ఎత్తైన కొండపైన – ఏకాంతముగ చేరి
రూపాంతర అనుభవము పొ౦ద
ప్రార్ధించు ఓ ప్రియుడా – (2) ||ఎత్తైన||
క్రీస్తు యేసు వెంటను
కొండపైకి ఎక్కుము (2)
సూర్యునివలె ప్రకాశింప మోము
వస్త్రము కాంతివలెను (2)
వస్త్రము కాంతివలెను… ||ఎత్తైన||
పరిశుద్ధ సన్నిధిలో
ప్రభువుతో మాట్లాడుము (2)
ప్రభువు తిరిగి మాట్లాడు వరకు
ప్రార్ధించి ధ్యానించుము (2)
ప్రార్ధించి ధ్యానించుము… ||ఎత్తైన||