దేవాది దేవా ప్రభువుల ప్రభూ
రాజుల రాజా హల్లెలూయ (2)
నీ రక్తముతో విమోచించి
నీ రక్తముతో సంపాదించి (2)
పరలోక రాజ్య ప్రజలతో జేర్చి (2)
పరలోక పాటన్ నా కొసగితివి (2) ||దేవాది దేవా||
జీవిత నావలో తుఫాను రేగ
భయపడకుడని అభయము నిచ్చి (2)
జయప్రదముగా నన్ను నడిపించి (2)
జయజీవితము నా కొసగుచున్న (2) ||దేవాది దేవా||
పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి
కరుణతో నీ సొత్తుగా నన్ను జేసి (2)
అరమర లేక నన్నాదరించి (2)
పరలోక దర్శనంబిచ్చితివి (2) ||దేవాది దేవా||
మరణ పాత్రులం యిద్ధరణిలోన
దురిత ఋణముల స్మరణను మాన్పి (2)
ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము (2)
నీ రాజ్యమందు రాజులన్ జేసి (2) ||దేవాది దేవా||
శోధనగాధల కష్టములలో
నా దుఃఖములలో నే నేడ్వకుండా (2)
నీ దయ నాపై నిండార నింపి (2)
ఓదార్చి నన్ను నీ దారినడుపు (2) ||దేవాది దేవా||
ప్రతి వత్సరము దయతోడ నింపున్
ప్రభు జాడలు సారము జల్లున్ (2)
ప్రతి బీడునూ సారము చిలకన్ (2)
ప్రతి పర్వతము ఆనందించున్ (2) ||దేవాది దేవా||
పరలోక పరిశుద్ధ సంఘంబు యెదుట
సర్వశక్తిగల క్రీస్తుని యెదుట (2)
పరలోక నూతన గీతము పాడ (2)
జేర్చితివి నన్ నీ జనమునందు (2) ||దేవాది దేవా||