315 faith songs available. Lyrics in Roman and Telugu script.
ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా (2) / నీ బ్రతుకంతా మారుటే మేలు / కోరుము జీవమునే ||ఓ క్రైస్తవ|| / పాププు చీకటి బ్రతుకేలా / శాపము భారము నీకేలా (2) / పావన యేసుని పాదము చేరిన / జీవము నీదగురా ||ఓ క్రైస్తవ|| / మారిన జీవిత తీరులలో / మానక నీప్రభు సేవకురా (2) / మహిమ కిరీటము మనకొసగును / ఘనమే నీదగురా ||ఓ క్రైస్తవ|| / భయపడి వెనుకకు పరుగిడక / బలమగు వైరిని గెలిచెదవా (2) / బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన / గెలుపే నీదగురా ||ఓ క్రైస్తవ||
ఎవరో తెలుసా యేసయ్యా / చెబుతా నేడు వినవయ్యా / పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి / రక్షణ పొందయ్యా (2) / దేవాది దేవుడు యేసయ్యా / మానవ జన్మతో వచ్చాడయ్యా (2) / మరణించాడు మరి లేచాడు / నీ నా పాప విమోచనకై (2) ||ఎవరో|| / ధనవంతుడై యుండి యేసయ్యా / దరిద్రుడై ఇల పుట్టాడయ్యా (2) / రూపు రేఖలు కోల్పోయాడు / నీ నా పాపవిమోచనకై (2) ||ఎవరో|| / పాపుల రక్షకుడేసయ్యా / కార్చెను రక్తము పాపులకై (2) / తన దరి చేరిన పాపులనెల్ల / కడుగును తనదు రక్తముతో (2) ||ఎవరో|| / యేసే దేవుడు ఎరుగవయ్యా / రాజుల రాజుగా వస్తాడయ్యా (2) / నమ్మినవారిని చేర్చును పరమున / నమ్మని వారికి నరకమేగా (2) ||ఎవరో|| / యేసుని తరుపున ప్రతినిధినై / దేవుని ప్రేమకు ప్రతిరూపమై (2) / అతి వినయముగా బతిమాలుచున్నాను / నేడే నమ్ముము ప్రభు యేసుని (2) ||ఎవరో||
కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా / రోజులు అన్ని నావేనంటూ జీవిస్తున్నావా (2) / దేవుని ముందు నిలిచే రోజుంది / తక్కెడ తూకం వేసే రోజుంది (2) / జీవ గ్రంథం తెరిచే రోజుంది / నీ జీవిత లెక్క చెప్పే రోజుంది / ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా / ఆగవేమయ్యా నీ మనస్సు మార్చుకోవయ్యా (2) ||కాలం|| / ధనము బలము ఉన్నదని విర్రవీగుతున్నావా / మేడలు మిద్దెలు ఉన్నాయని అనుకుంటున్నావా (2) / గుజరాతును చూడవయ్యా ఎంత ఘోరమో / ఒక్క ఘడియలెందరో బికారులయ్యారు (2) ||ఆగవేమయ్యా|| / చూసావా భూకంపాలు కరువులు విపరీతాలు / పరిశుద్ధ గ్రంథములోని కడవరి కాలపు సూచనలు (2) / నిన్నటి వరకు కొదువ లేదని అనుకున్నారు / ఒక్క ఘడియలో ఎందరో నశించిపోయారు (2) ||ఆగవేమయ్యా|| / సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలు / సిద్ధపడని వారికి ఆ నరకపు ద్వారాలు (2) / అగ్ని ఆరదు పురుగు చావదు / నిత్యం ఏడుపు దుఃఖాలు (2) ||ఆగవేమయ్యా||
రాకడనే రైలు బండి వస్తున్నది / రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది (2) / పరిశుద్ధులకందులో చోటున్నది (2) / మంచి చోటున్నది – భలే చోటున్నది / చక్కని సీటున్నది ||రాకడనే|| / సత్యమనే చక్రములు దానికున్నవి / శాంతి అనెడి పైకప్పు దానికున్నది (2) / పాపములను క్షమియించే బ్రేకులున్నవి – బండికి బ్రేకులున్నవి / జీవమునకు మార్గమని కూయుచున్నది – కూత కూయుచున్నది ||రాకడనే|| / ప్రతి దినము బైబిలును పఠియించుము / ప్రార్దననెడి విజ్ఞాపన వివరించుము – ప్రభుకి వివరించుము / ఎదురు వీచే గాలులనెడి వ్యాధి బాధలన్ / సాతాను చిక్కులను యేసు రక్తమందు కడిగి / జయము పొందుము – పవిత్రుడవు కమ్ము ||రాకడనే|| / తండ్రి కుమారాత్మలనే రైలు బండిది / ఇంజను డ్రైవరు పేరు యెహోవాండి (2) / పరిశుద్ధ ఆత్మ అనెడి గార్డు ఉన్నాడు – బండికి గార్డు ఉన్నాడు / సిలువ జెండా ఎత్తి చూపి బండి నిలుపుము – నీవు ప్రవేశించుము ||రాకడనే|| / రక్షణనే టిక్కెట్టు దానికున్నది (2) / మారు మారుమనస్సు పొంది మీరు / ముందుకు రండి – టిక్కెట్టు కొనండి (2) ||రాకడనే|| / పాపులున్న స్టేషనులో బండి ఆగదు (2) / పరిశుద్ధుల స్టేషనులో / బండి ఆగును – రైలు బండి ఆగును (2) ||రాకడనే||
మార్గములను సృజించువాడు – జీవితాలను వెలిగించువాడు / బ్రతుకు నావ నడిపించువాడు – యెహోవాయే నాకుండగా (2) / నేను సాధించలేనిది లేనే లేదు – జయించలేనిది లేనే లేదు / అసాధ్యమైనది లేనే లేదు – విజయమెప్పుడూ నాదే (2) / ఎన్ని ఇక్కట్లు నాకెదురైననూ / జలములు నాపైకి లేచిననూ (2) / సంకెళ్లు నను బిగదీసిననూ / శత్రు గోడలు అడ్డుగా నిలచిననూ (2) ||నేను|| / జీవితమంతా శూన్యమైననూ / బంధువులందరు నను విడచిననూ (2) / వ్యాధులెన్నో నను చుట్టిననూ / అడ్డంకులెన్నో నాకెదురైననూ (2) ||నేను||
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం / భజియించి నే పొగడనా స్వామీ (2) / శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం / హల్లేలూయా హల్లేలూయా / హల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా (2) ||శృతిచేసి|| / దానియేలును సింహపు బోనులో / కాపాడినది నీవెకదా (2) / జలప్రళయములో నోవాహును గాచిన / బలవంతుడవు నీవెకదా (2) / నీవెకదా (3) ||హల్లేలూయా|| / సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన / సత్య హితుడవు నీవెకదా (2) / పాపులకొరకై ప్రాణమునిచ్చిన / కరుణామయుడవు నీవెకదా (2) / నీవెకదా (3) ||హల్లేలూయా||
షారోను రోజా యేసే – పరిపూర్ణ సుందరుడు (2) / ప్రేమ మూర్తియని – ఆదరించు వాడని / ప్రాణప్రియుని కనుగొంటిని (2) / అడవులైనా లోయలైనా / ప్రభు వెంట నేను వెళ్ళెదను (2) ||షారోను|| / యేసుని ఎరుగని వారెందరో / వాంఛతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2) / దప్పికతో ఉన్న ప్రభువునకే (2) / సిలువను మోసే వారెవ్వరు (2) ||అడవులైనా|| / సీయోను వాసి జడియకుము / పిలిచిన వాడు నమ్మదగినవాడు (2) / చేసిన సేవను మరువకా (2) / ఆదరించి బహుమతులెన్నో ఇచ్చును (2) ||అడవులైనా||
యేసు రాజుగా వచ్చుచున్నాడు / భూలోకమంతా తెలుసుకొంటారు (2) / రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2) / రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు|| / మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు / పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2) / లోకమంతా శ్రమకాలం (2) / విడువబడుట బహుఘోరం ||యేసు|| / ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది / ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2) / ఈ సువార్త మూయబడున్ (2) / వాక్యమే కరువగును ||యేసు|| / వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును / ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2) / నీతి శాంతి వర్ధిల్లును (2) / న్యాయమే కనబడును ||యేసు|| / ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర / సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2) / వంగని మోకాళ్ళన్నీ (2) / యేసయ్య యెదుట వంగిపోవును ||యేసు|| / క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ / కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2) / రెప్ప పాటున మారాలి (2) / యేసయ్య చెంతకు చేరాలి ||యేసు||
మా ఊహలు పుట్టక మునుపే – మా సర్వమునెరిగిన దేవా (2) / ఇహపరములలో నీవే – మా కోర్కెలు తీర్చెడి ప్రభువా (2) / విశ్వాస నిరీక్షణతో – కనిపెట్టియున్నచో (2) / పొందెదము ఎన్నో మేలులూ – ప్రభువా నీ పాద సన్నిధిలో (2) ||మా ఊహలు|| / నిన్నడుగకుండగనే – మోషేను పిలచితివి / నిన్నడిగిన సొలోమోనుకు – జ్ఞాన సిరుల నొసగిన దేవా (2) / పలు సమయముల యందు – పలు వరముల నిచ్చితివి (2) / అడుగనేల ప్రభువా ఈ ధరలో – నీ దివ్య కృపయే చాలు ||మా ఊహలు|| / ప్రార్ధించుచుంటిమి – సమస్యలు తీర్చమని / నిన్నడుగుచున్నాము నీ – రాజ్యములో చోటిమ్మని (2) / ఊహించు వాటికంటె – అధికముగా నిచ్చెడి దేవా (2) / ఇంతకంటె మాకేమి వలదు – నీ తోడు నీడే చాలు ||మా ఊహలు||
స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా / స్తుతులందుకో పూజార్హుడా (2) / ఆకాశమందు నీవు తప్ప / నాకెవరున్నారు నా ప్రభు (2) ||స్తుతి|| / నా శత్రువులు నను తరుముచుండగా / నా యాత్మ నాలో కృంగెనే ప్రభు (2) / నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనే / శత్రువుల చేతినుండి విడిపించినావు / కాపాడినావు (2) ||స్తుతి|| / నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి / దూరాన నిలిచేరు నా ప్రభూ (2) / నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగై / నను నిల్పెను నీ సన్నిధిలో / నీ సంఘములో (2) ||స్తుతి||
ఎంత దూరమైనా అది ఎంత భారమైనా (2) / యేసు వైపు చూడు నీ భారమంత తీరు (2) / తీరానికి చేరు (2) ||ఎంత|| / నడచి నడచి అలసిపోయినావా / నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా (2) / కలువరి గిరి దనుక సిలువ మోసిన / నజరేయుడేసు నీ ముందు నడవగా (2) ||యేసు|| / తెలిసి తెలిసి జారిపోయినావా / తెలియరాని చీకటిలో చిక్కుబడినావా (2) / నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే / పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా (2) ||యేసు||
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే / నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా ||నీ ధనము|| / ధరలోన ధన ధాన్యముల నీయగా / కరుణించి కాపాడి రక్షింపగా (2) / పరలోక నాధుండు నీకీయగా / మరి యేసు కొరకీయ వెనుదీతువా ||నీ ధనము|| / పాడిపంటలు ప్రభువు నీకీయగా / కూడు గుడ్డలు నీకు దయచేయగా (2) / వేడంగ ప్రభు యేసు నామంబును / గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా ||నీ ధనము|| / వెలుగు నీడలు గాలి వర్షంబులు / కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2) / వెలిగించ ధర పైని ప్రభు నామము / కలిమి కొలది ప్రభున కర్పింపవా ||నీ ధనము|| / కలిగించె సకలంబు సమృద్దిగా / తొలగించె పలుభాధ భరితంబులు (2) / బలియాయె నీ పాపముల కేసువే / చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||నీ ధనము||