799 praise songs available. Lyrics in Roman and Telugu script.
విలువైన నీ కృప నాపై చూపి – కాచావు గత కాలము / ఎనలేని నీ కృప నాపై ఉంచి – ఇచ్చావు ఈ వత్సరం / దినములు సంవత్సరాలు గడచిపోయెను ఎన్నో / ప్రతి దినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలో / నా జీవిత కాలమంతా నను నడుపుము యేసయ్యా / నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్యా (2) ||విలువైన|| / గడచినా కాలమంతా తోడైయున్నావు / అద్భుతాలు ఎన్నో చేసి చూపావు (2) / లెక్కించ లేని మేలులతో తృప్తి పరిచావు (2) / నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు (2) ||నా జీవిత|| / సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా / నూతన కార్యాలు ఎన్నో చేశావు (2) / సంవత్సరమను నీ దయా కిరీటం ధరింప చేశావు (2) / నా దినములు పొడిగించి నీ కృపలో దాచావు / మా దినములు పొడిగించి నీ కృపలో దాచావు ||నా జీవిత||
అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు / (యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు – (2) ||అబ్రాహాము|| / అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని / ఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి (2) / యాకోబును ఇశ్రాయేలని దీవించి / ఈ పాపిని నీవు విడువక ప్రేమించి / నా మంచి యేసయ్యా – నీవున్న చాలయ్యా / నీ చేతి నీడలో జీవింతునయ్యా (2) ||అబ్రాహాము|| / జీవాహారము నేనే అని పలికితివి / జీవ జలముల ఓరన నను నాటితివి (2) / నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసి / హృదయము నుండి జీవ జలములు పుట్టించి / నీ జీవాహారము – నీ జీవజలమును / నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును (2) ||అబ్రాహాము||
సర్వ లోకమా స్తుతి గీతం పాడెదం / ప్రభుని నామమును ప్రబల పరచెదం (2) / ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు / స్తుతి మహిమలు సదా అర్పించెదం / అతి సుందరుడు మహిమైశ్వరుడు / ఆయన నామమును కీర్తించెదం ఎల్లప్పుడు ||సర్వ|| / అన్ని కాలములలో ఉన్నాడు ఉంటాడు / అన్ని స్థితి గతులలో నడిపిస్తాడు (2) / సంతోషించుమా ఆనందించుమా / ఆయన చేసినవి మరువకుమా / సన్నుతించుమా మహిమ పరచుమా / ఆయన నామమును ఘనపరచు ఎల్లప్పుడు ||సర్వ|| / శోధన వేదన ఏది ఎదురైనా / మొరపెడితే చాలునే విడిపిస్తాడే (2) / రక్షకుడేసు రక్షిస్తాడు / ఆయన నామములో జయం మనదే / ఇమ్మానుయేలు మనలో ఉండగా / జీవితమంతా ధన్యమే ధన్యమే ||సర్వ||
నా జీవితాంతము / నీ సేవ చేతునంటిని / నే బ్రతుకు కాలము / నీతోనే నడుతునంటిని / నా మనవి వింటివి / నన్నాదుకొంటివి (2) ||నా జీవితాంతము|| / నీ ప్రేమ చూపించి / నన్ను నీవు పిలిచితివి / నీ శక్తి పంపించి / బలపరచి నిలిపితివి (2) / నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము|| / రోగముతో పలుమార్లు / పడియుండ లేపితివి / ఘోరమై పోకుండా / స్థిరపరచి కాచితివి (2) / నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము|| / దూషించు దుష్టులకు / సిగ్గును కలిగించితివి / వేలాది ఆత్మలకు / మేలుగ నన్నుంచితివి (2) / నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము|| / సంఘములు కట్టుటకు / సామర్ధ్యమిచ్చితివి / ఉపదేశమిచ్చుటకు / దేశములు తిప్పితివి (2) / నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము||
మార్పులేని తండ్రివి నీవే / చేయి వీడని స్నేహితుడవు నీవే (2) / వాక్యమై నను నడిపించే / ఆత్మయై నను ఓదార్చే (2) / యెహోవా రఫా యెహోవా యీరే / యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ / యెహోవా షమ్మా ఎలోహిం యావే / ఆకాశము భూమియు / గతియించినా గతియించనీ (2) / మారని నీ వాక్యమే / నను నడుపును సదా / మారని నీ మాటలే / నను నిలుపును సదా ||యెహోవా|| / వాగ్ధానము నెరవేర్చుచు / నా రక్షణకరుడైతివి (2) / తండ్రి అని పిలిచినా / పలికెడి ప్రేమా (2) ||యెహోవా||
పరమ తండ్రి కుమారుడా / పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం / నీతిమంతుడా మేఘారూఢుడా / స్తుతి పాత్రుడా నీకే మహిమ / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా (2) / నీ స్వస్థతల కన్నా / నీ సన్నిధియే మిన్న / నీ అద్భుతములు కన్నా / నీ కృపయే మిన్న (2) / నను నే ఉపేక్షించి / నిను నేను హెచ్చించి / కొనియాడి కీర్తింతును (2) / పరిశుద్ధుడా పరమాత్ముడా / పునరుత్తానుడా నీకే ఘనత / సృష్టికర్త బలియాగమా / స్తోత్రార్హుడా నీకే ఆరాధన / ఆరాధన ఆరాధన / ఆరాధన ఆరాధన (2)
నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే / నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – (2) ||నా గీతా|| / నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే / చేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే (2) / నీ కృప నాలో అత్యున్నతమై / నీతో నన్ను అంటు కట్టెనే (2) ||నా గీతా|| / చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినా / సిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే (2) / నిశ్చలమైన రాజ్యము కొరకే / ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే (2) ||నా గీతా|| / ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే / ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే (2) / ఆత్మతో సత్యముతో ఆరాధించుచు / నే వేచియుందునే నీ రాకడకై (2) ||నా గీతా||
హల్లెలూయా ఆరాధన / రాజాధి రాజు యేసునకే / మహిమయు ఘనతయు / సర్వాధికారి క్రీస్తునకే (2) / చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ / ఆ ప్రభుని కీర్తించెదం / నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో / స్తోత్రార్పణ చేసెదం ||హల్లెలూయా|| / రూపింప బడక ముందే / నన్ను ఎరిగితివి / నా పాదములు జారకుండా / రక్షించి నడిపితివి (2) ||చప్పట్లు|| / అభిషేక వస్త్రము నిచ్చి / వీరులుగా చేసితివి / అపవాది క్రియలను జయించే / ప్రార్థన శక్తినిచ్చితివి (2) ||చప్పట్లు||
స్తుతికి పాత్రుడ యేసయ్యా / నా స్వాస్థ్య భాగము నీవయ్యా (2) / పూర్ణ హృదయముతో పాడి కొనియాడెద (2) / నీవే నా రక్షణ – నీవే నా స్వస్థత / నీవే నా విడుదల (2) ||స్తుతికి|| / పాప ఊభిలో నుండి – పైకి లేపితివి / మరణ ఛాయను తొలగించి – కరుణ చూపితివి (2) / నీ వైపే చూస్తూ – నీతోనే నడుస్తూ / నీ వెనకే చేరెద యేసూ (2) ||నీవే|| / జీవాహారము నీవే – జీవ జలము నీవే / నీదు నామమే శక్తి – లేదు ఇలలో సాటి (2) / ప్రతి మోకాలొంగును – ప్రతి నాలుక ఒప్పును / యేసు రాజా నీ యెదుట (2) ||నీవే||
బంతియనగ ఆడరే / మన బాల చిన్న ముద్దుల యేసుకు (2) / ముచ్చిక తోడ కూడి యాడి / ముద్దుల పరుడు పల్క పరుడు / గ గ గ రి గ మ మ మ మ / ప మ ప మ ప ద ని స (2) / ప ద ని స.. ప ద ని స / ప ద ప ద గ మ / గ మ గ రి స రి ||బంతి|| / దూతలెల్ల కూడిరి / మంచి గీతములను పాడిరి (2) ||ముచ్చిక|| / గొల్లలెల్ల చేరిరి / మంచి గొర్రెలనర్పించిరి (2) ||ముచ్చిక|| / జ్ఞానులెల్ల వచ్చిరి / మంచి కానుకలర్పించిరి (2) ||ముచ్చిక|| / క్రీస్తు యొక్క జన్మ దిన / మహోత్సవముగా జరిగెను (2) ||ముచ్చిక||
ప్రియతమ బంధమా – నా హృదయపు ఆశ్రయ దుర్గమా / అనుదినం అనుక్షణం – నీ ఒడిలో జీవితం ధన్యము / కృతజ్ఞతతో పాడెదను / నిరంతరము స్తుతించెదను ||ప్రియతమ|| / అంధకారపు సమయములోన – నీతి సూర్యుడై ఉదయించావు / గమ్యమెరుగని పయనములోన – సత్య సంధుడై నడిపించావు (2) / నా నిరీక్షణ ఆధారం నీవు / నమ్మదగిన దేవుడవు నీవు (2) / కరుణ చూపి రక్షించినావు / కరుణామూర్తి యేసు నాథా (2) / వందనం వందనం దేవా – వందనం వందనం / అనుదినం అనుక్షణం నీకే నా – వందనం వందనం ||కృతజ్ఞతతో|| / పరమ తండ్రివి నీవేనని – పూర్ణ మనసుతో ప్రణుతించెదను / పరిశుద్ధుడవు నీవేనని – ప్రాణాత్మలతో ప్రణమిల్లెదను (2) / విశ్వసించిన వారందరికి / నిత్య జీవము నొసగె దేవా (2) / కరుణ చూపి రక్షించినావు / కరుణామూర్తి యేసు నాథా (2) / వందనం వందనం దేవా – వందనం వందనం / అనుదినం అనుక్షణం నీకే నా – వందనం వందనం ||కృతజ్ఞతతో||
భక్తులారా స్మరియించెదము / ప్రభు చేసిన మేలులన్నిటిని (2) / అడిగి ఊహించు వాటి కన్నా మరి (2) / సర్వము చక్కగ చేసె (2) ||భక్తులారా|| / గాలి తుఫానులను గద్దించి / బాధలను తొలగించే (2) / శ్రమలలో మనకు తోడైయుండి / శ్రమలలో మనకు తోడైయుండి / బయలు పరచె తన జయమున్ (2) ||భక్తులారా|| / ఈ భువియందు జీవించు కాలం / బ్రతికెదము ప్రభు కొరకే (2) / మనమాయనకర్పించుకొనెదము / మనమాయనకర్పించుకొనెదము / ఆయన ఆశయమదియే (2) ||భక్తులారా|| / కొంచెము కాలమే మిగిలియున్నది / ప్రభువును సంధించుటకై (2) / గనుక మనము నడచుకొనెదము / గనుక మనము నడచుకొనెదము / ప్రభు మార్గముల యందు (2) ||భక్తులారా||