పరిశుద్ధ గ్రంథము – వాగ్ధాన నిలయము
ప్రేమకు ప్రతిరూపము – నిరీక్షణకాధారము (2)
బాధలను తొలగించును
అనుదినము వాక్యమును ధ్యానించినా
ఆదరణ కలిగించును
అనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ||
సరిచేసి బలపరచును
అనుదినము వాక్యమును ధ్యానించినా
క్షమియించుట నేర్పించును
అనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ||
సహనమును దయచేయును
అనుదినము వాక్యమును ధ్యానించినా
ప్రభు రాకకై స్థిరపరచును
అనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ||