నా జీవం నా సర్వం నీవే దేవా (2)
నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల
నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా ||నా జీవం||
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి
మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి (2)
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును (2) ||నా జీవం||
మరణము జయించి తిరిగి లేచితివి
నాకు తోడుగా పరిశుద్ధాత్మ నిచ్చితివి (2)
అపురూప ప్రేమకై నే సాక్షినై నిలచెదన్
భూదిగంతము వరకు నే ప్రకటించెదన్ (2) ||నా జీవం||
నీవే నీవే నీవే దేవా (4)