255 salvation songs available. Lyrics in Roman and Telugu script.
నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్ / నీ రక్తమే నా బలము (2) / నీ రక్త ధారలే ఇల / పాపికాశ్రయంబిచ్చును (2) / పరిశుద్ధ తండ్రి పాపిని / కడిగి పవిత్ర పరచుము (2) ||నీ రక్తమే|| / నశించు వారికి నీ సిలువ / వెర్రితనముగ నున్నది (2) / రక్షింపబడుచున్న పాపికి / దేవుని శక్తియై యున్నది (2) ||నీ రక్తమే|| / నీ సిల్వలో కార్చినట్టి / విలువైన రక్తముచే (2) / పాప విముక్తి చేసితివి / పరిశుద్ధ దేవ తనయుడా (2) ||నీ రక్తమే|| / పంది వలె పొర్లిన నన్ను / కుక్క వలె తిరిగిన నన్ను (2) / ప్రేమతో చేర్చుకొంటివి / ప్రేమార్హ నీకే స్తోత్రము (2) ||నీ రక్తమే|| / నన్ను వెంబడించు సైతానున్ / నన్ను బెదరించు సైతానున్ (2) / దునుమాడేది నీ రక్తమే / దహించేది నీ రక్తమే (2) ||నీ రక్తమే|| / స్తుతి మహిమ ఘనతయు / యుగయుగంబులకును (2) / స్తుతి పాత్ర నీకే చెల్లును / స్తోత్రార్హుడా నీకే తగును (2) ||నీ రక్తమే||
కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో / ఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో (2) ||కుతూహలం|| / పాపమంత పోయెను – రోగమంత పోయెను / యేసుని రక్తములో / క్రీస్తునందు జీవితం – కృప ద్వారా రక్షణ / పరిశుద్ధ ఆత్మలో (2) ||కుతూహలం || / దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించు / దేవాలయం మనమే / ఆత్మయైన దేవుడు – మన సొంతమాయెను / ఆశ్చర్యమాశ్చర్యమే (2) ||కుతూహలం|| / శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు / జయంపై జయం ఇచ్చును / ఏకముగా కూడి – హోసన్నా పాడి / ఊరంతా చాటెదము (2) ||కుతూహలం||
ఆనంద యాత్ర / ఇది ఆత్మీయ యాత్ర / యేసుతో నూతన / యెరుషలేము యాత్ర / మన.. యేసుతో నూతన / యెరుషలేము యాత్ర ||ఆనంద యాత్ర|| / యేసుని రక్తము / పాపములనుండి విడిపించెను (2) / వేయి నోళ్ళతో స్తుతించినను / తీర్చలేము ఆ ఋణమును (2) ||ఆనంద యాత్ర|| / రాత్రియు పగలును / పాదములకు రాయి తగలకుండా (2) / మనకు పరిచర్య చేయుట కొరకై / దేవదూతలు మనకుండగా (2) ||ఆనంద యాత్ర|| / కృతజ్ఞత లేని వారు / వేలకొలదిగ కూలినను (2) / కృపా వాక్యమునకు సాక్షులమై / కృప వెంబడి కృప పొందెదము (2) ||ఆనంద యాత్ర|| / ఆనందం ఆనందం / యేసుని చూచే క్షణం ఆసన్నం / ఆత్మానంద భరితులమై / ఆగమనాకాంక్షతో సాగెదం ||ఆనంద యాత్ర||