తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

సాగిపోదును ఆగిపోను నేను|Saagipodunu Aagiponu Nenu

సాగిపోదును – ఆగిపోను నేను / విశ్వాసములో నేను – ప్రార్ధనలో నేడు (2) / హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2) / ఎండిన ఎడారి లోయలలో – నేను నడిచినను / కొండ గుహలలో – బీడులలో నేను తిరిగినను (2) / నా సహాయకుడు – నా కాపరి యేసే (2) / హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2) / పగలెండ దెబ్బకైనను – రాత్రి వేళ భయముకైనా / పగవాని బానములకైనా – నేను భయపడను (2) / నాకు ఆశ్రయము – నా ప్రాణము యేసే (2) / హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2) / పదివేల మంది పైబడినా – పదిలముగానే నుండెదను / ప్రభు యేసు సన్నిధానమే – నాకు ఆధారం (2) / నాకు కేడెము – నా కోటయు యేసే (2) / హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2)

సాక్ష్యమిచ్చెద|Saakshyamichcheda

సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు / సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే (2) / సాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు ||సాక్ష్య|| / దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి (2) / మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో ||సాక్ష్య|| / పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు (2) / పిల్లలకును బెద్దలకును బ్రేమతో నా స్వానుభవము ||సాక్ష్య|| / బోధ చేయలేను వాద ములకు బోను నాక దేల (2) / నాధు డేసు ప్రభుని గూర్చి నాకు దెలసినంత వరకు ||సాక్ష్య|| / పాపులకును మిత్రుడంచు బ్రాణ మొసగి లేచెనంచు (2) / బాపముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించు డంచు ||సాక్ష్య|| / చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన (2) / ఘోరపాపు లైన క్రీస్తు కూర్మితో రక్షించు నంచు ||సాక్ష్య|| / పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల (2) / ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవు డంచు ||సాక్ష్య|| / ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక (2) / తల్లడిల్లు వారలకును తండ్రి కుమా రాత్మ పేర ||సాక్ష్య||

సామాన్యుడవు కావు|Saamaanyudavu Kaavu

(హో) హ్యాప్పీ క్రిస్మస్ హ్యాప్పీ క్రిస్మస్ / హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ / మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ / మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2) / సామాన్యుడవు కావు సృష్టికర్తవు నీవు / బలహీనుడవు కావు బలమైన దేవుడవు (2) / పాపిని రక్షింప యేసు పరమును వీడావు / చీకటి తొలగించి మాలో వెలుగును నింపావు (2) / ఆదాము హవ్వలు చేసిన పాపం శిక్షను తెచ్చింది (2) / క్రీస్తు చేసిన త్యాగం మనకు రక్షణ నిచ్చింది (2) ||హ్యాప్పీ క్రిస్మస్|| / జ్ఞానులు గొర్రెల కాపరులు ప్రభువుని చూశారు (2) / దీనులైన వారలకు ఆ భాగ్యం దొరికింది (2) ||హ్యాప్పీ క్రిస్మస్|| / యేసుని నీవు నమ్మినచో శాంతి సమాధానం (2) / నిత్యమైన సంతోషం పరలోకమే నీ సొంతం (2) ||హ్యాప్పీ క్రిస్మస్||

సాటి ఎవ్వరూ|Saati Evvaru

సాటి ఎవ్వరూ లేరు ఇలలో / సమానులెవ్వరూ ఇహ పరములో (2) / యోగ్యత లేని నాపై దేవా / మితిలేని కృప చూపి / నిరాశే మిగిలిన ఈ జీవితంలో / నిరీక్షణనిచ్చావు ||సాటి ఎవ్వరూ|| / దేవా నా కరములనెత్తి / దేవా నిన్నే కీర్తించి / దేవా నిన్నారాధింతును (4) / పాప బానిస బ్రతుకు / ఆకర్షణ నిండిన లోకం / సర్వమనే భ్రమలోనే బ్రతికానే / నీ వాక్యముతో సంధించి / నా ఆత్మ నేత్రములు తెరచి / ప్రేమతో నన్నాకర్షించావే (2) / దేవా నా కరములనెత్తి / దేవా నిన్నే కీర్తించి / దేవా నిన్నారాధింతును (2) / మలినమైన మనసు / గమ్యంలేని పయనం / హృదయమే చీకటిమయమయ్యిందే / నీ రక్తముతో నను కడిగి / నాకు విడుదలను దయచేసి / వెలుగుతో నాకు మార్గం చూపావే (2) / దేవా నా కరములనెత్తి / దేవా నిన్నే కీర్తించి / దేవా నిన్నారాధింతును (2) ||సాటి ఎవ్వరూ||

సహోదరులు ఐక్యత కలిగి|Sahodarulu Aikyatha Kaligi

అది తల మీద పోయబడి / అహరోను గడ్డము మీదుగా కారినా… / సహోదరులు ఐక్యత కలిగి నివసించుట / ఎంత మేలు – ఎంత మనోహరము / సహోదరులు ఐక్యత కలిగి నివసించుట / ఎంత మేలు – ఎంత మనోహరము / అది తల మీద పోయబడి / అహరోను గడ్డము మీదుగా కారినా… / పరిమళము – పరిమళ తైలము – (2) ||సహోదరులు|| / సంఘ సహవాసములో సహోదరులు / మత్సరము ద్వేషము అసూయతో నిండి (2) / వాక్యమును విడచి ఐక్యత లోపించి / తొలగిపోయిరి… ప్రభు కృప నుండి / సహవాసము పరిహాసమాయెను – (2) ||సహోదరులు|| / సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి / స్వస్థతలు దీవెనలు అద్భుతములు (2) / క్షయమైన వాటి కొరకు – అక్షయుడగు ప్రభును వదిలి / అపహసించిరి… సువార్త సేవను / పరిశుద్ధాత్ముడు పరిహాసమొందెను – (2) ||సహోదరులు||

సజీవ సాక్షులుగా|Sajeeva Saakshulugaa

సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం / నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం / ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము / జిహ్వా ఫలము అర్పింతుము (2) / మేమున్నాం నీ చిత్తములో / మేమున్నాం నీ సేవలో (2) ||సజీవ|| / తల్లి గర్భమునందు – మమ్మును రూపించి / శాశ్వత ప్రేమతో మేము నింపి – భువిని సమకూర్చినావు (2) / ఎగిసిపడే అలలెన్నో – అణచివేసి జయమిచ్చినావు / భీకరమైన తుఫానులోన – నెమ్మదినిచ్చి బ్రతికించావు / కృంగిపోము మేమెన్నడు / ఓటమి రాదు మాకెన్నడు (2) ||సజీవ|| / ఉన్నత పిలుపుకు మము పిలిచిన – నీ దివ్య సంకల్పం / నెరవేర్చుము మా పరిశుద్ధ దేవా – మహిమ పూర్ణుడా (2) / జడివానలైనా సుడిగాలులైనా – కాడిని మోస్తూ సాగెదం / నిందలయినా బాధలైనా – ఆనందముతో పాడెదం / కలత చెందము మేమెన్నడు / అలసట రాదు మాకెన్నడు (2) ||సజీవ||

సజీవుడవైన యేసయ్యా|Sajeevudavaina Yesayyaa

సజీవుడవైన యేసయ్యా / నిన్నాశ్రయించిన నీ వారికి / సహాయుడవై తృప్తి పరచితివే / సముద్రమంత సమృద్ధితో (2) / ఆనందించెద నీలో – అనుదినము కృప పొంది / ఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో (2) / ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యము / దాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు (2) / శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి / శ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2) ||సజీవుడవైన|| / క్షేమము నొందుటయే – సర్వ జనులకు – ప్రయాసగా మారే / క్షేమాధారము నీవై – దీర్ఘాయువుతో – సంతృప్తి పరతువు నన్ను (2) / నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే / నిత్యమైన నీ సత్య వాక్యముతో (2) ||సజీవుడవైన|| / నలువది ఏండ్లు – నీ స్వాస్థ్యమును – మోసినది నీవే / నీ కృప కాంతిలో – నా చేయి విడువక – నడిపించుచున్నది నీవే (2) / పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే / పరిపూర్ణమైన నీ ఉపదేశమును (2) ||సజీవుడవైన||

Most Popular Telugu Songs — Page 107 | UEC Telugu Church