నీ మందిరమై నేనుండగా
నా యందుండి నడిపించవా (2)
నీవు తోడుండగా నాకు దిగులుండునా (2)
వెంబడిస్తాను నిను యేసువా (2)
నీవు కోరేటి దేవాలయం
నాదు దేహంబెగా నిశ్చయం (2)
నీదు ప్రత్యక్షత నాకు కలిగించవా (2)
నిత్యము నిన్ను స్తుతింతును (2)
నీ మందిరమై నేనుండగా...
నాడు నిర్మించే దేవాలయం
రాజు సొలొమోను బహుసుందరం (2)
అట్టి దేవాలయం నేను నిర్మించగా (2)
నీ కట్టడలో నను నిల్పుమా (2)
నీ మందిరమై నేనుండగా...
హన్న ప్రార్ధనను విన్నావుగా
నేనున్నానని అన్నావుగా (2)
నేడు సమూయెలుతో బహుగా మాట్లాడినా (2)
దేవా నాతోటి మాట్లాడవా (2)
నీ మందిరమై నేనుండగా...
ఆత్మసత్యముతో ఆరాధింప
ఆత్మదేవుండు నేర్పించుమా (2)
మహిమ రూపంబును నేను దర్సింపను (2)
నా నేత్రంబు వెలిగించుమా (2)
నీ మందిరమై నేనుండగా...
ఆ పరలోక ప్రతిబింబమై
ఈ ధరలోన దీపంబునై (2)
ధరణి వెలిగించను కరుణ ప్రసరింపను (2)
కరము తోడుంచి నడిపించుము (2)
నీ మందిరమై నేనుండగా...