167 prayer songs available. Lyrics in Roman and Telugu script.
దేవా చెవియొగ్గుము.. దృష్టించుము.. నిన్నే వెదకుచున్నాను / దేవా సెలవియ్యుము.. బదులీయము.. నిన్నే వేడుచున్నాను / ప్రతి ఉదయం – నిను నమ్మి / ప్రతి రాత్రి – నిను వేడి / ప్రతి ఘడియ – నిను కోరి.. నహాళ్ / ఆశతో వేచి ఉన్నా – నీవే నా నమ్మకం / ఓర్పుతో కాచి ఉన్నా – నీవేగా నా ధైర్యం (2) / ఎల్ షమా (3) / నా ప్రార్ధన వినువాడా (2) / ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను (వేచి వేచి యున్నాను) / నీ తట్టు నా కరముల్ నే చాపుచున్నాను (2) / ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభు / పోగొట్టుకున్నవి మరలా దయ చేయుము / ఆత్మ వర్షం కురిపించి నను బ్రతికించుము / నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు ||ఎల్ షమా|| / విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను / అడుగడుగు నా తోడై ఒడ్డుకు నను చేర్చవా (2) / యెహోవా నా దేవా నీవే నాకున్నది / బాధలో ఔషధం నీ ప్రేమే కదా (2) ||ఎల్ షమా|| / నీ శక్తియే విడిపించును / నీ హస్తమే లేవనెత్తును / నీ మాటయే నా బలము / నీ మార్గము పరిశుద్ధము (2) ||ఎల్ షమా||
ఎత్తైన కొండపైన – ఏకాంతముగ చేరి / రూపాంతర అనుభవము పొ౦ద / ప్రార్ధించు ఓ ప్రియుడా – (2) ||ఎత్తైన|| / క్రీస్తు యేసు వెంటను / కొండపైకి ఎక్కుము (2) / సూర్యునివలె ప్రకాశింప మోము / వస్త్రము కాంతివలెను (2) / వస్త్రము కాంతివలెను… ||ఎత్తైన|| / పరిశుద్ధ సన్నిధిలో / ప్రభువుతో మాట్లాడుము (2) / ప్రభువు తిరిగి మాట్లాడు వరకు / ప్రార్ధించి ధ్యానించుము (2) / ప్రార్ధించి ధ్యానించుము… ||ఎత్తైన||
ప్రార్థన వలనే పయనము – ప్రార్థనే ప్రాకారము / ప్రార్థనే ప్రాధాన్యము – ప్రార్థన లేనిదే పరాజయం (2) / ప్రభువా ప్రార్థన నేర్పయ్యా / ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2) / నీ పాదాలు తడపకుండా / నా పయనం సాగదయ్యా (2) ||ప్రార్థన|| / ప్రార్ధనలో నాటునది – పెల్లగించుట అసాధ్యము / ప్రార్ధనలో పోరాడునది – పొందకపోవుట అసాధ్యము (2) / ప్రార్ధనలో ప్రాకులాడినది – పతనమవ్వుట అసాధ్యము (2) / ప్రార్ధనలో పదునైనది – పనిచేయకపోవుట అసాధ్యము (2) ||ప్రభువా|| / ప్రార్ధనలో కనీళ్లు – కరిగిపోవుట అసాధ్యము / ప్రార్ధనలో మూల్గునది – మరుగైపోవుట అసాధ్యము (2) / ప్రార్ధనలో నలిగితే – నష్టపోవుట అసాధ్యము (2) / ప్రార్ధనలో పెనుగులాడితే – పడిపోవుట అసాధ్యము (2) ||ప్రభువా||
ప్రార్థించుము నీ జీవితములో / నెమ్మది సుఖము లొందెదవు (2) / సంపూర్ణ భక్తిని కలిగించును / క్షేమములెన్నో పొందెదవు (2) ||ప్రార్థించుము|| / యెడతెగక నీవు ప్రార్థించినా / విసుగక నీవు ప్రార్థించినా (2) / సమస్తమును నీవు పొందెదవు / తప్పక న్యాయము పొందెదవు (2) / నీ కొరకై ప్రభు వేచియున్నాడు / ప్రార్థనలో కనిపెట్టుము (2) ||ప్రార్థించుము|| / కష్టము నష్టము కలిగినను / శోధన బాధలు వచ్చినను (2) / సాతాను నీపై విజృంభించి / నిన్ను గాయపరచినను (2) / భయపడకుము ప్రభువే నీకు / జయము నిచ్చును (2) ||ప్రార్థించుము|| / ప్రభువే మనతో సెలవిచ్చెను / మెళకువగా నుండి ప్రార్థించుమని (2) / విశ్వాసము కోల్పోయే దినములలో / విశ్వాసముతో ప్రార్థించినా (2) / సాతాను దుర్గములను పడగొట్టి / బలము పొందెదవు (2) ||ప్రార్థించుము|| / ప్రభువచ్చు వేళాయే గమనించుము / ఆత్మ వలన ప్రతి విషయములో (2) / ప్రార్థన విజ్ఞాపన చేయుచు / పూర్ణమైన పట్టుదలతో (2) / పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు / మెళకువగా నుండుడి (2) ||ప్రార్థించుము|| / యెరూషలేము క్షేమముకై / అన్యజనుల రక్షణకై (2) / భారముతో నీవు ప్రార్థించిన / ప్రభువే నీకు ఫలమిచ్చును (2) / వారి క్షేమమే నీ క్షేమముకు / ఆధారమగును (2) ||ప్రార్థించుము||
దేవా నీ సన్నిధిలో నిలచి / దీనులమై మొరపెట్టుచున్నాము – (2) ||దేవా|| / అపరాధులగు నీదు ప్రజల / నెపములన్నియు బాపి (2) / కృపాళుండగు యేసు ప్రభువా / కృపను జూపి రక్షించుమయా (2) ||దేవా|| / చేసి యున్నాము నేరములెన్నో / చేసిన మేలులను మరచి (2) / మోసములలో బడియున్నాము / యేసుప్రభు జయమునిమ్ము (2) ||దేవా|| / లోకపు మర్యాదలకు లొంగి / లోకుల మాటలను వినియు (2) / నీ కట్టడలను మరచితిమి / కట్టుము మమ్ము నీ వాక్యముచే (2) ||దేవా|| / నిస్వార్థులగు నీ దాసులను / విశ్వాస ప్రమాణికులన్ (2) / శాశ్వతమైన ప్రేమతో నింపు / విశ్వాసులు స్థిరపడి నడువ (2) ||దేవా|| / సహవాసములో మమ్ము నిలిపి / సహనము మాకు నేర్పించి (2) / మహిమా పూర్ణుడ యేసు నిన్ను / ఈ మహిలో చాటించుటకు (2) ||దేవా||
ప్రభు మొర వినవా / ప్రభు మొర వినవా / నీ కొరకే నేను వెదకేను దేవా / నాకొకసారి కనిపించ రావా – (2) ||ప్రభు|| / నాదు ప్రాణము తల్లడిల్లాగా / భూదిగంతముల నుండియేగా (2) / మొఱ్ఱ పెట్టుచుంటి నీకేగా (2) ||నీ కొరకే|| / ఎక్కలేని ఎత్తైన కొండ / ఎక్కించుము నను పరిశుద్ధ కొండ (2) / చక్కని ప్రభు నీ మోము జూడ (2) ||నీ కొరకే|| / మిత్రుడా నా ఆశ్రయ నీవే / శత్రువుల యెడ నా కోట నీవే (2) / స్తుతికి కారణభూతుడా నీవే (2) ||నీ కొరకే||
మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా / విసుగక ప్రార్ధించే మనసు ఉన్నదా (2) / వెలిగే దీపానికి నూనె అవసరం / నీ ఆత్మా దీపానికి ప్రార్ధనవసరం (2) / నూనె లేని దీపము ఆరిపోవును / ప్రార్ధించలేని జీవితము పతనమవ్వును (2) ||మోకాళ్ళ|| / శోధనలో పడకుండా ప్రార్ధించుము / శోధన తప్పించుటకు ప్రార్ధించుము (2) / కన్నీటితో ప్రార్ధించిన హిజ్కియాను చూడుము (2) / మరణము తప్పించబడి ఆయుష్షు నొందెను (2) ||మోకాళ్ళ|| / ప్రతి నిమిషమందు మనము ప్రార్ధించగలిగినా / పరలోక సంతోషం దేవుడిచ్చును (2) / పట్టుదలతో ప్రార్ధించిన ఏలీయాను చూడుము (2) / ఆకాశ జలములను మూసివేసెను (2) ||మోకాళ్ళ|| / అడుగుడి మీకివ్వబడును తట్టుడి మీకు తీయబడును / అన్నాడు మన యేసు అడిగి చూడుము (2) / సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడు (2) / అడిగిన వారందరికి తప్పక దయచేయును (2) ||మోకాళ్ళ||
ప్రార్ధన కలిగిన జీవితం / పరిమళించును ప్రకాశించును / పై నుండి శక్తిని పొందుకొనును (2) / విడువక ప్రార్ధించిన శోధన జయింతుము / విసుగక ప్రార్ధించిన అద్భుతములు చూతుము (2) / ప్రార్ధనే మన ఆయుధం / ప్రార్ధనే మన ప్రాకారము (2) ||ప్రార్ధన|| / విడువక ప్రార్ధించిన శక్తిని పొందెదము / విసుగక ప్రార్ధించిన ఆత్మలో ఆనందింతుము (2) / ప్రార్ధనే మన ఆయుధం / ప్రార్ధనే మన ఆధారము (2) ||ప్రార్ధన|| / విడువక ప్రార్ధించిన దైవ చిత్తము గ్రహింతుము / విసుగక ప్రార్ధించిన దైవ దీవెనలు పొందుదుము (2) / ప్రార్ధనే మన ఆయుధం / ప్రార్ధనే మన ఆధారము (2) ||ప్రార్ధన||
నీ పాద సన్నిధికి / కృపామయా యేసయ్యా / నీ ప్రేమ కనుగొనుచు / దేవా నే వచ్చితిని (2) ||నీ పాద|| / విశ్రాంతి నిచ్చెడు దేవా / శ్రమలెల్ల తీర్చుమయ్యా (2) / సిలువయే నా ఆశ్రయము / హాయిగా నచ్చటుండెదను (2) ||నీ పాద|| / ప్రార్ధించుమంటివి ప్రభువా / సంకట సమయములో (2) / దయ చూపి నను కరుణించి / ప్రేమతో ఆదరించుమయ్యా (2) ||నీ పాద||
యెహోవా నను కరుణించుమా / నా దేవా నను దర్శించుమా (2) / ఉదయమునే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను / వేకువనే నీ కృప కొరకు కనిపెడుతున్నాను / దినమంతయు నేను ప్రార్ధించుచు ఉన్నాను ||యెహోవా|| / విచారము చేత నా కన్నులు గుంటలై / వేదన చేత నా మనస్సు మూగదై (2) / నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది / నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది (2) ||దినమంతయు|| / అవమానము చేత నా గుండెలో గాయమై / (నడి) వంచన చేత నా ఊపిరి భారమై (2) / నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది / నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది (2) ||దినమంతయు||
ఓ దేవా దయ చూపుమయ్యా / దేశాన్ని బాగుచేయుమయ్యా / నీ ప్రజల మొరను అలకించుమా / నీ కృపలో మమ్మును నడిపించుమా / మన్నించి బ్రతికించు – ఉజ్జీవం రగిలించు ||ఓ దేవా|| / సర్వలోక రక్షకా – కరుణించుమయ్యా / నీ వాక్య శక్తిని – కనుపరచుమయ్యా / అంధకార ప్రజలను – వెలిగించుమయ్యా / పునరుత్ధాన శక్తితో – విడిపించుమయ్యా / ఒకసారి చూడు – ఈ పాప లోకం / నీ రక్తంతో కడిగి – పరిశుద్ధపరచు / దేశాన్ని క్షమియించు – ప్రేమతో రక్షించు ||ఓ దేవా||
నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము / నే సమర్పింతును నీకు నా దేహము సజీవయాగముగా ప్రభు / యేసు నాలో నీవు ఉంటే – నీ సంపదలు నా సొంతమే / యేసు నీలో నేను ఉంటే – నా బ్రతుకంతా సంతోషమే ||నా దేహమును|| / నాలో నీ సన్నిధి ఉందని / గ్రహియించు జ్ఞానమును కలిగుంచుము / నా దేహమును భయముతో భక్తితో / నీ కొరకు పరిశుద్ధముగా దాచెద / ఈ లోకములో జనముల ఎదుట మాదిరిగా జీవింతును / నా దేహముతో నీ నామమును ఘనపరతును నిత్యము ||నా దేహమును|| / నీ జీవ ప్రవాహము ప్రవహించనీ / నాలోని అణువణువు చిగురించును / ఫలియించు ద్రాక్షావల్లి వలె నేను / విస్తారముగా దేవా ఫలియింతును / నా దీవెనగా నీవు ఉంటే నాకేమైనా కొదువుండునా / ఈ లోకముకు నన్ను నీవు దీవెనగా మార్చు ప్రభు ||నా దేహమును||