జై జై యేసు రాజా జై జై
రాజాధిరాజా నీకే జై జై – (2) ||జై జై||
పాపకూపములో బడియున్న (2)
నన్ను జూచి చేయి జాచి (2)
చక్కగ దరికి జేర్చితివి (2) ||జై జై||
సిలువ రక్తములో నన్ను కడిగి (2)
పాపమంతా పరిహరించిన (2)
పావనుడగు నా ప్రభుయేసు (2) ||జై జై||
నీతి హీనుడనైన నాకు (2)
నీతి రక్షణ వస్త్రములను (2)
ప్రీతితో నొసగిన నీతి రాజా (2) ||జై జై||
మంటి పురుగునైన నన్ను (2)
మంటి నుండి మింట జేర్చిన (2)
మహాప్రభుండా నీకే జై జై (2) ||జై జై||
పాపశాపగ్రస్తుడనై యుండ (2)
నన్ను గూడ నీ స్వకీయ (2)
సంపాద్యముగా జేసితివి (2) ||జై జై||
రాజులైన యాజక గుంపులో (2)
నన్ను గూడ నీ సొత్తైన (2)
పరిశుద్ధ జనములో జేర్చితివి (2) ||జై జై||
తల్లియైన మరచిన మరచును (2)
నేను నిన్ను మరువననిన (2)
నమ్మకమైన నా ప్రభువా (2) ||జై జై||
అధిక స్తోత్రార్హుడవైన (2)
ఆది యంతము లేని దేవా (2)
యుగా యుగములకు నీకే జై జై (2) ||జై జై||