తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

తమ దేవునెరుగువారు|Thama Devuneruguvaaru

తమ దేవునెరుగువారు చేసెదరు / శక్తితో గొప్ప కార్యములు (2) / ఇచ్చకపు మాటల వలన – అక్షయుని విడువరు (2) / తప్పుబోధల నెప్పుడు తృణీకరించెదరు (2) ||తమ|| / సత్యమును విడువరు – ఉత్తములుగా నడిచెదరు (2) / అతల్యాను హతము చేసెదరు శుద్ధులై యుండెదరు (2) ||తమ|| / మనుజ భయము జెందరు – మాన్యులై యుండెదరు (2) / మంచి సాక్షమును విడువరు ఏకాంతులు కారు (2) ||తమ|| / ద్వేషించెదరు విగ్రహముల్ – శిరములు ఖండించినను (2) / పర్వతమువలె కదలక వారు స్థిరముగ నుండెదరు (2) ||తమ|| / అగ్నిలో వేయబడినను – విఘ్నంబులు కలిగినను (2) / సింహపు బోనులో వేసినను సిగ్గునొందరు (2) ||తమ|| / శోధనలను జయించెదరు – బాధలను సహించెదరు (2) / నాథుడేసుని సదా వెదకి సాధించి ప్రకటింతురు (2) ||తమ|| / అదిక జ్ఞానమును పొంది – తగ్గించుకొనెదరు తామే (2) / యేసు ప్రభువును హెచ్చించెదరు హల్లెలూయ పాడెదరు (2) ||తమ||

తనువు నా దిదిగో|Thanuvu Naa Didigo

తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి బ్రతిష్టించుమీ / దినములు క్షణములు – దీసికొని యవి నీదు / వినతిన్ ప్రవహింప జే – యను శక్తి నీయుమీ ||తనువు|| / ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పని చేయ జేతు లివిగో / యనయంబు నీ విషయ – మై సొగసుగా జురుకు / దనముతో పరుగెత్త – వినయ పాదము లివిగో ||తనువు|| / స్వర మిదిగో కొనుమీ – వరరాజ నిను గూర్చి – నిరతమ్ము పాడనిమ్ము / మరియు పెదవు లివిగో – మహనీయమైన నీ / పరిశుద్ధ వార్తతో – పరి పూర్ణముగా నింపు ||తనువు|| / వెండి పసిడి యివిగో – వీస మైనను నాకై – యుండవలె నని కోరను / నిండైన నీ యిష్ట – నియమంబు చొప్పున / మెండుగా వాడ పరి – మితియవు జ్ఞానం బిదిగో ||తనువు|| / నా యిష్ట మిదిగో యిది – నీ యిషముగ జేయ – నా యిష్ట మిక గాదది / నా యిఛ్చ యున్నట్టి – నా హృదయ మిదిగో నీ / కే యియ్యది రాజ – కీయ సింహాసనామౌ ||తనువు|| / ఉన్న నా ప్రేమ నీ – సన్నిధానమున నే – నెన్నడు ధార వోయన్ / నన్ను నీ వానిగ – నాథా గైకొను మెపుడు / చెన్నుగ నీ వశమై – స్థిర ముగ నుండెద ||తనువు||

తరచి తరచి|Tharachi Tharachi

తరచి తరచి చూడ తరమా / వెదకి వెదకి కనుగొనగలమా / యేసు వంటి మిత్రుని లోకమందున / విడచి విడచి ఉండగలమా / మరచి మరచి ఇలా మనగలమా / యేసు వంటి స్నేహితుని విశ్వమందున / లోక బంధాలన్నీ తృప్తినివ్వలేవుగా / ఏ మనిషిని నమ్మాలో – తెలియదు ఈ లోకంలో / నేల మంటిలోన పరమార్ధం లేదుగా / ఎంత బ్రతుకు బ్రతికినా – చివరకు చితియేగా / నమ్మదగిన యేసు ప్రాణమిచ్చె నీకై / జగతిలోన దొరకునా ఇటువంటి ప్రాణప్రియుడు (2) ||తరచి|| / లేరు లేరు ఎవ్వరు కానరారు ఎవ్వరు / యేసు వంటి ప్రేమికుడు ఇహమందు పరమందు / పదివేలలోన అతి కాంక్షణీయుడు / కలతలన్ని తీర్చి కన్నీటిని తుడచును / కల్వరిగిరిలోన కార్చెను రుధిరం / హృదయమందు చేర్చుకో కృప చూపు నాథుని (2) ||తరచి||