167 prayer songs available. Lyrics in Roman and Telugu script.
ఆలకించుమో దేవా మా ఆక్రందనను / కోల్పోతిమయ్యా మా ఆత్మీయులను (2) / మా ధైర్యము నీవై – మము నడిపించుము తండ్రి / బలహీనులమైన మమ్ము బలపరచుమయ్యా… / భూదిగoతముల నుండి మొరపెట్టుచున్నాము / మా ప్రార్థన ఆలకించుమో దేవా (2) / మా కనులెత్తుచున్నాము కనికరించుము / నీ రాకడకు మమ్ము సిధ్ధపరచుము / అంధకారము అలముకొన్న – ఈ లోకములో / గొప్ప వెలుగుగా మమ్ము ఉండనిమ్ము ||ఆలకించుమో||
యేసు యేసు యేసు నిన్ను చూడాలి (2) / చూడాలి నిత్యం చూడాలి (2) / అగ్ని స్థంభమా నిన్ను చూడాలి (2) / మేఘ స్థంభమా నిన్ను చూడాలి (2) ||యేసు|| / అగ్ని జ్వాల నేత్రుడా నిన్ను చూడాలి (2) / అపరంజి పాదములను చూడాలి (2) నీ.. ||యేసు|| / దహించు అగ్ని నిన్ను చూడాలి (2) / పాపపు పెదవులు దహించు నిన్ను చూడాలి (2) నా.. ||యేసు|| / మండుచున్న అగ్ని పొద నిన్ను చూడాలి (2) / పాదాలకున్న మలినము పోవాలి (2) నా.. ||యేసు|| / దీప వృక్షమా నిన్ను చూడాలి (2) / నీతి సూర్యుడా నిన్ను చూడాలి (2) ||యేసు||
అంత్య దినములయందు ఆత్మను / మనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2) / దేవా యవ్వనులకు దర్శనము / కలుగజేయుము (2) ||అంత్య|| / కోతెంతో విస్తారము / కోసేడి వారు లేరు / యవ్వనులకు నీ పిలుపునిచ్చి / సేవకు తరలింపుము (2) ||దేవా|| / సౌలు లాంటి యవ్వనులు / దమస్కు మార్గము వెళ్లుచుండగా (2) / నీ దర్శనము వారికిచ్చి / పౌలు వలె మార్చుము (2) ||దేవా|| / సంసోను లాంటి యవ్వనులు / బలమును వ్యర్ధ పరచుచుండగా (2) / నీ ఆత్మ బలమును వారికిచ్చి / నీ దాసులుగా మార్చుము (2) ||దేవా||
ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా / నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా / ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా / పరిశుద్ధాత్ముడా – నా ప్రేమ పూర్ణుడా / ఎండిన ఎముకలు జీవింప జేయుము / ఆత్మ స్వరూపుడా – పరమాత్మ స్వరూపుడా (2) ||ఆనంద|| / అరణ్య భూమిని ఫలియింప జేయుము / ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2) ||ఆనంద|| / యవ్వనులకు నీ దర్శన మిమ్ము / ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2) ||ఆనంద||
జీవితాంతము వరకు నీకే – సేవ సల్పుదునంటిని / నీవు నాతో నుండి ధైర్యము – నిచ్చి నడుపుము రక్షకా ||జీవితాంతము|| / ఎన్ని యాటంకంబులున్నను – ఎన్ని భయములు కల్గిన / అన్ని పోవును నీవు నాకడ – నున్న నిజమిది రక్షకా ||జీవితాంతము|| / అన్ని వేళల నీవు చెంతనె – యున్న యను భవమీయవె / తిన్నగా నీ మార్గమందున – పూనినడచెద రక్షకా ||జీవితాంతము|| / నేత్రములు మిరుమిట్లు గొలిపెడి – చిత్రదృశ్యములున్నను / శత్రువగు సాతాను గెల్వను – చాలు నీ కృప రక్షకా ||జీవితాంతము|| / నాదు హృదయమునందు వెలుపట – నావరించిన శత్రులన్ / చెదర గొట్టుము రూపుమాపుము – శ్రీఘ్రముగ నారక్షకా ||జీవితాంతము|| / మహిమలో నీవుండు చోటికి – మమ్ము జేర్చెదనంటివే / ఇహము దాటినదాక నిన్ను – వీడనంటిని రక్షకా ||జీవితాంతము|| / పాప మార్గము దరికి బోవక – పాత యాశల గోరక / ఎపుడు నిన్నే వెంబడింపగ – కృప నొసంగుము రక్షకా ||జీవితాంతము||
నాకున్న బలము సరిపోదయ్యా / నాకున్న జ్ఞానము సరి కాదయ్యా (2) / ఆత్మతో నింపి అభిషేకించు / (నీ) శక్తితో నింపి నను నడిపించు (2) ||నాకున్న|| / నిన్ను విడిచి లోకంలో సౌలు వలె తిరిగాను / నిన్ను మరచి యోనాలా నిద్రలో మునిగాను (2) ||ఆత్మతో|| / మనసు మారి పౌలు వలె నిన్ను చేరుకున్నాను / మనవి ఆలకించమని పెనుగులాడుచున్నాను (2) ||ఆత్మతో|| / అనుమానంతో నేను తోమలా మారాను / అబ్రాహాములా నీతో ఉండగోరుచున్నాను (2) ||ఆత్మతో||
పంపుము దేవా దీవెనలతో – పంపుము దేవా (2) / పంపుము దయ చేత పతిత పావన నామ / పెంపుగ నీ సేవ ప్రియమొప్ప నొనరింప ||పంపుము|| / మా సేవ నుండిన మా వెల్తు-లన్నియు (2) / యేసుని కొరకు నీ వెసఁగఁ క్షమియించుచు ||పంపుము|| / వినిన సత్యంబును – విమలాత్మ మది నిల్పి (2) / దినదినము ఫలములు దివ్యముగ ఫలియింప ||పంపుము|| / ఆసక్తితో ని-న్ననిశము సేవింప (2) / భాసురంబగు నాత్మ వాసి-కెక్కగ నిచ్చి ||పంపుము||
కర్తా మమ్మును దీవించి / క్షేమమిచ్చి పంపుము / జీవాహార వార్త నిచ్చి / మమ్మును పోషించుము / ఇహ నిన్ను వేడుకొని / బహుగా స్తుతింతుము / పరమందు చేరి యింక / స్తోత్రము చెల్లింతుము
లోకములో వెఱ్ఱివారిని యోగ్యులుగా చేసావయ్యా యేసయ్యా / విద్య లేని పామరులను పేరు పెట్టి పిలిచావయ్యా / జాలర్లను పిలిచావయ్యా యేసయ్యా / మనుష్యులు పట్టేవారుగా మార్చావయ్యా (2) / నన్ను అట్టి రీతిగా మార్చుమయా / జక్కయ్యను పిలిచావయ్యా యేసయ్యా / నేడు నీతో ఉంటానన్నావయ్యా (2) / నాతో అట్టి రీతిగా ఉండుమయా / సౌలును పిలిచావయ్యా యేసయ్యా / పౌలుగ మార్చావయ్యా (2) / నన్ను అట్టి రీతిగా మార్చుమయా
ప్రార్ధన యేసుని సందర్శన / పరమ తండ్రితో సంభాషణ / కరములెత్తి ప్రార్ధించగా / పరమ తండ్రి కౌగిలించును / స్వరమునెత్తి ప్రార్ధించగా / మధుర స్వరముతో మాటాడును ||ప్రార్ధన|| / తండ్రి అని నే పిలువగా / తనయుడా అని తా బల్కును / ఆదుకొనును అన్ని వేళలా / కన్నీరంతయు తుడిచివేయున్ ||ప్రార్ధన|| / మోకరించి ప్రార్ధించగా / సమీపముగా వేంచేయును / మనవులెల్ల మన్నించును / మహిమతో నలంకారించును ||ప్రార్ధన|| / కుటుంబముతో ప్రార్ధించగా / కొదువ ఏమియు లేకుండును / ఐక్యతలో నివసించును / శాశ్వత జీవము అచటుండును ||ప్రార్ధన|| / సంఘముగను ప్రార్ధించగా / కూడిన చోటు కంపించును / పరిశుద్ధాత్ముడు దిగివచ్చును / ఆత్మ వరములతో నింపును ||ప్రార్ధన|| / ఉపవాసముతో ప్రార్ధించగా / కీడులన్నియు తొలగిపోవును / కొట్లు ధాన్యముతో నింపును / క్రొత్త పానము త్రాగించును ||ప్రార్ధన|| / ఏకాంతముగా ప్రార్ధించగా / నీతిని నాకు నేర్పించును / యేసు రూపము నాకిచ్చును / యేసు రాజ్యము నను చేర్చును ||ప్రార్ధన||
గలిలయ తీరాన చిన్న నావ / యేసయ్య ఏర్పరచు-కున్న నావ (2) / యేసయ్య సేవలో వాడబడిన / యేసయ్య బోధకు ఉపయోగపడిన / ఆ నావలా నేనుంటే చాలునయ్యా ||గలిలయ|| / యేసయ్య రాకకై ఎదురు చూసిన / యేసయ్యను మోస్తూ పరవశించిన (2) / ఆత్మల సంపాదనకై వాడబడిన / ఆశ్చర్య కార్యములెన్నో చూసిన / ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా ||గలిలయ|| / సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా / పెనుతుఫానులెన్నో అడ్డొచ్చినా (2) / ఆగకుండా ముందుకే కొనసాగిన / అలుపెరగని సేవకై సిద్ధపడిన / ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా ||గలిలయ||
బలపరచుము స్థిరపరచుము / నా ప్రార్థనకు బదులీయము (2) / లోకాశల వైపు చూడకూండా / లోకస్థులకు జడవకుండా (2) / నీ కృపలో నేను జీవించుటకు / నా మాటలలో నా పాటలలో / నీ సువార్తను ప్రకటించెదను (2) / నే నడచు దారి ఇరుకైననూ / నే నిలుచు చోటు లోతైననూ (2) / నే జడవక నిను కొలుతును / ధ్యానింతును కీర్తింతును / నీ వాక్యమును అను నిత్యము (2) / అపవాది నన్ను శోధించినా / శ్రమలన్ని నాపై సంధించినా (2) / నే జడవక నిను కొలుతును