పాపానికి నాకు ఏ సంబంధం లేదు
పాపానికి నాపై ఏ అధికారము లేదు
పాపానికి నాకు ఏ సంబంధం లేదు
పాపానికి నాపై ఏ అజమాయిషీ లేదు
నా పాపములు అన్ని – నా ప్రభువు ఏనాడో క్షమియించివేసాడుగా
మరి వాటినెన్నడును – జ్ఞాపకము చేసికొనెను
అని మాట ఇచ్చాడుగా
నేనున్నా నేనున్నా – నా యేసుని కృప క్రింద
నే లేను నే లేను – ధర్మశాస్త్రం క్రింద (2) ||పాపానికి||
కృప ఉందని పాపం చెయ్యొచ్చా – అట్లనరాదు
కృప ఉందని నీతిని విడువోచ్చా (అట్లనరాదు)
కృప అంటే లైసెన్స్ కాదు
కృప అంటే ఫ్రీ పాస్ కాదు – పాపాన్ని చేసేందుకు
కృప అంటే దేవుని శక్తి
కృప అంటే దేవుని నీతి – పాపాన్ని గెలిచేందుకు
గ్రేస్ ఈస్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్
ఇట్స్ ఎ పవర్ ఆఫ్ గాడ్ టు ఓవర్ కం (4) ||నేనున్నా||
కృప ద్వారా ధర్మశాస్త్రముకు – మృతుడను అయ్యా
కృప వలన క్రీస్తులో స్వాతంత్య్రం (నే పొందితినయ్యా)
క్రియల మూలముగా కాదు
కృపయే నను రక్షించినది – నా భారం తొలగించినది
కృప నన్ను మార్చేసినది
నీతి సద్భక్తుల తోడ – బ్రతుకమని బోధించినది
గ్రేస్ టుక్ అవే బర్డెన్ ఫ్రమ్ మి
అండ్ టాట్ మి టు లివ్ రైటియస్లీ (4) ||నేనున్నా||