విశ్వాసము | Faith Telugu Songs

315 faith songs available. Lyrics in Roman and Telugu script.

వాడబారని విశ్వాసం|Vaadabaarani vishwaasam

వాడబారని విశ్వాసం – ఎప్పుడూ.. కోపగించని వాత్సల్యం / పాపమెంచని ఆంతర్యం – నీతో.. వీడదీయని సాంగత్యం / దయచేయుమా నాకు నా యేసయ్యా / సరిచేయుమా నన్ను నా యేసయ్యా / వాడుకో నా యేసయ్యా / అని వేడుకుంటున్నానయ్యా (2) / రాజా రాజా రాజుల రాజా / రాజా రారాజా నా యేసు రాజా (2) / ఏలియా ప్రవక్త / యోర్దాను నదీ సమీపమున / ఆహారమే లేకయుండగా / ఆ మహా కరువు కాలమున (2) / కాకోలముచే ఆహారమును పంపిన దేవా (2) / కాకోలాన్నే వాడిన దేవా / కడుహీనుడనైన నన్నును కూడా ||వాడుకో|| / బెయేరు కుమారుడు బిలాము / దైవాజ్ఞను మీరగా / మోయాబుకు పయనమైన వేళ / తన నేత్రాలు మూయబడగా (2) / గాడిదకు మాట్లాడుటకు పలుకిచ్చిన దేవా (2) / గాడిదనే వాడిన దేవా / గతిలేనివాడను నన్నును కూడా ||వాడుకో||

యేసు రక్తములో|Yesu rakthamulo

యేసు రక్తములో నాకు జయమే జయము / ప్రభు యేసు రక్తములో నిత్యం విజయం (2) / జయం జయం జయం జయం – నా యేసునిలో / జయం జయం జయం జయం – ప్రభుయేసు రక్తములో (2) ||యేసు రక్తములో|| / పాపాలను క్షమియించి – శాపాలను భరియించి / విడుదలను కలిగించే యేసు రక్తము / మరణాన్ని తొలగించి – నరకాన్ని తప్పించి / పరలోకానికి చేర్చే యేసు రక్తము (2) / అమూల్యమైనది పవిత్రమైనది / ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2) ||జయం జయం|| / శోధనలలో జయమిచ్చి – బాధలో నెమ్మదినిచ్చి / ఆదరణను కలిగించే యేసు రక్తము / రోగాలను లయపరచి – వ్యాధులను దూరం చేసి / స్వస్థత నాకు చేకూర్చే యేసు రక్తము (2) / అమూల్యమైనది పవిత్రమైనది / ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2) ||జయం జయం||

అదే అదే ఆ రోజు|Ade Ade Aa Roju

అదే అదే ఆ రోజు / యేసయ్య ఉగ్రత రోజు / ఏడేండ్ల శ్రమల రోజు / పాపులంతా ఏడ్చే రోజు ||అదే అదే|| / వడగండ్లు కురిసే రోజు / భూమి సగం కాలే రోజు (2) / నక్షత్రములు రాలే రోజు / నీరు చేదు అయ్యే రోజు / ఆ నీరు సేవించిన / మనుషులంతా చచ్చే రోజు ||అదే అదే|| / సూర్యుడు నలుపయ్యే రోజు / చంద్రుడు ఎరుపయ్యే రోజు (2) / భూకంపం కలిగే రోజు / దిక్కు లేక అరచే రోజు / ఆ రోజు శ్రమ నుండి / తప్పించే నాథుడు లేడు ||అదే అదే|| / మిడతల దండొచ్చే రోజు / నీరు రక్తమయ్యే రోజు (2) / కోపాగ్ని రగిలే రోజు / పర్వతములు పగిలే రోజు / ఆ రోజు శ్రమ నుండి / తప్పించే నాధుడు లేడు ||అదే అదే|| / వ్యభిచారులు ఏడ్చే రోజు / మోసగాళ్ళు మసలే రోజు (2) / అబద్ధికులు అరచే రోజు / దొంగలంతా దొరికే రోజు / ఆ రోజు శ్రమ నుండి / తప్పించే నాథుడు లేడు ||అదే అదే|| / పిల్ల జాడ తల్లికి లేక / తల్లి జాడ పిల్లకు లేక (2) / చేట్టుకొక్కరై పుట్టకొక్కరై / అనాథలై అరచే రోజు / ఆ రోజు శ్రమ నుండి / తప్పించే నాథుడు లేడు ||అదే అదే|| / ఓ మనిషి యోచింపవా / నీ బ్రతుకు ఎలా ఉన్నదో (2) / బలము చూసి భంగ పడకుమా / ధనము చూసి దగా పడకుమా / ఆ రోజు శ్రమ నుండి / తప్పించే నాథుడు లేడు ||అదే అదే||

నా ప్రాణమా నాలో నీవు|Naa Praanamaa Naalo Neevu

నా ప్రాణమా నాలో నీవు / ఎందుకు కృంగియున్నావు / యెహోవాయందే ఇంకను / నిరీక్షణ ఉంచుము నీవు (2) ||నా ప్రాణమా|| / ఈతి బాధల్ కఠిన శ్రమలు / అవమానములే కలిగిన వేళ (2) / నీ కొరకే బలియైన యేసు / సిలువను గూర్చి తలపోయుమా (2) / అల్పకాల శ్రమల పిదప / మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా (2) ||నా ప్రాణమా|| / ఆప్తులంతా నిను వీడిననూ / శత్రువులే నీపై లేచిననూ (2) / తల్లి అయినా మరచినా మరచున్ / నేను నిన్ను మరువాననినా (2) / యేసుని ప్రేమన్ తలపోయుమా / ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా (2) ||నా ప్రాణమా|| / ఐశ్వర్యమే లేకున్ననూ / సౌఖ్య జీవితమే కరువైననూ (2) / ప్రభు సేవలో ప్రాణములనే / అర్పించవలసి వచ్చిననూ (2) / క్రీస్తునికే అంకితమై ఆనందించు / ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||

ప్రభు యేసు నా రక్షకా|Prabhu Yesu Naa Rakshakaa

ప్రభు యేసు నా రక్షకా / నొసగు కన్నులు నాకు / నిరతము నే నిన్ను జూడ (2) / అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు|| / ప్రియుడైన యోహాను పత్మాసులో / ప్రియమైన యేసు నీ స్వరూపము (2) / ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె / ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| / లెక్కలేని మార్లు పడిపోతిని / దిక్కులేనివాడ నేనైతిని (2) / చక్కజేసి నా నేత్రాలు దెరచి / గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| / ఎరిగి యెరిగి నే చెడిపోతిని / యేసు నీ గాయము రేపితిని (2) / మోసపోతి నేను దృష్టి దొలగితి / దాసుడ నన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| / ఎందరేసుని వైపు చూచెదరో / పొందెదరు వెల్గు ముఖమున (2) / సందియంబు లేక సంతోషించుచు / ముందుకు పరుగెత్తెదరు (2) ||ప్రభు యేసు|| / విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ / కొనసాగించువాడా యేసు ప్రభూ (2) / వినయముతో నేను నీ వైపు జూచుచు / విసుగక పరుగెత్త నేర్పు (2) ||ప్రభు యేసు|| / కంటికి కనబడని వెన్నియో / చెవికి వినబడని వెన్నియో (2) / హృదయ గోచరము కాని వెన్నియో / సిద్ధపరచితివ నాకై (2) ||ప్రభు యేసు|| / లోక భోగాలపై నా నేత్రాలు / సోకకుండునట్లు కృప జూపుము (2) / నీ మహిమ దివ్య స్వరూపమును / నిండార నను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||

Faith Telugu Songs — Page 23 | UEC Telugu Church