నా తోడు.. నీవే దేవా – నా బలము.. నీవే ప్రభువా
నా ధైర్యం.. నీవే దేవా – నా సర్వం.. నీవే ప్రభువా
కాపాడే దైవం నీవేగా – కనుపాపగ నన్ను కాచేగా
నీ దయలో.. నీ కృపలో.. నీ ఒడిలో.. నన్నిలలో
నాలో కన్నీరే నీ వైపే చూడగా
నీవే యేసయ్య సంతోషం నింపగా
నిట్టూర్పు లోయలలో – గాఢాంధకారములో
నీవే నా అండగా నన్ను బలపరచగా
నడిపించే వాక్యం నీవైతివే
కరుణించే దైవం నీవైతివే ||నీ దయలో||
ఎన్నో కలతలే నా మదిలో నిండగా
నీవే యేసయ్య నా వెంటే ఉండగా
నా భయమును తొలగించి – విశ్వాసము కలిగించి
నీవే నా అండగా నన్ను స్థిరపరచగా
నీవుంటే చాలు నా యేసయ్యా
నీ ప్రేమే నాకు చూపావయ్యా ||నీ దయలో||