ప్రేమ | Love Telugu Songs

131 love songs available. Lyrics in Roman and Telugu script.

ప్రేమా పూర్ణుడు|Premaa Poornudu

ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు / నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2) / నే పాడెదన్ – కొనియాడెదన్ (3) / నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4) ||ప్రేమా|| / లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ / గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2) / యేసుని ప్రేమ వెల యెంతో / ఇహమందైనా పరమందైనా (2) / వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ / కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2) ||ప్రేమా|| / మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ / మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ (2) / రక్తము కార్చి రక్షణ నిచ్చి / ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2) / గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ / బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2) ||ప్రేమా||

సహోదరులు ఐక్యత కలిగి|Sahodarulu Aikyatha Kaligi

అది తల మీద పోయబడి / అహరోను గడ్డము మీదుగా కారినా… / సహోదరులు ఐక్యత కలిగి నివసించుట / ఎంత మేలు – ఎంత మనోహరము / సహోదరులు ఐక్యత కలిగి నివసించుట / ఎంత మేలు – ఎంత మనోహరము / అది తల మీద పోయబడి / అహరోను గడ్డము మీదుగా కారినా… / పరిమళము – పరిమళ తైలము – (2) ||సహోదరులు|| / సంఘ సహవాసములో సహోదరులు / మత్సరము ద్వేషము అసూయతో నిండి (2) / వాక్యమును విడచి ఐక్యత లోపించి / తొలగిపోయిరి… ప్రభు కృప నుండి / సహవాసము పరిహాసమాయెను – (2) ||సహోదరులు|| / సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి / స్వస్థతలు దీవెనలు అద్భుతములు (2) / క్షయమైన వాటి కొరకు – అక్షయుడగు ప్రభును వదిలి / అపహసించిరి… సువార్త సేవను / పరిశుద్ధాత్ముడు పరిహాసమొందెను – (2) ||సహోదరులు||

చాచిన చేతులు నీవే|Chaachina Chethulu Neeve

చాచిన చేతులు నీవే / అరచేతిలో చెక్కినావే / కమ్మని అమ్మవు నీవే / కాచిన తండ్రివి నీవే / నీలా ఎవరు ప్రేమిస్తారు / నాకై ప్రాణం అర్పిస్తారు / కన్నీళ్లు తుడిచి కరుణిస్తారు / కళ్ళార్పకుండా కాపాడతారు ||చాచిన|| / కొండలు గుట్టలు చీకటి దారులు / కనిపించదే కళ్ళు చిట్లించినా / కారాలు మిరియాలు నూరేటి ప్రజలు / అన్నారు పడతావొక్క అడుగేసినా / రక్షించే వారే లేరని / నీ పనైపోయిందని (2) / అందరు ఒక్కటై అరచేసినా / అపవాదులెన్నో నాపై మోపేసినా (2) / నీ చేయి చాచేసి చీకటిని చీల్చేసి / శత్రువును కూల్చేసి నిలబెట్టినావు ||చాచిన|| / పేదోడు పిరికోడు ప్రభు సేవకొచ్చాడు / అవమానపడతాడని నవ్వేసినా / చిన్నోడు నీవంటూ అర్హత లేదంటూ / అయినోళ్లు కానోళ్లు చెప్పేసినా / నీవెంత నీ బ్రతుకెంతని / నిలువలేవు నీవని (2) / అందరు ఒక్కటై తేల్చేసినా / కూల్చేయాలని నన్ను కృషిచేసినా (2) / నీ ఆత్మతో నింపేసి నిరాశను కూల్చేసి / నా గిన్నె నింపేసి నడిపించినావు ||చాచిన||

నా స్నేహితుడా|Naa snehithudaa

నీతో స్నేహం నే మరువగలనా / నిన్ను విడచి నేను ఉండగలనా / నీతో స్నేహం నే మరువగలనా / నా స్నేహితుడా… నా యేసయ్యా (2) / విడువక నను ఎడబాయని నేస్తమా ||నీతో|| / నా నీడగా నీవుండగా – భయమేమీ లేదుగా / శోధనకైనా బాధలకైనా భయపడిపోనుగా / శత్రువు నన్ను వేధించినా – నా ధైర్యం నీవేగా / లోకం నన్ను దూషించినా – నన్ను విడువవుగా / కన్నీరు తుడిచే నా నేస్తం నీవేగా / ఓదార్చి నడిపించే స్నేహితుడవు నీవేగా ||నా స్నేహితుడా|| / నా తోడుగా నీవుండగా – కొదువేమి లేదుగా / కష్టములైనా నష్టములైనా – తడబడిపోనుగా / అపాయమేమి రాకుండగా – కాచేవాడవు నీవేగా / ఎన్నటికైనా మారని నీదు – స్నేహమే మధురముగా / ప్రేమను పంచిన నా నేస్తం నీవేగా / ప్రాణాన్నే ఇచ్చిన స్నేహితుడవు నీవేగా ||నా స్నేహితుడా||

నాతో నీవు మాట్లాడినచో|Naatho Neevu Maatlaadinacho

నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్ / నీ ప్రేమలోతు చవిచూపించు నిన్నే సేవించెదన్ / నీ ప్రేమనుండి నన్నెవ్వరు వేరుచేయరూ / నీ ప్రేమయందే నేను సంతసించెదన్ / యేసయ్యా నీవే నా ఆధారం (4) / శ్రమయైనా బాధయైనా వ్యధయైనా ధుఖఃమైనా / కరువైనా ఖడ్గమైనా హింసయైనా యేదైనా / క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా / క్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్ / యేసయ్యా నీవే నా ఆధారం (4) / జీవమైనా మరణమైనా దూతలైనా ప్రధానులైనా / ఉన్నవియైనా రాబోవునవైనా యెత్తైనా లోతైనా / క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా / క్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్ / యేసయ్యా నీవే నా ఆధారం (4) ||నాతో నీవు||