799 praise songs available. Lyrics in Roman and Telugu script.
విజయ గీతము మనసార నేను పాడెద / నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2) / పునరుత్తానుడ నీవే / నా ఆలాపన నీకే నా ఆరాధన (2) / ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే / పుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2) / యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది / నీ ఉత్తమమైన సంఘములో (2) ||విజయ|| / ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి / నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2) / యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము / నీ పరిశుద్ధులలో చూపినది (2) ||విజయ|| / నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు / ఈ నిరక్షణయే రగులుచున్నది నాలో (2) / యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించె / నీ ప్రసన్న వదనమును ఆరాధించ (2) ||విజయ||
మార్గం సత్యం జీవం నీవే యేసు / సర్వం సకలం నీవే క్రీస్తు (2) / మా ఆధారం నీవేనయ్యా / మా అనుబంధం నీతోనేనయ్యా (2) / వధియింపబడిన ఓ గొర్రెపిల్ల / ప్రభువైన మా యేసువా / మా స్తుతి స్తోత్రముల్ నీకే / మహిమా ప్రభావముల్ నీకే (2) ||మార్గం|| / పరమును విడిచావు మాకై / నరునిగా పుట్టావు ధరపై (2) / ఆహా నీదెంత ప్రేమ / ఎవరికైనా వర్ణింప తరమా (2) ||వధియింప|| / కలువరిలో రక్తమును కార్చి / విలువగు ప్రాణమును ఇచ్చి (2) / తెచ్చావు భువికి రక్షణ / ఇచ్చావు పాప క్షమాపణ (2) ||వధియింప||
ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో / అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను (2) / కన్నీళ్లతో పాదాలు కడిగింది / తన కురులతో పాదాలు తుడిచింది (2) / సువాసన సువాసన ఇల్లంత సువాసనా / ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2) / జుంటి తేనె ధారల కన్నా మధురమైనది వాక్యం / ఆ వాక్యమే నన్ను బ్రతికించెను (2) / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన / ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2) ||ఆ భోజన|| / సింహాల నోళ్లను మూసినది ఈ వాక్యం / దానియేలుకు ఆపై విడుదలిచ్చె ఈ వాక్యం (2) / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన / ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2) ||ఆ భోజన||
నీతో స్నేహం నే మరువగలనా / నిన్ను విడచి నేను ఉండగలనా / నీతో స్నేహం నే మరువగలనా / నా స్నేహితుడా… నా యేసయ్యా (2) / విడువక నను ఎడబాయని నేస్తమా ||నీతో|| / నా నీడగా నీవుండగా – భయమేమీ లేదుగా / శోధనకైనా బాధలకైనా భయపడిపోనుగా / శత్రువు నన్ను వేధించినా – నా ధైర్యం నీవేగా / లోకం నన్ను దూషించినా – నన్ను విడువవుగా / కన్నీరు తుడిచే నా నేస్తం నీవేగా / ఓదార్చి నడిపించే స్నేహితుడవు నీవేగా ||నా స్నేహితుడా|| / నా తోడుగా నీవుండగా – కొదువేమి లేదుగా / కష్టములైనా నష్టములైనా – తడబడిపోనుగా / అపాయమేమి రాకుండగా – కాచేవాడవు నీవేగా / ఎన్నటికైనా మారని నీదు – స్నేహమే మధురముగా / ప్రేమను పంచిన నా నేస్తం నీవేగా / ప్రాణాన్నే ఇచ్చిన స్నేహితుడవు నీవేగా ||నా స్నేహితుడా||
ఈ లోకంలో జీవించెదను / నీ కొరకే దేవా – (2) / నా ప్రియ యేసూ- నాకు లేరు ఎవ్వరు / నీలా ప్రేమించే వారు / నీవే నా ప్రాణ ప్రియుడవు – (2) ||ఈ లోకంలో|| / (నా) తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా / విడువనని నాకు వాగ్దానమిచ్ఛావు (2) / ఎంత లోతైనది నీ ప్రేమా / నిన్ను విడచి నే బ్రతుకలేను (2) ||ఈ లోకంలో|| / (నీ) అరచేతిలోనే నన్ను చెక్కు కుంటివే / నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే (2) / నీ దృష్టిలో నేనున్నాగా / ఇలలో నే జడియను (2) ||ఈ లోకంలో||
యూదా స్తుతి గోత్రపు సింహమా / యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2) / నీవే కదా నా ఆరాధన / ఆరాధన స్తుతి ఆరాధన / ఆరాధన స్తుతి ఆరాధన (2) / నీ ప్రజల నెమ్మదికై / రాజాజ్ఞ మార్చింది నీవేనని / అహమును అణచి అధికారులను / అధముల చేసిన నీకు (2) / అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| / నీ నీతి కిరణాలకై / నా దిక్కు దెశలన్ని నీవేనని / ఆనతికాలాన ప్రధమ ఫలముగా / భద్రపరచిన నీకు (2) / అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| / నీ వారసత్వముకై / నా జయము కోరింది నీవేనని / అత్యున్నతమైన సింహాసనమును / నాకిచ్చుఁటలో నీకు (2) / అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||
నీతో గడిపే ప్రతి క్షణము / ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2) / కృప తలంచగా మేళ్లు యోచించగా (2) / నా గళమాగదు స్తుతించక – నిను కీర్తించక / యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4) ||నీతో|| / మారా వంటి నా జీవితాన్ని / మధురముగా మార్చి ఘనపరచినావు (2) / నా ప్రేమ చేత కాదు / నీవే నను ప్రేమించి (2) / రక్తాన్ని చిందించి / నన్ను రక్షించావు (2) ||యేసయ్యా|| / గమ్యమే లేని ఓ బాటసారిని / నీతో ఉన్నాను భయము లేదన్నావు (2) / నా శక్తి చేత కాదు / నీ ఆత్మ ద్వారానే (2) / వాగ్ధానము నెరవేర్చి / వారసుని చేసావు (2) ||యేసయ్యా||
ఆశ్రయుడా నా అభిషిక్తుడా / నీ అభీష్టము చేత నను నడుపుచుండిన / అద్భుత నా నాయకా / యేసయ్య అద్భుత నా నాయకా / స్తోత్రములు నీకే స్తోత్రములు (2) / తేజోమయుడయిన ఆరాధ్యుడా (2) / నీ ఆలోచనలు అతి గంభీరములు / అవి ఎన్నటికీ క్షేమకరములే / మనోహరములే కృపాయుతమే (2) / శాంతి జలములే సీయోను త్రోవలు (2) / నీతి మార్గములో నన్ను నడుపుచుండగా / సూర్యుని వలె నే తేజరిల్లెదను / నీ రాజ్య మర్మములు ఎరిగిన వాడనై (2) / జీవించెదను నీ సముఖములో (2) / సువార్తకు నన్ను సాక్షిగా నిలిపితివి / ఆత్మల రక్షణ నా గురి చేసితివి / పరిశుద్ధతలో నే నడిచెదను (2) / భళా మంచి దాసుడనై నీ సేవలో (2)
నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము / నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము (2) / యేసయ్యా… కనిపించరే / నీలాగా ప్రేమించే వారెవరు (2) ||నీ దీర్ఘ|| / కడుపేద స్థితిలోనే కరువే నా బంధువాయెను / వయసొచ్చిన తరుణములో వస్త్ర హీనతే కృంగదీసెను (2) / (ఏ) ఆధారము కనిపించని నా బ్రతుకులో / ఐశ్వర్యవంతుడ నన్నాదుకున్నావు (2) / యేసయ్యా… కనిపించరే / నీలాగా దీవించే వారెవరు (2) ||నీ దీర్ఘ|| / ఈ లోక జ్ఞానులలో వెర్రివానిగా ఉంటిని / ఎన్నికైన వారిలో వ్యర్థునిగా మిగిలి ఉంటిని (2) / తృణీకరింపబడిన నా బ్రతుకును / కరుణా సంపన్నుడా నన్నెన్నుకున్నావు (2) / యేసయ్యా… కనిపించరే / నీలాగా కృప చూపే వారెవరు (2) ||నీ దీర్ఘ|| / నా ప్రాణము నాలో కృంగివున్న సమయములో / జీవము గల నీకై నా ప్రాణము పరితపించెను (2) / మధురమైన నీ సహవాసముతో / నా జీవ నాథుడా నీ మమతను పంచావు (2) / యేసయ్యా… కనిపించరే / నీలాంటి జీవము గల దేవుడెవ్వరు (2) ||నీ దీర్ఘ||
జయమిచ్చిన దేవునికి కోట్లకొలది స్తోత్రం / జీవింప చేసిన రాజా నిన్నే / జీవితమంతా స్తుతింతున్ (2) / హల్లెలూయా హల్లెలూయా పాడెదన్ / ఆనంద ధ్వనితో ఆర్భాటింతును (2) / నీదు హస్తముతో ఆదుకో నన్నిలలో (2) / నీవే నా బలం… దేనికి జడియను (2) ||జయమిచ్చిన|| / నీతి సూర్యుడు ప్రేమా పూర్ణుడు (2) / కరుణా మూర్తివి… యేసు నా రక్షకా (2) ||జయమిచ్చిన|| / అద్భుతకరుడవు సృష్టికర్తవు (2) / యుద్ధ శూరుడా… విజయ శీలుడా (2) ||జయమిచ్చిన|| / సత్య దేవుడు కరుణా శీలుడు (2) / నన్ను కాచును… కునుకడు ఎన్నడూ (2) ||జయమిచ్చిన|| / యేసే నా రక్షణ నాదు ఆశ్రయం (2) / నా నిరీక్షణ… యేసు నాయకుడే (2) ||జయమిచ్చిన||
యెహెూవాయే నా బలము / యెహెూవాయే నా శైలము (2) / యెహెూవాయే నా కోటయు / యెహెూవాయే నా కేడెము / యెహెూవాయే నా శృంగము / యెహెూవాయే నా దుర్గము (2) ||యెహెూవాయే|| / నా దీపము ఆరనీయక నన్ను వెలిగించెను / నా అడుగులు తడబడకుండా నన్ను నడిపించెను (2) / నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను / నా పక్షమున తానేయుండి నన్ను గెలిపించెను (2) ||యెహెూవాయే|| / నాకు బలము అనుగ్రహించి నన్ను దృఢపరిచెను / నా శత్రువులకంటె నన్ను బహుగా తానే హెచ్చించెను (2) / నా జనులకు నాకు లోపరచి నన్ను ఘనపరచెను / నా ముందుగా తానే నడచి నన్ను బలపరచెను (2) ||యెహెూవాయే||
వేయి నోళ్లతో స్తుతియించినా / నీ ఋణమును నే తీర్చగలనా / యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా / నా రోగములను భరియించి / నా వ్యసనములను వహియించి / నా దోషములను క్షమియించి / స్వస్థత నొసగిన నా దేవా ||యేసయ్యా|| / శోధనలో నాకు జయమిచ్చి / బాధలలో నను ఓదార్చి / బలహీనతలో బలమిచ్చి / నెమ్మది నొసగిన నా దేవా ||యేసయ్యా||