స్తుతి | Praise Telugu Songs

799 praise songs available. Lyrics in Roman and Telugu script.

అడవి చెట్ల నడుమ|Adavi Chetla Naduma

అడవి చెట్ల నడుమ / ఒక జల్దరు వృక్షం వలె / పరిశుద్ధుల సమాజములో / యేసు ప్రజ్వలించుచున్నాడు (2) / కీర్తింతున్ నా ప్రభుని / జీవ కాలమెల్ల ప్రభు యేసుని / కృతజ్ఞతతో స్తుతించెదను (2) / షారోను రోజా ఆయనే / లోయ పద్మమును ఆయనే / అతిపరిశుద్ధుడు ఆయనే / పదివేలలో అతిశ్రేష్టుడు (2) ||కీర్తింతున్|| / పరిమళ తైలం నీ నామం / దాని వాసన వ్యాపించెగా / నింద శ్రమ సంకటంలో / నను సుగంధముగా చేయున్ (2) ||కీర్తింతున్|| / మనోవేదన సహించలేక / సిలువ వైపు నే చూడగా / లేవనెత్తి నన్నెత్తుకొని / భయపడకుమని అంటివి (2) ||కీర్తింతున్|| / నా త్రోవకు దీపం నీవే / నా బ్రతుకుకు జీవం నీవే / నా సేవకు బలము నీవే / నా ఆత్మకాదరణ నీవే (2) ||కీర్తింతున్|| / ఘనమైన నా ప్రభువా / నీ రక్త ప్రభావమున / నా హృదయము కడిగితివి / నీకే నా స్తుతి ఘనత (2) ||కీర్తింతున్|| / నీవు నా దాసుడవనియు / ఏర్పరచుకొంటినని / నేనే నీ దేవుడనని / భయపడకు-మని అంటివి (2) ||కీర్తింతున్||

పదములు చాలని ప్రేమ|Padamulu Chaalani Prema

పదములు చాలని ప్రేమ ఇది / స్వరములు చాలని వర్ణనిది (2) / కరములు చాపి నిను కౌగలించి పెంచిన / కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ / వారిని సహితము కన్న ప్రేమ / ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ / ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ / కలువరి ప్రేమ ||పదములు|| / నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా / కన్నబిడ్డలే నిను వెలివేసినా (2) / తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు / నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ / ఆ వేదనంత తొలగించును ప్రేమ ||ప్రేమ|| / మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన / స్నేహితులే హృదయమును గాయపరచగా (2) / మేలులతో నింపి అద్భుతములు చేసి / క్షమియించుట నేర్పించెడి ప్రేమా / శాంతితో నిను నడిపించెడి ప్రేమ ||ప్రేమ||

యేసుని నా మదిలో|Yesuni Naa Madilo

యేసుని నా మదిలో స్వీకరించాను / ఆయన నామములో రక్షణ పొందాను (2) / నేను నేనే కాను… నాలో నా యేసే… (2) / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ||యేసుని|| / పాతవి గతియించెను / క్రొత్తవి మొదలాయెను (2) / నా పాప హృదయింలో రారాజు జన్మించె / నా పాపం తొలగి పోయెను – నా దుఃఖం కరిగి పోయెను (2) / యేసే నా జీవం… / ఆ ప్రభువే నా దైవం (2) ||హల్లెలూయ|| / నీ పాపం తొలగాలన్నా / నీ దుఃఖం కరగాలన్నా (2) / యేసుని నీ మదిలోకి స్వీకరించాలి / ఆయన నామములోనే రక్షణ పొందాలి (2) / యేసే మన జీవం… / ఆ ప్రభువే మన దైవం (2) ||హల్లెలూయ|| / నీవు నమ్మితే రక్షణ / నమ్మకున్నచో శిక్షయే (2) / ఎత్తబడే గుంపులో నీవు ఉంటావో / విడువబడే రొంపిలో నీవు ఉంటావో (2) / ఈ క్షణమే నీవు తేల్చుకో… / ఇదియే అనుకూల సమయము (2) ||హల్లెలూయ||

అడిగినది కొంతే అయినా|Adiginadi Konthe Ainaa

అడిగినది కొంతే అయినా / పొందినది ఎంతో దేవా / ప్రతిగా ఏమివ్వగలనయా / నిను స్తుతియించే హృదయము తప్ప / నా జీవితం నీకే అంకితమయ్యా – (4) ||అడిగినది|| / ఊహించలేని వివరింపజాలని / నీ కార్యములు ఆశ్చర్యమే / యోచించినా నా వర్ణనకందని / నీ కృపా కనికరములు అత్యున్నతమే / తరతరములకు మారని నీ ఉన్నత ప్రేమా / యుగయుగములకు నీకే ఘనతా మహిమా / సతతం నిను నే కొనియాడెదను / సకలం నీ నామముకే స్తోత్రము తగును ||అడిగినది|| / క్షణ భంగురం నా క్షయ జీవితం / కాచావయ్యా నను నీ రెక్కల నీడ / ఏ యోగ్యత లేని అల్పురాల నన్ను / హెచ్చించావయ్యా నీ ప్రేమ తోడ / నా ఆశ్రయ దుర్గము నీవే యేసయ్య / నా రక్షణ శృంగము నీవే మెస్సయ్య / నా స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా / ఈ స్తోత్ర కీర్తన నీకేనయ్యా ||అడిగినది|| / మహిమోన్నతుడా నను మరువని విభుడా / ప్రణుతించెదను నిన్నే నిరతం / నిష్కలంకుడా నిర్మలాత్ముడా / ప్రకటించెదను నీ పావన చరితం / నా అతిశయము నీవే నా యేసయ్యా / నా ఆధారము నీవే నా మెస్సయ్యా / నా ఆరాధన ఆలాపన నీకేనయ్యా / ఈ దీన సేవను చేకొనుమయ్యా ||అడిగినది||

నన్నెంతగానో ప్రేమించిన|Nannenthagaano Preminchina

నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా / నా దీన బ్రతుకునే దీవించిన దేవా (2) / నిన్నే ఆరాధింతును – నీలో ఆనందింతును (2) / నా యవ్వనమంతా… నా జీవితమంతా (2) ||నన్నెంతగానో|| / ధరలోని మన్నుతో సమమైన నన్ను / ఎన్నుకొని ఉన్నత స్థితికి చేర్చినావు (2) / అన్నీ నీవే నాకై సమకూర్చినావు / ఉన్నాను నీ తోడు భయపడకన్నావు (2) / వాక్యపు మన్నాతో పోషించిన నన్నే / ఎన్నడూ విడువని ఎడబాయని నిన్నే ||నిన్నే|| / దినమెల్ల నా కొరకే కనిపెట్టినావు / ఎల్లవేళలా నా తోడుగ నిలిచావు (2) / మెల్లని నీ స్వరముతో మాట్లాడినావు / చల్లని కరములతో నా కన్నీరు తుడిచావు (2) / పాపపు ముళ్ళును తొలగించుటకై నాలో / మరణపు విల్లును విరచిన దేవా నీలో ||నీలో||

నువ్వంటే ఇష్టము నా యేసయ్యా|Nuvvante Ishtamu Naa Yesayya

నీకు ఇష్టముగా ఇలలో నే ఉండాలని / ఎంత కష్టమైనా నీలోనే ఉండాలని / ఆశతో ఉన్నాను నా యేసయ్యా / ఆశలు తీర్చే నా మెస్సయ్యా (2) / నువ్వంటే ఇష్టము నా యేసయ్యా / నాతో నువ్వుంటే ఇష్టము నా మెస్సయ్యా (2) / నీ వెంటే నేను నడవాలని / నీ ఇంటిలోనికి రావాలని (2) / నీ వాక్యపు రుచి నాకు చూపావయ్యా / నీ వాత్సల్యతతో నను నింపావయ్యా (2) / అందుకేనయ్యా నువ్వంటే నాకిష్టం / అందుకోవయ్యా నాలోని నీ ఇష్టం (2) ||నువ్వంటే|| / ఎన్నో శోధనలు ఎన్నెన్నో శ్రమలతో / ఈ లోకంలో నే పడియుండగా (2) / నీ కృపచేత నను నీవు నిలిపావయ్యా / నీ కరుణతో నను నీవు నడిపావయ్యా (2) / అందుకేనయ్యా నువ్వంటే నాకిష్టం / అందుకోవయ్యా నాలోని నీ ఇష్టం (2) ||నువ్వంటే||

Praise Telugu Songs — Page 60 | UEC Telugu Church