65 good friday songs available. Lyrics in Roman and Telugu script.
దూరపు కొండపై శ్రమలకు గుర్తగు / కౄరపు సిలువయే కనబడె / పాపలోకమునకై ప్రాణము నొసగిన / ప్రభుని సిలువను ప్రేమింతున్ / ప్రియుని సిలువను ప్రేమింతున్ / ప్రాణమున్నంత వరకును / హత్తుకొనెదను సిలువను / నిత్యకిరీటము పొందెదన్ / లోకులు హేళన చేసిన సిలువ / నా కెంతో అమూల్యమైనది / కల్వరిగిరికి సిలువను మోయను / క్రీస్తు మహిమను విడచెను ||ప్రియుని|| / రక్తశిక్తమైన కల్వరి సిలువలో / సౌందర్యంబును నే గాంచితిని / నన్ను క్షమించను పెన్నుగ యేసుడు / ఎన్నదగిన శ్రమ పొందెను ||ప్రియుని|| / వందనస్తుడను యేసుని సిలువకు / నిందను ఈ భువిన్ భరింతు / పరమ గృహమునకు పిలిచెడు దినమున / ప్రభుని మహిమను పొందెద ||ప్రియుని||
మారిపోయెనే నా పాపపు మనసు – సిలువలో నిన్ను చూడ / కరిగిపోయెనే నా కఠిన హృదయం – కలువరిలో నిన్ను చేర / యేసయ్యా యేసయ్యా… నీ ప్రేమ నాకు చాలయ్యా (2) ||మారిపోయెనే|| / సొగసైన నీ మోము ఉమ్ములతో నిండిపోయెనా / దుర్మార్గపు కొరడాలు నీ వీపుపై నాట్యమాడెనా (2) / పరిశుద్ధ దేహం మాంసపు ముద్దాయెనా / విసుకలేదయ్యా నాకై విసికి పోలేదయ్యా / ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా / ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా ||మారిపోయెనే|| / యెరూషలేము పుర వీధులు రక్తముతో తడిసిపోయెనా / స్వచ్చమైన నీ రూపం సిలువలో నలిగిపోయెనా (2) / యూదా కొదమ సింహం గొర్రెలా మౌని ఆయేనా / తెరువలేదయ్యా నీవు నోరు మెదపలేదయ్యా / ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా / ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా ||మారిపోయెనే||
ప్రభు యేసు.. ప్రభు యేసు – అదిగో శ్రమ నొందెను / ఖైదీలను విడిపించెను సిలువలో || ప్రభు యేసు || / ఎంత కౄరమో.. ఎంత కౄరమో – శత్రు కార్యము చూడుమా / అంతగా బాధించి సిలువమీది కెత్తిరి / బాధనొందియు.. బాధనొందియు – ఎదురు మాటలాడక / ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు || / ముండ్ల మకుటము.. ముండ్ల మకుటము – తన తల నుంచిరి / మూర్ఖుల దెబ్బల బాధను సహించెను / మూసియుండిన.. మూసియుండిన మోక్షద్వారము తెరచి / ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు || / ఆత్మదేవుడు.. ఆత్మదేవుడు – ప్రత్యక్షంబాయె సిలువలో / సూర్యుడదృశ్యుడై క్రమ్మెనంత చీకటి / సార్వత్రికము.. సార్వత్రికము – గడగడ వణికెను / ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు || / మరణించెను.. మరణించెను – సమాధి నుంచబడెను / మూడవనాడు సమాధినుండి లేచెను / విడిపించెను.. విడిపించెను మరణ బంధితులను / ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు || / తీసివేసెను.. తీసివేసెను – నా పాప నేరమంతయు / దేవయని ప్రభు అరచిన యపుడు / దేవుని దయ.. దేవుని దయ – కుమ్మరించబడెను / ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభుయేసు || / కారు చీకటిలో.. కారు చీకటిలో – దుఃఖంబులో నేనుంటిని / నీకువేరుగా నారక్షణిల లేదుగా / నాదు శ్రమలు.. నాదు శ్రమలు – వేరెవ్వరు నెరుగరు / ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు ||
పాపిగ నను చూడలేక – పాపముగా మారినావా / దోషిగ నను చూడలేక – నా శిక్ష నీవు పొందినావా (2) / నా తల యెత్తుటకు – నీవు తల వంచితివే / అర్హత నాకిచ్చుటకు – అవమాన-మొందితివే / తండ్రితో నను చేర్చుటకు – విడనాడబడితివే / జీవము నాకిచ్చుటకు – మరణము-నొందితివే / నీవే నీవే – నీవే దేవా / నీవే నీవే – నా యేసయ్యా (2) / పరమును వీడి ఈ భువికి / దిగి వచ్చిన రక్షకుడా / మహిమను వీడి నా వెలని / చెల్లించిన ప్రేమామయుడా / నే వెదకి రాలేనని సత్యమునెరిగి / నీవే నా దరికి పరుగెత్తితివి / దాసత్వము నుండి నను విడిపించి / తండ్రి అని పిలిచే భాగ్యము నిచ్చితివి ||నీవే|| / నా స్థానములో నీవే నిలిచి / నీ స్థానమే నాకిచ్చితివి / సౌందర్యవంతునిగా నన్నే చేసి / సొగసంతా కోల్పోయితివి / నీ బలమంతా నాకే ఇచ్చి / బలియాగముగా నీవు మారితివి / ఐశ్వర్యవంతునిగా నన్నే చేసి / దీనతనే హత్తుకొంటివి ||నీవే|| / నా బలమంతా నీవే – నా సౌందర్యము నీవే / నా ఐశ్వర్యము నీవే – నీవే నీవే / నా అతిశయము నీవే – నా ఆనందం నీవే / నా ఆధారం నీవే – నీవే నీవే (2) / యేసయ్యా యేసయ్యా యేసయ్యా / యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) ||పాపిగ||
నా చెలిమి కోరి – నీ కలిమి వీడి / నా చెంత చేరావు శ్రీమంతుడా / నా రక్షణ కొరకై – ఆ శిక్షను పొంది / బలియాగమైన నిజ స్నేహితుడా ||నా చెలిమి|| / ద్రోహినై దూరమైతిని – పాపినై పరుగులెడితిని / గమ్యమే ఎరుగనైతిని – మరణమే శరణమాయెను / ఎంతో ప్రేమించితివి – నా స్థానమందు నిలిచితివి / కృపతో నన్ రక్షించితివి – నా దోషశిక్ష భరించితివి ||నా చెలిమి|| / నిందలు అవమానములు – హేళనలు చీత్కారములు / కఠిన దెబ్బలు ముళ్లపోటులు – సిలువ భారం కాయమంతా గాయం / హృదినే బాధించినా – భరియించావు వేదన మౌనముగా / తనువే తల్లడిల్లినా – తృప్తినొందావు నను తలచుకొని ||నా చెలిమి|| / ఏ రీతి నిన్ను – కీర్తించగలను / నా నీతి నీవే ఓ యేసుదేవా / నీ సాక్షిగ నిలిచి – నీ ప్రేమను చాటి / ఘనపరతును నిన్నే ప్రియ స్నేహితుడా
నీలాంటి ప్రేమ ఈ లోకాన / ఎవరైనా చూపారా? – (2) / నా పాపభారం ఆ సిలువపైన / ఎవరైనా మోశారా? – (2) / యేసయ్యా.. యేసయ్యా.. / యేసయ్యా.. ఓ యేసయ్యా (2) ||నీలాంటి|| / చెలికాడే నిన్ను సిలువకు పంపగా / పరిసయ్యులే నిన్ను పరిహసించగా (2) / నోరు తెరువని ప్రేమ / బదులు పలుకని ప్రేమ (2) ||యేసయ్యా|| / దొంగలే నిన్ను దూషించగను / నా అనువారే అపహసించగా (2) / నోరు తెరువని ప్రేమ / బదులు పలుకని ప్రేమ (2) ||యేసయ్యా|| / తండ్రి వీరు చేయునదేమో / ఎరుగరు కనుక క్షమియించుమని (2) / ప్రార్ధన చేసితివయ్యా / మము క్షమియించితివయ్యా (2) ||యేసయ్యా|| / నీ దివ్య ప్రేమను ప్రకటింతునయ్యా / ఆ ప్రేమ మార్గములో నడిచెదనయ్యా (2) / నీదు ప్రేమే నా గానం / నీ ప్రేమే నా భాగ్యం (2) ||యేసయ్యా||
ఒక చేతిలో కర్ర / ఒక చేతిలో గొర్రె (2) / చేసేటి చేతులలోన / మేకులు నాటిరి నరులు (2) / కారింది నీదు రక్తం కాలువలై పారే / చిందింది నీదు రక్తం సిలువపై వ్రాలే ||ఒక చేతిలో|| / నడిచేటి కాళ్ళలలోన / మేకులు నాటిరి నరులు (2) ||కారింది|| / కిరీటంబు తెచ్చిరి / తలపైన పెట్టిరి (2) ||కారింది|| / సిలువను తెచ్చిరి / భుజం పైన పెట్టిరి (2) ||కారింది|| / బల్లెంబు తెచ్చిరి / ప్రక్కలోన పొడచిరి (2) ||కారింది||
నీ పాదముల్ నే చేరగా – గాయంబులున్ నే గాంచితిన్ / నీ సిలువకై నే చేరగా – నీ ప్రేమను నే పొందితిన్ / నా కొరకే ఈ మరణమా – నా పాపమే కారణమా (2) ||నీ పాదముల్|| / నా అతిక్రమముల బట్టి గాయపరచబడెగా / నా దోషములను బట్టి నలుగగొట్టబడెగా (2) / సమాధానార్థమైన శిక్ష మీద పడెను / పాపపరిహార్థ బలిగ వధియించబడెను (2) ||నా కొరకే|| / వధకు తేబడు గొర్రెపిల్ల నిలచునట్లుగా / మౌనముగా నుండి నీవు తీర్పునొందితివివే (2) / నీ వేదన చూసి హేళన చేసిన గానీ / వీరేమి చేతిరో ఎరుగరంటివే (2) ||నా కొరకే||
ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను / ప్రభు యేసు యెల్ల వేళ విజయ మిచ్చును / ఘన విజయమిచ్చును (2) / ఓ సమాధి విజయమేది మరణమా ముల్లెక్కడ / మ్రింగె జయము మరణమున్ ఫలించె సత్యవాక్యము (2) / జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ||ప్రభు యేసు|| / దైవజన్మ మొందువారె లోకమున్ జయింతురు / లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము (2) / జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ||ప్రభు యేసు|| / శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతల్ / క్రీస్తు ప్రేమనుండి మనల నేదియు నెడబాపదు (2) / జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ||ప్రభు యేసు|| / అన్నిటిలో పొందెదము ఆయనతో విజయము / అధిక విజయ మొందెదం ప్రేమించు క్రీస్తు ద్వారనే (2) / జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ||ప్రభు యేసు|| / జయము పొందువారెల్లరు తన రాజ్యవారసుల్ / దేవుడే వారికి తండ్రి వారయన పుత్రులు (2) / జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ||ప్రభు యేసు||
యేసు రక్తము రక్తము రక్తము (2) / అమూల్యమైన రక్తము / నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము|| / ప్రతి ఘోర పాపమును కడుగును / మన యేసయ్య రక్తము (2) / బహు దు:ఖములో మునిగెనే / చెమట రక్తముగా మారెనే (2) ||యేసు రక్తము|| / మనస్సాక్షిని శుద్ధి చేయును / మన యేసయ్య రక్తము (2) / మన శిక్షను తొలగించెను / సంహారమునే తప్పించెను (2) ||యేసు రక్తము|| / మహా పరిశుద్ద స్థలములో చేర్చును / మన యేసయ్య రక్తము (2) / మన ప్రధాన యాజకుడు / మన కంటె ముందుగా వెళ్ళెను (2) ||యేసు రక్తము||
కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై / మనలేను ప్రభు జూచి కఠినాత్మునై / కఠినాత్మునై… ||కనలేను|| / పాపులనేలేటి ప్రభునేలనో / బల్లెంపు పోటుల బంధించిరి (2) / కనుపించు పాపాలు రక్తాలలో / ప్రభు బాధలో ||కనలేను|| / ముండ్ల కిరీటము ప్రభుకేలనో / మూఢులు మోపిరి ప్రభు నెత్తిని (2) / ప్రభు రక్త గాయాలు నా పాపమా / ప్రభు శాపమా ||కనలేను|| / తన జంపు శత్రువుల క్షమియించెను / క్షమియింపుమని తండ్రిని వేడెను (2) / క్షమా బుద్ధి నేర్పించి చితి నోర్చెను / భరియించెను ||కనలేను|| / మోయజాలని సిలువ మోయించిరి / దివినేలు బాహువులు బంధించిరి (2) / నా పాపమంతయు ప్రభు మోసెను / భరియించెను ||కనలేను|| / జీవజలముల నిచ్చుఁ ప్రభుకేలనో / చేదు చిరక త్రాగను అందించిరి (2) / ఆత్మ దాహము తీర్చ బలి అయ్యెను / సిలువొందెను ||కనలేను|| / తన ఆత్మ తండ్రికి సమర్పించెను / తనదంతా తండ్రితో చాచుంచెను (2) / తలవంచి తండ్రిలో తుది చేరెను / కను మూసెను ||కనలేను|| / లోకాలనేలేటి ప్రభువేలనో / ఈ ఘోర మరణంబు గురి అయ్యెనో (2) / నా పాప బ్రతుకేల ప్రభువేడ్చెనో / సిలువేసెనో ||కనలేను||
ప్రియ యేసు దేహములో ఉబికే రక్తపు ఊట / ప్రవహించె ఏరులై కలుషంబులను కడుగా / కొరడాల దెబ్బలచే – దేహము చారలై చీలగా / సుందరుండు వికారుడాయే – చూడనొల్లని వాడాయే ||ప్రియ యేసు|| / నా దుష్ట తలంపులకై – ముండ్ల కిరీటమా తలపై / నా నీచ నడతలకై – పాద హస్తములలో చీలలా ||ప్రియ యేసు|| / ముఖముపై గ్రుద్దిననూ – చెంపలపై కొట్టిననూ / బల్లెము ప్రక్కలో దింపినా – నీచునికి నిత్య జీవమా ||ప్రియ యేసు|| / ఇది ఎంతటి ప్రేమ ప్రభు – ఏమని వర్ణింతు నిన్ను / సజీవ యాగముగా – నన్నే నీ-కర్పింతును