535 worship songs available. Lyrics in Roman and Telugu script.
ఆశీర్వాదంబుల్ మా మీద / వర్షింపజేయు మీశ / ఆశతో నమ్మి యున్నాము / నీ సత్య వాగ్దత్తము / ఇమ్మాహి మీద / క్రుమ్మరించుము దేవా / క్రమ్మర ప్రేమ వర్షంబున్ / గ్రుమ్మరించుము దేవా / ఓ దేవా పంపింపవయ్యా / నీ దీవెన ధారలన్ / మా దాహమెల్లను బాపు / మాధుర్యమౌ వర్షమున్ || ఇమ్మాహి || / మా మీద కురియించు మీశ / ప్రేమ ప్రవాహంబులన్ / సమస్త దేశంబు మీద / క్షామంబు పోనట్లుగన్ || ఇమ్మాహి || / ఈనాడే వర్షింపు మీశ / నీ నిండు దీవెనలన్ / నీ నామమందున వేడి / సన్నుతి బ్రౌర్ధింతుము || ఇమ్మాహి ||
నా ప్రాణమా యేసయ్యా… నా ధ్యానమా యేసయ్యా / నా ప్రాణమా నీకే వందనం / నా స్నేహమా నీకే స్తోత్రము (2) / నిను నే కీర్తింతును / మనసారా ధ్యానింతును (2) / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ / హల్లెలూయ హల్లెలూయ నా యేసయ్యా (2) ||నా ప్రాణమా|| / నిను విడచి ఉండలేనయ్యా / నా దేవ క్షణమైనా బ్రతుకలేనయ్యా (2) / సర్వ భూమికి మహారాజ నీవే పూజ్యుడవు / నన్ను పాలించే పాలకుడా నీవే పరిశుద్ధ్దుడా (2) / సమస్త భూజనులా స్తోత్రములపై ఆసీనుడా (2) / మోకరించి ప్రనుతింతును (2) ||హల్లెలూయ|| / మహిమ కలిగిన లోకములో నీవే రారాజువూ / నీ మహిమతో నను నింపిన సర్వశక్తుడవు (2) / వేవేల దూతలతో పొగడబడుచున్న ఆరాధ్యుడా (2) / మోకరించి ప్రనుతింతును (2) ||హల్లెలూయ||
ఆరాధించెదను నిన్ను / నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) / ఆనంద గానముతో ఆర్భాట నాదముతో (2) ||ఆరాధించెదను|| / నీ జీవ వాక్యము నాలో / జీవము కలిగించె (2) / జీవిత కాలమంతా / నా యేసయ్యా నీకై బ్రతికెదను (2) ||ఆరాధించెదను|| / చింతలన్ని కలిగిననూ / నిందలన్ని నన్ను చుట్టినా (2) / సంతోషముగ నేను / నా యేసయ్యా నిన్నే వెంబడింతును (2) ||ఆరాధించెదను||
నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని / నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని (2) / పదే పదే పాడుతుంది నా నాలుకా (2) / నీకే నా ఆరాధనా యేసయ్యా / నీకే నా ఆరాధనా (2) / నేను బ్రతికి ఉన్నానంటే కారణం నీవేగా / నాకున్న ఆధారం ఆశ్రయం నీవేగా (2) / నా శక్తి చేత కాదు నా బలము చేత కాదు / కేవలం నీ కృపయే (2) / కేవలం నీ కృపయే ||నా గుండె|| / నీతోనే ఉండుటకు నన్నెన్నుకున్నావు / నీ ప్రేమ విందులో నన్ను చేర్చుకున్నావు (2) / నీ పరిపాలనలోన నా ఆత్మనుంచుట / నాకెంత భాగ్యము (2) / నాకెంత భాగ్యము ||నా గుండె||
నా మనో నేత్రము తెరచి / నా కఠిన హృదయమును మార్చి (2) / అంధకారములో నేనుండ (2) / వెదకి నన్ రక్షించితివి (2) ||నా మనో|| / నే పాప భారము తోడ / చింతించి వగయుచునుంటి (2) / కల్వరి సిలువలో నా శ్రమలన్ (2) / పొంది నన్ విడిపించితివి (2) ||నా మనో|| / ఎన్నాళ్ళు బ్రతికిననేమి / నీకై జీవించెద ప్రభువా (2) / బాధలు శోధనలు శ్రమలలో (2) / ఓదార్చి ఆదుకొంటివయా (2) ||నా మనో|| / నీ సన్నిధిని నే కోరి / నీ సన్నిధిలో నే మారి (2) / స్తుతి పాత్రగ ఆరాధింతున్ (2) / యుగయుగములు సర్వ యుగములు (2) ||నా మనో||
భజన చేయుచు భక్తపాలక / ప్రస్తుతింతు నీ నామమును (2) / వృజినములపై జయము నిచ్చిన (2) / విజయుడా నిను వేడుకొందు ||భజన|| / దివ్య పదవిని విడిచి నీవు / దీనుడవై పుట్టినావు (2) / భవ్యమైన బోధలెన్నో (2) / బాగుగా ధర నేర్పినావు ||భజన|| / నరుల గావను పరమునుండి / ధరకు నీవు వచ్చినావు (2) / పరుడ నైన నా కొరకు నీ (2) / ప్రాణము నర్పించినావు ||భజన|| / చెడినవాడ నైన నన్ను / జేరదీసి ప్రోచినావు (2) / పడిన నాడు గోతి నుండి (2) / పైకి లేవనెత్తి నావు ||భజన|| / ఎంత ప్రేమ ఎంత దయ / ఎంత కృప యేసయ్య నీకు (2) / ఇంతయని వర్ణింప నిలలో (2) / నెవనికిని సాధ్యంబు కాదు ||భజన||
అడవి చెట్ల నడుమ / ఒక జల్దరు వృక్షం వలె / పరిశుద్ధుల సమాజములో / యేసు ప్రజ్వలించుచున్నాడు (2) / కీర్తింతున్ నా ప్రభుని / జీవ కాలమెల్ల ప్రభు యేసుని / కృతజ్ఞతతో స్తుతించెదను (2) / షారోను రోజా ఆయనే / లోయ పద్మమును ఆయనే / అతిపరిశుద్ధుడు ఆయనే / పదివేలలో అతిశ్రేష్టుడు (2) ||కీర్తింతున్|| / పరిమళ తైలం నీ నామం / దాని వాసన వ్యాపించెగా / నింద శ్రమ సంకటంలో / నను సుగంధముగా చేయున్ (2) ||కీర్తింతున్|| / మనోవేదన సహించలేక / సిలువ వైపు నే చూడగా / లేవనెత్తి నన్నెత్తుకొని / భయపడకుమని అంటివి (2) ||కీర్తింతున్|| / నా త్రోవకు దీపం నీవే / నా బ్రతుకుకు జీవం నీవే / నా సేవకు బలము నీవే / నా ఆత్మకాదరణ నీవే (2) ||కీర్తింతున్|| / ఘనమైన నా ప్రభువా / నీ రక్త ప్రభావమున / నా హృదయము కడిగితివి / నీకే నా స్తుతి ఘనత (2) ||కీర్తింతున్|| / నీవు నా దాసుడవనియు / ఏర్పరచుకొంటినని / నేనే నీ దేవుడనని / భయపడకు-మని అంటివి (2) ||కీర్తింతున్||
పదివేలలో అతిసుందరుడా / మనోహరుడా మహిమోన్నతుడా (2) / నీ నామం అతి మధురం / నీ త్యాగం మహానీయం (2) / తల్లిదండ్రుల కన్నను / బంధు మిత్రుల కన్నను (2) / ప్రేమించి నాకై నిలచే / స్నేహితుడా ప్రాణ నాథుడా (2) ||పదివేలలో|| / నీ కొరకే యేసు నీ కొరకే (3) / నా కరములెత్తెదను / మోకరించి నా శిరము వంచి / నా కరములెత్తెద నీ కొరకే (2) / పరిశుద్ధ ఆత్మ రమ్ము (2) / నను యేసు పాదము చెంత చేర్చుము / పరిశుద్ధ ఆత్మ రమ్ము ||నీ కొరకే||
స్తుతుల మీద ఆసీనుడా / స్తుతులందుకో నా యేసు రాజా (2) / ఆరాధన యేసు ఆరాధనా / ఆరాధన నీకే ఆరాధనా (2) / ప్రేమామయుడా మహోన్నతుడా / పూజించెదన్ నా యేసు రాజా (2) ||ఆరాధన|| / అల్ఫా ఒమేగా ఆదిసంభూతుడా / రానైయున్న నా యేసు రాజా (2) ||ఆరాధన||
నీవే నా ప్రాణము నీవే నా సర్వము / నీవే నా జీవము యేసయ్యా (2) / మరువలేను నీదు ప్రేమ / విడువలేనయ్యా నీ స్నేహం (3) ||నీవే|| / మార్గం నీవే సత్యం జీవం నీవే / జీవించుటకు ఆధారం నీవే (2) / అపాయము రాకుండా కాపాడువాడవు / నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే|| / తోడు నీవే నా నీడ నీవే / నిత్యం నా తోడుగుండె చెలిమి నీవే (2) / బ్రతుకంతా నీ కొరకై జీవింతును / నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే||
నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా / నా దీన బ్రతుకునే దీవించిన దేవా (2) / నిన్నే ఆరాధింతును – నీలో ఆనందింతును (2) / నా యవ్వనమంతా… నా జీవితమంతా (2) ||నన్నెంతగానో|| / ధరలోని మన్నుతో సమమైన నన్ను / ఎన్నుకొని ఉన్నత స్థితికి చేర్చినావు (2) / అన్నీ నీవే నాకై సమకూర్చినావు / ఉన్నాను నీ తోడు భయపడకన్నావు (2) / వాక్యపు మన్నాతో పోషించిన నన్నే / ఎన్నడూ విడువని ఎడబాయని నిన్నే ||నిన్నే|| / దినమెల్ల నా కొరకే కనిపెట్టినావు / ఎల్లవేళలా నా తోడుగ నిలిచావు (2) / మెల్లని నీ స్వరముతో మాట్లాడినావు / చల్లని కరములతో నా కన్నీరు తుడిచావు (2) / పాపపు ముళ్ళును తొలగించుటకై నాలో / మరణపు విల్లును విరచిన దేవా నీలో ||నీలో||
అర్పించుచుంటిని యేసయ్యా / నన్ను నీ చేతికి (2) / దీనుడను నన్ను నీ బిడ్డగా / ప్రేమతో స్వీకరించు (2) ||అర్పించుచుంటిని|| / ఈ లోక జీవితం అల్పకాలమే / నీవే నా గమ్యస్థానము (2) / నిజ సంతోషం నీవు నాకిచ్చి (2) / నా హృదయం వెలిగించు (2) / నా ప్రభువా యేసయ్యా ||అర్పించుచుంటిని|| / దప్పిగొన్న జింకవలెనే / ఆశతో చేరితి నీ దరి దేవా (2) / సేదతీర్చి జలము నిన్ను (2) / వాడిన బ్రతుకులో (2) / నింపుము జీవము ||అర్పించుచుంటిని||