స్తుతి | Praise Telugu Songs

799 praise songs available. Lyrics in Roman and Telugu script.

ఎలోహిం ఎలోహిం|Elohim Elohim

హోలీ హోలీ హోలీ / హి ఈస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ / హూ వాస్ అండ్ ఈస్ అండ్ ఈస్ టు కం (2) / ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహిం / బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు – (2) / శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారము / సృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం / అల్ఫా ఒమేగవు – నిత్యుడైన దేవుడవు – (2) / నిత్య నిబంధన చేసావు – నిబంధనని స్థిరపరచావు / నిన్నా నేడు రేపు – మారని దేవుడవు నీవు – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ / పోషించు దేవుడవు – ఆశ్రయ దుర్గము నీవు – (2) / రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా / నీ మాటున దాచే దేవా – మాటను నెరవేర్చే దేవా – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / అడోనై అడోనై అడోనై అడోనై / ప్రభువైన దేవుడవు – ప్రభువులకు ప్రభువు నీవు – (2) / సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు / నీవే నాకు ప్రభువు – నీవే నా యజమానుడవు – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / యావే యావే యావే యావే / యెహోవా దేవా – సైన్యములకు అధిపతివి – (2) / పరిశుద్ధ దేవుడవు నీవు – ఉన్నవాడనని అన్నావు / ప్రభు యేసును పంపిన దేవా – పాపము తొలగించిన దేవా – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

మంచే లేని నా పైన|Manche Leni Naa Paina

మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు (2) / ఆదియంత మైనవాడవు – మానవుని రూపమెత్తావు (2) / పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి (2) / ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా / యేసు నీ ఋణము తీరునా (2) ||మంచే లేని|| / లోకాలన్నీ ఏలే రారాజు వైన నీవు / సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు (2) / నీదెంత దీన మనస్సు / నా కెంత ఘనత యేసు (2) ||ఎంతగా|| / నాశనమైన నన్ను రక్షించగోరి నీవు / వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు (2) / నీలోన జాలి పొంగె / నాలోన శాంతి నిండె (2) ||ఎంతగా|| / చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు / వేకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావు (2) / నీ సాటిలేని త్యాగం / నా పాలి గొప్ప భాగ్యం (2) ||ఎంతగా||

నా దేవుని గుడారములో|Naa Devuni Gudaaramulo

నా దేవుని గుడారములో – నా యేసుని నివాసములో (2) / ఎంతో సంతోషం – ఎంతో ఆనందం (2) / నా యేసుని నివాసములో (2) ||నా దేవుని|| / సీయోను మార్గములందు – సహాయకుడవు నీవే కదా / రాత్రి జాముల యందు- నా తోడు నీడవు నీవే కదా (2) / నా కొండ నీవేగా – నా కోట నీవేగా (2) / నా యేసు రక్షకా నీవే కదా (2) ||నా దేవుని|| / నా యేసు సన్నిధి యందు – నేను పరవశమొందెదను / నా యేసు స్వరమును వినుచు – నేను కాలము మరచెదను (2) / నా గానమాయెనే – నా ధ్యానమాయెనే (2) / నాదు స్వరము నా ప్రభువే (2) ||నా దేవుని|| / ఆనంద తైలము నందు – నన్ను అభిషేకించెనుగా / నాదు వస్త్రము నందు – అగరు వాసన నింపెనుగా (2) / నా ప్రాణ నాథుడా – నా ప్రేమ పాత్రుడా (2) / నా యేసు నాథుడా నీవే కదా (2) ||నా దేవుని||

ఆరాధన అందుకో|Aaraadhana Anduko

ఆరాధన అందుకో (2) / పాప క్షమాపణ జీవమునిచ్చిన / కరుణామయా.. అందుకో / ఆరాధన అందుకో / అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా / మోషేతో అన్నావు ఉన్నానని (2) / అల్ఫయు నీవే ఓమెగయును (2) / ఆద్యంత రహితుండ నీవేనని / ఘనతా మహిమా నీకేయని / హల్లెలూయా గానము చేసెదను / పాప క్షమాపణ జీవమునిచ్చిన / కరుణామయా.. అందుకో / ఆరాధన అందుకో / పాపంబున జన్మించి నశియించితిని / లోకంబు నాదనుచు ఆశించితిని (2) / అయినా నీవు రక్షణ నివ్వ (2) / వెలిగించి పంపితివి యేసు ప్రభును / ఘనతా మహిమా నీకేయని / హల్లెలూయా గానము చేసెదను / పాప క్షమాపణ జీవమునిచ్చిన / కరుణామయా.. అందుకో / ఆరాధన అందుకో / తెలిసికొంటిని నా యేసు నిన్ను / సర్వ శక్తి గల ప్రభువనియు (2) / రానున్నావు మరలా నాకై (2) / ఆనంద దేశములో నన్నుంచుటకై / ఘనతా మహిమా నీకేయని / హల్లెలూయా గానము చేసెదను / పాప క్షమాపణ జీవమునిచ్చిన / కరుణామయా.. అందుకో ||ఆరాధన||