167 prayer songs available. Lyrics in Roman and Telugu script.
స్వీకరించుమయా నాథా స్వీకరించుమయా / ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా / స్వంతమేది నాది లేదు నిజాము నా దేవా / నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు ||స్వీకరించుమయా|| / నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు / నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని (2) / జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవొసగి / ప్రేమ యినెడి భాగ్యమును పంచిపెట్టుమయా ||స్వీకరించుమయా|| / సుతుని ద్వారా పితకు నేనిల బలిని అర్పింతు / ఆత్మ దేహములత్యంత అయోగ్యమైనవి (2) / అమరమైన నీ ప్రేమతో నన్ను నింపుమయా / పుణ్య జీవిత భాగ్యమును పంచిపెట్టుమయా ||స్వీకరించుమయా||
ప్రభువా నీవే నాదు శరణం / ఆశ్రయించితి నీ చరణములే (2) / అపవాది క్రియలందు బంధీనైతిన్ / కృప చూపి నను విముక్తుని చేయుమా / విపరీతి గతి పొందియుంటిన్ / నీదు ముక్తి ప్రభావింపనిమ్ము ||ప్రభువా|| / మరణ ఛాయలు నాపై బ్రమ్ముకొనెను / కరుణించి నీ దివ్య కాంతి నిమ్ము / చెదరిన నీదు ప్రతి రూపం / నాపై సరి చేసి ముద్రించు దేవా / నీ న్యాయ విధులన్ని భంగ పరచి / గాయపరచితి నేను అపరాధిని / పరితాపమును పొందుచుంటి / నాదు పాపము క్షమియించు దేవా ||ప్రభువా|| / పాప భారము తొడ అరుదించితి / సేద తీర్చుము శాంతి జలములతో / నీ ప్రేమ రుధిర శ్రవంతి / శాప భారము తొలగించు దేవా ||ప్రభువా|| / శరణం యేసు చరణం (4) ||ప్రభువా||
పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా (2) / హల్లెలూయా – హల్లేలూయా (2) / తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలిసే (2) / కడవరి చినుకులు పడగా పొలములో (2) / ఫలియించెను దీవెనలే ||పావురమా|| / అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెనులే (2) / సభకే జయమౌ ఉబికే జీవం (2) / ప్రబలెను ప్రభు హృదయములో ||పావురమా|| / బలహీనతలో బలమా బహుమానములో మహిమా (2) / వెలిగే వరమా ఓ పావురమా (2) / దిగిరా దిగిరా త్వరగా ||పావురమా||
నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ / నావన్ని కృపచేత నీవలన నొందిన (2) / భావంబునను నేను బహుదైర్యమొందెద ||నావన్ని|| / నీకు నా ప్రాణము నిజముగా నర్పించి (2) / నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద ||నావన్ని|| / సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని (2) / నిత్యంబు గరముల నీ సేవ జేసెద ||నావన్ని|| / నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు (2) / ఆశచే నడిపించు మరల నా పదములు ||నావన్ని|| / పెదవులతో నేను బెంపుగ నీ వార్త (2) / గదలక ప్రకటింప గలిగించు దృఢ భక్తి ||నావన్ని|| / నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ (2) / యావంత యైనను నాశింప మదిలోన ||నావన్ని|| / నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే (2) / సేవ జేయగ నిమ్ము స్థిర భక్తితో నీకు ||నావన్ని|| / చిత్తము నీ కృపా యత్తంబు గావించి (2) / మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము ||నావన్ని|| / హృదయంబు నీకిత్తు సదనంబు గావించి (2) / పదిలంబుగా దాని బట్టి కాపాడుము ||నావన్ని||
దేవుని సముఖ జీవ కవిలెలో (2) / నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| / జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే (2) / హత సాక్షుల కవిలెలో (2) / నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| / ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన (2) / విజయవీరుల కవిలెలో (2) / నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| / పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు (2) / సర్వోన్నతుని పురములలో (2) / నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| / దేవుని సన్నిధి మహిమ ధననిధి – దాతను వేడి వరము పొందిన (2) / ప్రార్ధన వీరుల కవిలెలో (2) / నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| / పరమునుండి ప్రభువు దిగగా – పరిశుద్ధులు పైకెగయునుగా (2) / పరిశుద్ధుల కవిలెలో (2) / నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||
చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును / చిన్ని బిడ్డనేసయ్య స్వీకరించుము (2) / నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము (2) / నీవే నా ధ్యానము (2) ||చిన్ని|| / తండ్రి మాటను ధిక్కరించక / తలవంచిన ఇస్సాకు వలే (2) / విధేయతను నేర్పించుము – వినయముగల మనసివ్వుము (2) / వినయముగల మనసివ్వుము (2) ||చిన్ని||
నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము / నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము / నీ ఆత్మతో నను నింపుమా / నీ సేవలో ఫలియింపగా / దేవా… దేవా… ||నీ దయ|| / కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా / ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2) / ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు / నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2) / ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా / నీవె నా మార్గము – నీవె నా జీవము / నీవె నా గమ్యము – నీవె నా సర్వము / నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా ||నీ దయ|| / ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి / వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2) / నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని / నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2) / నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం / నీవె నా తోడుగా – నీవె నా నీడగా / ఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమా / నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా ||నీ దయ||
ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా / ప్రభువు నామములో సాగే అనుబంధమా / ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా / ఓ కంట కన్నీరు తగదు సహవాసమా / ప్రతి కష్టము మనము పంచుకుందాము / కలిసి అందరము వేడుకుందాము (2) ||ఓ క్రీస్తు|| / మనమంతా కలిసి ఆ దేవుని దేహము / తండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము (2) / ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదన / ఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ (2) ||ప్రతి కష్టము|| / సాటి సోదరులు శ్రమల పాలైనపుడు / సాతాను శక్తులచే శోధింపబడినపుడు (2) / ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలి / ఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి (2) ||ప్రతి కష్టము|| / శ్రమలు పొందేవారు అవిధేయులు కారు / విశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు (2) / శాంతమును పాటించి, దేవునిలో వీక్షించి / పంచాలి ఓదార్పు వదిలేసి మన తీర్పు (2) ||ప్రతి కష్టము||
భారత దేశమా యేసుకే / నా భారత దేశమా ప్రియ యేసుకే (2) / నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన / నిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం (2) / యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమ్రోగిపోవాలి / పని చేయుచున్న సాతాను శక్తులు పటా పంచలైపోవాలి (2) / భారత దేశమా నా భారత దేశమా / నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి / భారత దేశమా నా భారత దేశమా / ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి / సృష్టికర్తనే మరచి – భారత దేశమా / సృష్టిని పూజించుట తగునా – నా భారత దేశమా (2) / ఈ లోకమును సృష్టించిన యేసే – భారత దేశమా / నిను రక్షించుటకు ప్రాణం పెట్టెను – భారత దేశమా (2) / భారత దేశమా యేసుని చేరుమా / నూతన సృష్టిగ మార్చబడుదువు భారత దేశమా (2) / భారత దేశమా నా భారత దేశమా / నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి / భారత దేశమా నా భారత దేశమా / ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి / శాంతికి అధిపతి ఆ యేసే – భారత దేశమా / శాంతి రాజ్యమును స్థాపించును – నా భారత దేశమా (2) / లోకమంతయు లయమైపోవును – భారత దేశమా / లోకాశలన్నియు గతించిపోవును – భారత దేశమా (2) / భారత దేశమా యేసుని చేరుమా / శాంతి సమాధానములను పొందుము భారత దేశమా (2) / భారత దేశమా నా భారత దేశమా / నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి / భారత దేశమా నా భారత దేశమా / ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి / రాజుల రాజుగ మన యేసే – భారత దేశమా / పెండ్లి కుమారుడై రానుండె – నా భారత దేశమా (2) / యేసుని నమ్మిన దేశములన్ని – భారత దేశమా / యేసుతో కూడ కోనిపోబడును – భారత దేశమా (2) / భారత దేశమా యేసుని చేరుమా / సువర్ణ దేశముగ మార్చబడుదువు భారత దేశమా (2) / భారత దేశమా నా భారత దేశమా / నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి / భారత దేశమా నా భారత దేశమా / ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి / భారత దేశమా నా యేసుకే / భారత దేశమా ప్రియ యేసుకే (2) / నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన / నిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం (2) / యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమ్రోగిపోవాలి / పని చేయుచున్న సాతాను శక్తులు పటా పంచలైపోవాలి (2) / భారత దేశమా నా భారత దేశమా / నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి / భారత దేశమా నా భారత దేశమా / ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి
ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు (2) / అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యము / నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు (2) ||ఆశ్చర్య|| / రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా / యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను / జాలరుల మదిలో ఆనందమే / యేసుతో పనిలో ఆశ్చర్యమే (2) / హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య|| / కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం / యేసు మాట నిలుచును తరతరాలు / తండ్రిలా పోషించి దీవించును / తల్లిలా ఆదరించి ప్రేమించును (2) / హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య||
కనలేని కనులేలనయ్యా / వినలేని చెవులేలనయ్యా / నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా / ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా (2) / అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| / దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా (2) / అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| / మరణించావు యేసయ్యా మరణించి నన్ను లేపావుగదయ్యా (2) / అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| / రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా (2) / అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| / అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేకన్నా (2) / ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నియ్య వేసయ్యా ||కనలేని||
అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా (2) / నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా (2) / మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవా / నిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువా / నీ కృపలో బహుగా ఫలించుటకు / ఫలింపని వారికి ప్రకటించుటకు (2) / అంగీకరించుము నా సమర్పణ ||అంకితం|| / కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు దేవా / చీకటిలోనున్న నా జీవితం – చిరుదివ్వెగా చేసావు ప్రభువా / నీ సన్నిధిలో ప్రకాశించుటకు / అంధకార ఛాయలను తొలగించుటకు (2) / అంగీకరించుము నా సమర్పణ ||అంకితం||