799 praise songs available. Lyrics in Roman and Telugu script.
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త / నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2) / తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో / తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2) ||ఆశ్చర్యకరుడు|| / తన చేతిలో రోగాలు లయమైపోయెను / తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2) / తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2) / నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2) ||ఆశ్చర్యకరుడు|| / మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు / మనకోసం సజీవుడై లేచినవాడతడు (2) / తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2) / తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2) ||ఆశ్చర్యకరుడు||
మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని / దీవించిన దేవా నీకు వందనం (2) / వందనం వందనం… / వందనం నీకే మా వందనం (2) దేవా ||మూడు దశాబ్దాల|| / పాపులమైన మమ్మును / వెదకి రక్షించినందుకు / ఏమియు లేని మాకు / అన్నిటిని నొసగినందుకు (2) ||వందనం|| / బలవంతులుగా చేసి / మూడు బాణాలను ఇచ్చినందుకు / మా భోజనపు బల్ల చుట్టు / ఒలీవ మొక్కల వలె పెంచినందుకు (2) ||వందనం|| / మా కష్టాలలో, దుఃఖాలలో / మమ్ము కాచిన దేవా / మా వ్యాధులను, బాధలను / తీర్చిన దేవా (2) ||వందనం||
ఆహా యేమానందం ఆహా యేమానందము / చెప్ప శక్యమా (2) / ఆహా మా రాజగు యేసు మా వృజినముల / మన్నించి వేసెను (2) ||ఆహా|| / ముదముతో నాడుచు కూడుచు పాడుచు / ఆర్భాటించెదము (2) / వెదకుచు వచ్చిన యేసును హృదయాన / కోరి స్తుతింతుము (2) ||ఆహా|| / అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను / గ్రహించినందున (2) / రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము / నిశ్చయముగా నిత్తుము (2) ||ఆహా|| / తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము / మేడపై జయ జెండాల్ (2) / ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన / రాజున్ స్తుతింతుము (2) ||ఆహా||
నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు (2) / అన్నియు నీకై వీడి – నిన్నే వెంబడించితిని (2) / పెన్నుగ నాలో నాటుమా (2) ప్రేమన్ ||నా నాథుడా|| / దేవాలయ విగ్రహముల్ – దేవతలు వేయిలక్షల్ (2) / యావత్తు పెంటయనుచు (2) నిదిగో ||నా నాథుడా|| / ఆదియంత రహితుడ – ఆత్మల నాయకుడా (2) / ఆశ కల్గించు నాలోన (2) నీవే ||నా నాథుడా|| / పరిశుద్ధ యవతరుడా – మరియు తేనె అమృతుడా (2) / కరుణతో నన్ను గావుమా (2) యిప్పుడు ||నా నాథుడా|| / భూతలమునకు వేంచేసి – పాతకుల ప్రేమించితివి (2) / పాతకుడ నేనైతిని (2) మహా ||నా నాథుడా|| / ఆద్యంతము లేనట్టి – బీదలకు ధన నిధీ (2) / సదయుడా నన్ను చూడుమా (2) యిపుడు ||నా నాథుడా|| / హల్లెలూయ గీతమును – ఎల్లెడల చాటించెదను (2) / ఉల్లమందానంద ధ్వని (2) యిదియే ||నా నాథుడా||
అనుదినము ప్రభుని స్తుతియించెదము / అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను / అల్లుకుపోయేది ఆర్పజాలనిది / అలుపెరగనిది ప్రభు ప్రేమ (2) ||అనుదినము|| / ప్రతి పాపమును పరిహరించి / శాశ్వత ప్రేమతో క్షమియించునది / నా అడుగులను సుస్థిరపరచి / ఉన్నత స్థలమున నింపునది (2) ||అల్లుకుపోయేది|| / ప్రతి రేపటిలో తోడై నిలిచి / సిలువ నీడలో బ్రతికించినది / స్వర్గ ద్వారము చేరు వరకు / మాకు ఆశ్రయమిచ్చునది (2) ||అల్లుకుపోయేది||
యేసు మాతో నీవుండగా / మేము అలసిపోలేమయ్యా (2) / అంతా నీవే చూసుకుంటావు (4) ||యేసు మాతో|| / సమాధానకారకుడు నీవేనయ్యా / సర్వశక్తుడవు నీవేనయ్యా (2) ||యేసు మాతో|| / అద్భుత దేవుడవు నీవేనయ్యా / ఆలోచన కర్తవు నీవేనయ్యా (2) ||యేసు మాతో|| / నా యొక్క సౌందర్యం నీవేనయ్యా / నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2) ||యేసు మాతో||
యేసు రక్తములో నాకు జయమే జయము / ప్రభు యేసు రక్తములో నిత్యం విజయం (2) / జయం జయం జయం జయం – నా యేసునిలో / జయం జయం జయం జయం – ప్రభుయేసు రక్తములో (2) ||యేసు రక్తములో|| / పాపాలను క్షమియించి – శాపాలను భరియించి / విడుదలను కలిగించే యేసు రక్తము / మరణాన్ని తొలగించి – నరకాన్ని తప్పించి / పరలోకానికి చేర్చే యేసు రక్తము (2) / అమూల్యమైనది పవిత్రమైనది / ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2) ||జయం జయం|| / శోధనలలో జయమిచ్చి – బాధలో నెమ్మదినిచ్చి / ఆదరణను కలిగించే యేసు రక్తము / రోగాలను లయపరచి – వ్యాధులను దూరం చేసి / స్వస్థత నాకు చేకూర్చే యేసు రక్తము (2) / అమూల్యమైనది పవిత్రమైనది / ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2) ||జయం జయం||
ప్రాణమా నా ప్రాణమా / ప్రియ యెహోవాను సన్నుతించుమా / ప్రియ యెహోవా చేసిన మేలులను / నీవు ఎన్నడు మరువకుమా ||ప్రాణమా|| / గత కాలములన్నిటిలో / కృపతోనే నడిపించెను (2) / కరుణ కటాక్షమనే (2) / కిరీటం నీకు దయచేసెను (2) ||ప్రాణమా|| / నిను విడువక ఎడబాయక / నిత్యం నీకు తోడైయుండెను (2) / నీవు నడిచిన మార్గములో (2) / నీకు దీపమై నిలచెనుగా (2) ||ప్రాణమా|| / పాప శాపము వ్యాధులను / పారద్రోలియే దీవించెను (2) / పరిశుద్ధుడు పరమ తండ్రి (2) / బలపరిచెను తన కృపతో (2) ||ప్రాణమా|| / మహా ఆనంద మానందమే / మహారాజా నీ సన్నిధిలో (2) / మహిమగల మహారాజా (2) / మనసారా స్తుతించెదను (2) ||ప్రాణమా||
ఇహమందున ఆ పరమందు నాకు / గృహమొసగిన నా దైవమా / మితిలేని ప్రేమతో గతిలేని నాకు / స్థితినొసగిన నా స్నేహమా (2) / యేసయ్యా నీవే నా ఆద్యంతం / యేసయ్యా నీలోనే నా ఆత్మీయం / యేసయ్యా నీకై నా ఆరాటం / యేసయ్యా నీతోనే నా ఆనందం / నీవే నా ఆశీర్వాదం / నీతోనే నా అనుబంధం (2) ||ఇహమందున|| / నేనునూ నా ఇంటి వారును / యెహోవాను సేవించెదం (2) / అని యెహోషువా నిను కొనియాడినంతగా / కీర్తించనా నిను స్తుతియించనా / నీ మేలులను నే చాటించనా (2) / యేసయ్యా నీవే నా సమీపం / యేసయ్యా నీలోనే నే సంపూర్ణం / యేసయ్యా నీకై నా సామర్ధ్యం / యేసయ్యా నీతోనే నా సంతోషం / నీవే నా సర్వస్వం / నీతోనే నా సహవాసం (2) ||ఇహమందున|| / నీ ఇంటి లోనికి నను చేర్చడానికి / ఈ భువికేగి సిలువలో బలి అయితివా (2) / మరిలేచి మహిమతో ఏతెంచితివే / మధ్యాకాశమున నిను వీక్షించుటే / నీ కొరకు నాకున్న నిరీక్షణ (2) / యేసయ్యా నీవే నా ప్రస్థానం / యేసయ్యా నీలోనే నే ప్రత్యేకం / యేసయ్యా నీకై నా ప్రావీణ్యం / యేసయ్యా నీతోనే నా ప్రయాణం / నీవే నా ప్రపంచం / నీతోనే నా ప్రతి నిమిషం (2) ||ఇహమందున||
నీ వాక్యమే నా పాదాలకు దీపము / నీ చిత్తమే నా జీవిత గమనము (2) / కృప వెంబడి కృపతో – నను ప్రేమించిన దేవా (2) / వందనాలయ్యా నీకే – వేలకొలది వందనాలయ్యా / స్తోత్రాలయ్యా – కోట్లకొలది స్తోత్రాలయ్యా ||నీ వాక్యమే|| / నీ భారము నాపై వేయుము / ఈ కార్యము నే జరిగింతును (2) / నా కృప నీకు చాలును / అని వాగ్దానమిచ్చావయ్యా (2) ||వందనాలయ్యా|| / పర్వతములు తొలగిననూ / మెట్టలు తత్తరిల్లిననూ (2) / నా కృప నిన్ను వీడదు / అని అభయాన్ని ఇచ్చావయ్యా (2) ||వందనాలయ్యా||
కళ్లుండి చూడలేని ఎందరో ఉన్నారు / చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు (2) / వారి కనులు తెరిపించాలి నీ మహిమతోనే / జీవింప చేయాలి నీ మహిమలోనే ||కళ్లుండి|| / కంటి చూపుతో నన్ను కాచియున్నావు / గుండె పైన వాత పెట్టి నను మార్చినావు (2) / మరణాన్ని తప్పించావు / జీవాన్ని నాకిచ్చావు (2) / ఇంకేల నా యేసయ్యా ||కళ్లుండి|| / నీదు ఆత్మతో నన్ను నింపియున్నావు / నీదు సాక్షిగా నన్ను ఇల నిలిపియుంచావు (2) / నీవే నా గమ్యమని / నీలోనే నడిచెదను (2) / నాకేగా పరలోకము ||కళ్లుండి||
ఏ సమయమందైనా ఏ స్థలమందైనా / ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్ (2) / ఆరాధనా ఆరాధనా / నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా / ఆరాధనా ఆరాధనా / గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా ||ఏ సమయమందైనా|| / చెరసాలలో నేను బంధీగా ఉన్నా / సింహాల బోనులో పడవేసినా / కరువు ఖడ్గము హింస ఏదైననూ / మరణ శాసనమే పొంచున్ననూ / యేసు నామమే ఆధారము కాదా / యేసు రక్తమే నా విజయము / పగలు ఎండలలో రాత్రి వెన్నెలలో / కునుకక కాపాడు యేసు దేవునికే ||ఆరాధనా|| / నా జీవనాధారం శ్రీ యేసుడే / నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే / తన చేతులతో నన్ను నిర్మించెగా / నా సృష్టికర్తను కొనియాడెదన్ / యెహోవ రాఫా నను స్వస్థ పరిచెను / యెహోవ షమ్మా నాకు తోడుగా / యెహోవ నిస్సీ నా ధ్వజముగా / అల్ఫా ఒమేగా ఆది దేవునికే ||ఆరాధనా||