స్తుతి | Praise Telugu Songs

799 praise songs available. Lyrics in Roman and Telugu script.

జుంటె తేనె కన్నా|Junte Thene Kannaa

జుంటె తేనె కన్నా తీయనిది / వెండి పసిడి కన్నా మిన్న అది / పొంగి పొర్లుచున్న ప్రేమ నీది / యేసు నీ నామము / సూర్య కాంతి కన్నా ప్రకాశమైనది / పండు వెన్నెల కన్నా నిర్మలమైనది / మంచు కొండల కన్నా చల్లనిది / యేసు నీ నామము / యేసూ అసాధ్యుడవు నీవు / మరణాన్నే జయించిన వీరుడవు / సర్వాన్ని శాసించే యోధుడవు / నీకు సాటి లేరెవరు / రక్షకా నీవేగా మా బలము / దేవా మా దాగు స్థలము నీవే / నీవే నిజమైన దేవుడవు / ప్రణమిల్లి మ్రొక్కెదము ||జుంటె|| / ఆకాశము కన్నా విశాలమైనది / విశ్వమంతటిలో వ్యాపించియున్నది / ఊహలకందని ఉన్నతమైనది / యేసు నీ నామము / లోకమంతటికి రక్షణ మార్గము / జనులందరిని బ్రతికించు జీవము / సర్వ కాలములో నివసించు సత్యము / యేసు నీ నామము ||జుంటె||

బెత్లహేములోనంటా సందడి|Bethlahemulonantaa Sandadi

బెత్లహేములోనంటా – సందడి / పశువుల పాకలో – సందడి / దూతలు వచ్చెనంటా – సందడి / పాటలు పాడేనంటా – సందడి (2) / రారాజు పుట్టెనని – సందడి / మా రాజు పుట్టెనని – సందడి (2) / చేసారంట సందడే సందడి / చేయబోదాము సందడే సందడి (2) / హ్యాప్పీ హ్యాప్పీ.. / హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ / విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ / మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ / విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ / అర్ధ రాత్రి వేళలో – సందడి / దూతలు వచ్చెనంటా – సందడి / రక్షకుడు పుట్టెనని – సందడి / వార్తను తెలిపేనటా – సందడి (2) / చేసారంట సందడే సందడి / చెయ్యబోదాము సందడే సందడి / చేసారంట సందడే సందడి / చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే / హ్యాప్పీ హ్యాప్పీ.. / హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ / విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ / మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ / విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ / గొల్లలు వచ్చిరంటా – సందడి / మనసారా మ్రొక్కిరంటా – సందడి / అందాల బాలుడంటా – సందడి / అందరి దేవుడని – సందడి (2) / రారాజు పుట్టెనని – సందడి / మా రాజు పుట్టెనని – సందడి (2) / చేసారంట సందడే సందడి / చేయబోదాము సందడే సందడి (2) / హ్యాప్పీ హ్యాప్పీ.. / హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ / విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ / మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ / విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ / తారను చూచుకుంటూ – సందడి / జ్ఞానులు వచ్చారంటా – సందడి / పెట్టెలు తెచ్చారంటా – సందడి / కానుకలిచ్చారంటా – సందడి (2) / రారాజు పుట్టెనని – సందడి / మా రాజు పుట్టెనని – సందడి (2) / చేసారంట సందడే సందడి / చేయబోదాము సందడే సందడి (2) / హ్యాప్పీ హ్యాప్పీ.. / హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ / విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ / మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ / విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ (2)

ఆనందింతు నీలో దేవా|Aanandinthu Neelo Devaa

ఆనందింతు నీలో దేవా / అనుదినం నిను స్తుతించుచు (2) / మధురమైన నీ నామమునే (2) / మరువక ధ్యానించెద ప్రభువా ||ఆనందింతు|| / ఆత్మ నాథా అదృశ్య దేవా / అఖిల చరాలకు ఆధారుండా (2) / అనయము నిను మది కొనియాడుచునే / ఆనందింతు ఆశ తీర (2) ||ఆనందింతు|| / నాదు జనములు నను విడచినను / నన్ను నీవు విడువకుండా (2) / నీ కను దృష్టి నాపై నుంచి / నాకు రక్షణ శృంగమైన (2) ||ఆనందింతు|| / శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు / మేఘమందు రానైయున్న (2) / ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు / అంతం వరకును భద్రపరచుము (2) ||ఆనందింతు|| / శ్రమలు నన్ను చుట్టిన వేళ / చింతలో కృశించిన వేళ (2) / అభయముగా నీ దర్శనమిచ్చి / శ్రమలు బాపి శాంతినిచ్చితివి (2) ||ఆనందింతు||

నా హృదయములో నీ మాటలే|Naa Hrudayamulo Nee Maatale

నా హృదయములో నీ మాటలే / నా కనులకు కాంతి రేఖలు (2) / కారు చీకటిలో కలువరి కిరణమై / కఠిన హృదయమును కరిగించిన / నీ కార్యములను వివరింప తరమా / నీ ఘన కార్యములు వర్ణింప తరమా (2) ||నా హృదయములో|| / మనస్సులో నెమ్మదిని కలిగించుటకు / మంచు వలె కృపను కురిపించితివి (2) / విచారములు కొట్టి వేసి / విజయానందముతో నింపినావు / నీరు పారేటి తోటగా చేసి / సత్తువ గల భూమిగా మార్చినావు ||నీ కార్యములను|| / విరజిమ్మే ఉదయ కాంతిలో / నిరీక్షణ ధైర్యమును కలిగించి (2) / అగ్ని శోధనలు జయించుటకు / మహిమాత్మతో నింపినావు / ఆర్పజాలని జ్వాలగా చేసి / దీప స్తంభముగా నను నిలిపినావు ||నీ కార్యములను|| / పవిత్రురాలైన కన్యకగా / పరిశుద్ధ జీవితము చేయుటకు (2) / పావన రక్తముతో కడిగి / పరమానందముతో నింపినావు / సిద్ధపడుచున్న వధువుగా చేసి / సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు ||నీ కార్యములను||

నీవే నా ప్రాణం సర్వం|Neeve naa praanam sarvam

నీవే నా ప్రాణం సర్వం / నీవే నా ధ్యానం గానం / యేసయ్యా నీవే ఆధారం (2) / నీవేగా నా ప్రాణం – యేసయ్యా నీవే జీవితం / యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా.. / హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2) ||నీవే|| / నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినది / నీ రాకకే కదా నేనెదురు చూచునది (2) / నీవలె ఉందును నీలో వసించెదను (2) / అండా దండా కొండా నీవయ్యా / నాకున్న లోకం అంతా నీవయ్యా / అండా దండా కొండా నీవయ్యా / నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా ||నీవేగా|| / నా కాపరి నీవే నా ఊపిరి నీవే / నా దారివి నీవే నా మాదిరి నీవే (2) / నీవలె ఉందును నీ వెంట సాగెదను (2) / అండా దండా కొండా నీవయ్యా / నాకున్న లోకం అంతా నీవయ్యా / అండా దండా కొండా నీవయ్యా / నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా ||నీవేగా||

Praise Telugu Songs — Page 43 | UEC Telugu Church