏ తోడు లేక ఒంటరినైననూ / నా తోడు క్రీస్తని ఆనందింతును (2) ||తేనెకన్న||
తోడు లేరని కుమిలిపోకు / యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2) / ఓహో సోదరా యేసే నీ గురి (2) ||తోడు|| / ఆదరణ లేక అల్లాడిపోకు / శోధన వేదనలో కృంగిపోకు (2) / ఆదరించే వాడే యేసు / అల్లాడిపోకు ఓ సోదరా (2) ||ఓహో సోదరా|| / విడువడు యేసు ఎడబాయడెన్నడు / అనుక్షణము నిన్ను కాపాడును (2) / ఆయన మీదనే భారము మోపు / ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2) ||ఓహో సోదరా||
తొలకరి వాన దీవెనలు కురిపించు వాన / పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) / అది నూతన పరచును ఫలియింపచేయును / సమృద్ధినిచ్చును సంతోషపరచును (2) ||తొలకరి|| / ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును / జీవజలముతో నింపి జీవింపచేయును (2) / ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును (2) ||అది నూతన|| / సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించును / పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును (2) / యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును (2) ||అది నూతన||
తూర్పు దిక్కు చుక్క బుట్టె / మేరమ్మా – ఓ మరియమ్మా (2) / చుక్కను జూచి మేము వచ్చినాము / మొక్కి పోవుటకు (2) ||తూర్పు దిక్కు|| / బెత్లెహేము పురము లోని బాలుడమ్మా / గొప్ప బాలుడమ్మా (2) / మన పాపముల బాప పుట్టెనమ్మా / మహిమవంతుడమ్మా (2) ||తూర్పు దిక్కు|| / పశువుల పాకలోని బాలుడమ్మా / పాపరహితుడమ్మా (2) / పాపంబు బాపను పుట్టెనమ్మా / సత్యవంతుడమ్మా (2) ||తూర్పు దిక్కు|| / బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము / బాల యేసు నొద్దకు (2) / బంగారు పాదముల మ్రొక్కెదము / బహుగ పాడెదము (2) ||తూర్పు దిక్కు||
తూరుపు దిక్కున చుక్క బుట్టె / దూతలు పాటలు పాడ వచ్చె (2) / చలి మంట లేకుండా ఎలుగే పుట్టె (2) / చల్లని రాతిరి కబురే తెచ్చె (2) / పుట్టినాడంట యేసునాథుడు / పాపములు తీసే పరమాత్ముడు (2) ||తూరుపు|| / గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి / కొలిచినారు తనకు కానుకలిచ్చి / పశుల పాక మనము చేరుదాము / కాపరిని కలిసి వేడుదాము (2) ||పుట్టినాడంట|| / చిన్నా పెద్దా తనకు తేడా లేదు / పేదా ధనికా ఎప్పుడూ చూడబోడు / తానొక్కడే అందరికీ రక్షకుడు / మొదలు నుండి ఎప్పుడూ ఉన్నవాడు (2) ||పుట్టినాడంట|| / మంచి చెడ్డా ఎన్నడు ఎంచబోడు / చెడ్డ వాళ్లకు కూడా బహు మంచోడు / నమ్మి నీవు యేసును అడిగి చూడు / తన ప్రేమను నీకు అందిస్తాడు (2) ||పుట్టినాడంట||
త్రాహిమాం క్రీస్తు నాథ – దయ జూడ రావే / నేను – దేహి యనుచు నీ పాదములే / దిక్కుగా జేరితి నిపుడు ||త్రాహిమాం|| / గవ్వ చేయరాని చెడ్డ – కర్మేంద్రియాధీనుడనై / రవ్వ పాలై నేనెంతో – నెవ్వ బొందితి / త్రవ్వుచున్న కొలది – పెరుగు – దరగదు నా పాప రాశి / యివ్విధమున జెడిపోతిని నే – నేమి సేతు నోహోహోహో ||త్రాహిమాం|| / నీ యందు భయభక్తులు లేని – నిర్లజ్జా చిత్తము బూని / చేయరాని దుష్కర్మములు – చేసినాడను / దయ్యాల రాజు చేతిలో – జేయి వేసి వాని పనుల / జేయ సాగి నే నిబ్భంగి – జెడిపోయితి నే నయ్యయ్యాయ్యో ||త్రాహిమాం|| / నిబ్బర మొక్కించుకైన – నిజము రవ్వంతైన లేక / దబ్బర లాడుతకు ము – త్తా నైతిని / అబ్బురమైన ఘోర పా – పాంధకార కూపమందు / దబ్బున బడిపోతి నయ్యో – దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహిమాం|| / నిన్ను జేరి సాటిలేని – నిత్యానంద మంద బోవు / చున్నప్పుడు నిందలు నా – కెన్ని చేరినా / విన్నదనము లేకుండ నీ – వే నా మదికి ధైర్యమిచ్చి / యన్నిట రక్షించితివి నా – యన్న నీకు స్తోత్ర మహాహా ||త్రాహిమాం||
త్రిత్వైకమా సకలేశ్వరా / పూజ్యుడౌ శ్రేయస్కరా (2) / ధ్యానించెద హృది వాంఛతో / గళమెత్తెద మృదు భాషతో / నా సుతుడా సర్వే సుతుడా / నా జనకా సర్వే జనకా ||త్రిత్వైకమా|| / దోష భావముకు బంధునవ్వగా / దేహ ఇఛ్చలలో స్థిరమవ్వగా (2) / వాక్యపు వెలుగై నాకిల వెలుగై / ముక్తినిచ్చిన నీకు వందనం (2) ||త్రిత్వైకమా|| / క్షితియందు ఎరకు మోసిపోతిని / క్షమలేక ఇలలో మృతమైతిని (2) / వెల దాతవై జీవ దాతవై / స్థితి మార్చిన నీకు వందనం (2) ||త్రిత్వైకమా||
తుప్పు పట్టి పోవుటకంటే (2) / కరిగిపోత యేసయ్య నీ చేతిలో / అరిగిపోత యేసయ్య నీ సేవలో (2) ||తుప్పు పట్టి|| / సుఖమనుభవించుటకంటే (2) / శ్రమలనుభవిస్తాను నీ సేవలో / నిన్ను నేను సంతోషపెడత యేసయ్యా (2) ||తుప్పు పట్టి|| / వెన్న లాగ కరుగుకుంట (2) / కటిక చీకట్ల దీపమైతానయ్యా / నీ చిత్తము జరిగిస్తా యేసయ్యా (2) ||తుప్పు పట్టి|| / మూర్ఖమైన వక్ర జనం మధ్యల (2) / ముత్యమోలె నేనుండాలి యేసయ్యా / దివిటీ నయ్యి వెలుగుతుండాలే యేసయ్యా (2) ||తుప్పు పట్టి|| / వెండి బంగారాల కన్నా / ధన ధాన్యముల కన్నా / నీ పొందు నాకు ధన్యకరము యేసయ్యా / నీతో ఉండుటే నాకు ఆనందం యేసయ్యా (2) ||తుప్పు పట్టి|| / నాలో ఊపిరున్నంత వరకు (2) / ప్రకటిస్త యేసయ్య నీ ప్రేమను / కటిక చీకట్ల దీపమెలిగిస్తాను (2) ||తుప్పు పట్టి||
త్యాగమెంత చేసావు దేవా / నా పాపమంత కడిగావా నేస్తం (2) / ఓ యేసయ్యా… నా నేస్తమా… (2) ||త్యాగమెంత|| / గెత్సేమనే తోటలో ఒంటరివై మిగిలావా / ఒంటరి నా బ్రతుకులో ఓదార్పువయ్యావా (2) / కన్నీరు తుడిచి / కల్వరికి నడిచావా (2) ||ఓ యేసయ్యా|| / తల వాల్చుటకైన నీకు తావే లేదుగా / తల్లడిల్లు నాకు త్రోవ చూపించినావా (2) / స్వస్థత నాకిచ్చి / సిలువ నీవు మోసావా (2) ||ఓ యేసయ్యా||
ఉదయకాలము మధ్యాహ్నము / సాయంకాలము చీకటి వేళలో (2) / చింత లేదు బాధ లేదు / భీతి లేదు భయము లేదు / యేసు ఉన్నాడు / నాలో యేసు ఉన్నాడు (2) / లోకమునకు వెలుగైన / ఆ యేసే దారి చూపును (2) / చింత లేదు బాధ లేదు / భీతి లేదు భయము లేదు / యేసు ఉన్నాడు / నాలో యేసు ఉన్నాడు (4)
ఉదయమాయె హృదయమా / ప్రభు యేసుని ప్రార్ధించవే (2) / పదిలముగా నిను వదలకుండా / పడక నుండి లేపెనే (2) ||ఉదయమాయె|| / రాత్రి గడచిపోయెనే / రవి తూర్పున తెలవారెనే (2) / రాజా రక్షకుడేసు దేవుని / మహిమతో వివరించవే (2) ||ఉదయమాయె|| / తొలుత పక్షులు లేచెనే / తమ గూటి నుండి స్తుతించెనే (2) / తండ్రి నీవే దిక్కు మాకని / ఆకాశమునకు ఎగిరెనే (2) ||ఉదయమాయె|| / పరిశుద్ధుడా పావనుండా / పరంధాముడా చిరంజీవుడా (2) / పగటియంతయు కాచి మము / పరిపాలించుము దేవుడా (2) ||ఉదయమాయె|| / తండ్రి దాతవు నీవని / ధరయందు దిక్కు ఎవరని (2) / రాక వరకు కరుణ చూపి / కనికరించి బ్రోవుమా (2) ||ఉదయమాయె||
ఉదయించె దివ్య రక్షకుడు / ఘోరాంధకార లోకమున / మహిమ క్రీస్తు ఉదయించెను / రక్షణ వెలుగు నీయను – (2) ||ఉదయించె|| / ఘోరాంధకారమున దీపంబు లేక / పలు మారు పడుచుండగా (2) / దుఃఖ నిరాశ యాత్రికులంతా / దారి తప్పియుండగా (2) / మార్గదర్శియై నడిపించువారు (2) / ప్రభు పాద సన్నిధికి / దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు / ఉదయించె ఈ ధరలో – (3) ||ఉదయించె|| / చింత విచారముతో నిండియున్న / లోక రోదన విని (2) / పాపంబునుండి నశించిపోగా / ఆత్మ విమోచకుడు (2) / మానవాళికై మరణంబునొంది (2) / నిత్య జీవము నివ్వన్ / దివ్యరక్షకుడు ప్రకాశతార / ఉదయించె రక్షింపను – (3) ||ఉదయించె|| / పరలోక తండ్రి కరుణించి మనల / పంపేను క్రీస్తు ప్రభున్ (2) / లోకాంధులకు దృష్టినివ్వ / అరుదెంచె క్రీస్తు ప్రభువు (2) / చీకటి నుండి దైవ వెలుగునకు (2) / తెచ్చె క్రీస్తు ప్రభువు / సాతాను శృంగలములను తెంప / ఉదయించె రక్షకుడు – (3) ||ఉదయించె||