12 easter songs available. Lyrics in Roman and Telugu script.
యూదా రాజ సింహం తిరిగి లేచెను / తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను (2) / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) / హల్లెలూయా హల్లెలూయా / ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ (2) / మరణము జయించి లేచెన్ / మరణపు ముల్లును విరచెన్ (2) / మధురం యేసుని నామం / మరువకు యేసుని ధ్యానం (2) / హే ప్రభు యేసు – హే ప్రభు యేసు / హే ప్రభు దేవా సుతా / సిల్వ ధరా, పాప హరా, శాంతి కరా / హే ప్రభు యేసు – హే ప్రభు యేసు / ఖాళీ సమాధిలో మరణమును / ఖైదీగా జేసిన నీవే గదా (2) / ఖాలమయుడగు సాతానుని గర్వము (2) / ఖండనమాయె గదా / సిల్వధరా పాపహరా శాంతికరా / హే ప్రభు యేసు – హే ప్రభు యేసు / గీతం గీతం జయ జయ గీతం / చెయ్యి తట్టి పాడెదము (2) / యేసు రాజు లేచెను హల్లెలూయా / జయ మార్భటించెదము (2) / చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను / అందు వేసిన ముద్ర కావలి నిల్చెను / దైవ సుతుని ముందు / జయ జయ యేసు – జయ యేసు / జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2) / జయ జయ రాజా – జయ రాజా (2) / జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం / సమాధి గెల్చిన జయ యేసు / సమాధి ఓడెను జయ క్రీస్తు (2) / సమరము గెల్చిన జయ యేసు (2) / అమరముర్తివి జయ యేసు / జయ జయ యేసు – జయ యేసు / జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు / పరమ జీవము నాకు నివ్వ / తిరిగి లేచెను నాతో నుండ (2) / నిరంతరము నన్ను నడిపించును / మరల వచ్చి యేసు కొనిపోవును (2) / యేసు చాలును – యేసు చాలును / యే సమయమైన యే స్థితికైన / నా జీవితములో యేసు చాలును / ముక్తినిచ్చె యేసు నామం / శాంతినిచ్చె యేసు నామం (2) / జై జై ప్రభు యేసుకు / జై జై క్రీస్తు రాజుకే / మరణమును గెల్చి మము రక్షించి / విజయము నిచ్చెనుగా / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా / ప్రాణము పెట్టిన దేవుడు / రక్షణనిచ్చిన దేవుడు / మరణము గెల్చిన దేవుడు / మృతులను లేపిన దేవుడు / దేవుడు దేవుడు యేసే దేవుడు / మన దేవుడు దేవుడు యేసే దేవుడు / సిలువలో ప్రాణం పెట్టాడన్నా / మరణం గెలిచి లేచాడన్నా (2) / మహిమ ప్రభు మృత్యుంజయుడు / క్షమియించును జయమిచ్చును (2) / ఓరన్న… ఓరన్న / యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న / యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా / యేసే ఆ దైవం చూడన్నా (2) / యేసే ఆ దైవం చూడన్నా – (2)
రాతి సమాధిలో పాతిన మన యేసు / లేచెను ఈనాడు జై జై జై (2) / దేవాలయము మూడు దినముల లోపల (2) / పడద్రోసి నిలబెట్టె ప్రభు యేసుడు (2) / ఆ బండ నెవరు దొర్లించకుండనే / తెరువంగ బడి యుండె జై జై జై (2) ||రాతి|| / వేకువ జామున చీకటి యుండగ (2) / ఏతెంచిరా కాంతలు ఆ చోటకు (2) / ఘుమ ఘుమలాడు సుగంధాలు కొని రాగా / ముందే లేచియుండె జై జై జై (2) ||రాతి|| / ఆ మింట నున్న నా తండ్రి కడకు (2) / నేనిపుడేగెద నన్నంటకు (2) / తొలిసారి మరియకు కనిపించి పలికెను / ఉల్లాసమాయెను జై జై జై (2) ||రాతి||
జయం జయం మన యేసుకే / మరణం గెలిచిన క్రీస్తుకే (2) / స్తుతులర్పించెదము – స్తోత్రము చేసెదము (2) / పునరుత్ధానుడైన క్రీస్తుని / మహిమపరచెదము (2) ||జయం జయం|| / పాపములేని యేసుడు / సిలువలో పాపికై మరణించి (2) / మూడవదినమున – తిరిగి లేచెను (2) / మరణపు ముల్లును విరిచెను (2) ||జయం జయం|| / పాపము చేసి మానవుడు / కోల్పోయిన అధికారమును (2) / సిలువను గెలిచి – తిరిగి తెచ్చెను (2) / సాతాను బలమును గెలిచెను (2) ||జయం జయం|| / పాపము విడిచి సోదరా / ప్రభు సన్నిధికి రారమ్ము (2) / పునరుత్ధాన శక్తితో నింపి (2) / పరలోకమునకు చేర్చును (2) ||జయం జయం||
హల్లేలూయని పాడరండి / విజయుడైన యేసునకు (2) / మరణము గెలిచె గదా / మహిమతో లేచె గదా (2) / పాప బలము మరణ భయము / లేదు ఈ జగతిలో (2) / మరణపు ముళ్ళు విరిచివేసెను (2) / నిత్య జీవమిచ్చెనుగా / ఖాళి సమాధి కనుపరచెనుగా / పునరుత్తాన వార్తను (2) / జీవము నిండిన దేవుడిలలో (2) / యేసు క్రీస్తు ప్రభువొక్కడే
మరణము గెలిచెను మన ప్రభువు / మనుజాళి రక్షణ కోసము (2) / ఎంత ప్రేమ, ఎంత త్యాగం / జయించె సమాధిని (2) / పాపపు ఆత్మల రక్షణకై / గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై (2) / నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు (2) / ఎంత జాలి, ఎంత కరుణ / యికను మన పైన (2) / నేడే పునరుద్దాన దినం / సర్వ మానవాళికి పర్వ దినం (2) / పాపపు చెర నుండి విడుదల (2) / ఎంత ధన్యం, ఎంత భాగ్యం / నేడే రక్షణ దినం (2)
నేడు యేసు లేచినాడు / నేడు యేసు లేచినాడు / మనమానందము నొందుదాము (2) ||నేడు|| / పరలోకము నుండి దూతలు / దిగి వచ్చిరి సమాధికి (2) / భద్రముగా చేసిరిగా / బహు భద్రముగా చేసిరిగా ||నేడు|| / మగ్దలేనే మరియ వేరొక మరియ / సుగంధ తైలము తెచ్చుకొని (2) / పూయుటకు వెళ్లిరిగా / బహు పూయుటకు వెళ్లిరిగా ||నేడు|| / వేకువ జామున యేసు ప్రభుండు / తోటలో సంచరింపంగ (2) / తోటమాలి అనుకొనెను / బహు తోటమాలి అనుకొనెను ||నేడు|| / నేను ఇంకను తండ్రి యొద్దకు / త్వరగా వెళ్లిపోలేదు (2) / కనుక నన్ను ముట్టవద్దు / మరియమ్మ నన్ను ముట్టవద్దు ||నేడు||
లేచినాడురా / సమాధి గెలచినాడురా (2) యేసు / లేతునని తా చెప్పినట్లు (2) / లేఖనములలో పలికినట్లు ||లేచినాడురా|| / భద్రముగా సమాధిపైన / పెద్ద రాతిని ఉంచిరి భటులు (2) / ముద్ర వేసి రాత్రి అంతా (2) / నిద్ర లేక కావలియుండ ||లేచినాడురా|| / పాప భారము లేదు మనకు / మరణ భయము లేదు మనకు (2) / నరక బాధ లేదు మనకు (2) / పరమ తండ్రి యేసు ప్రభువు ||లేచినాడురా|| / యేసునందే రక్షణ భాగ్యం / యేసునందే నిత్య జీవం (2) / యేసునందే ఆత్మ శాంతి (2) / యేసునందే మోక్ష భాగ్యం ||లేచినాడురా|| / పాపులకై వచ్చినాడు / పాపులను కరుణించినాడు (2) / పాపులను ప్రేమించినాడు (2) / ప్రాణ దానము చేసినాడు ||లేచినాడురా||
లేచినాడయ్యా / మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా (2) / పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు / మహిమా స్వరూపుడై లేచినాడయ్యా / విజయుడై జయశీలుడై / సజీవుడై పరిశుద్ధాత్ముడై (2) / క్రీస్తు లేచెను హల్లెలూయా / సాతాను ఓడెను హల్లేలూయా / క్రీస్తు లేచెను హల్లెలూయా / మరణాన్ని గెలిచెను హల్లేలూయా ||లేచినాడయ్యా|| / శ్రమలనొందెను సిలువ మరణమొందెను / లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను (2) / విజయుడై జయశీలుడై / సజీవుడై పరిశుద్ధాత్ముడై (2) ||క్రీస్తు|| / జీవ మార్గము మనకు అనుగ్రహించెను / మన పాపములన్ని తుడిచివేసెను (2) / ప్రేమయై మనకు జీవమై / వెలుగునై మంచి కాపరియై (2) ||క్రీస్తు||
పునరుత్థానుడా నా యేసయ్యా (2) / మరణము గెలిచి బ్రతికించితివి నన్ను (2) / స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు / ఆరాధించెద నీలో జీవించుచు (2) / నీ కృప చేతనే నాకు / నీ రక్షణ భాగ్యము కలిగిందనీ (2) / పాడనా… ఊపిరి నాలో ఉన్నంతవరకు (2) / నా విమోచకుడవు నీవేనని / రక్షణానందం నీ ద్వార కలిగిందనీ (2) ||స్తుతి|| / నే ముందెన్నడు వెళ్ళని / తెలియని మార్గం నాకు ఎదురాయెనే (2) / సాగిపో …. నా సన్నిధి తోడుగా వచ్చుననినా (2) / నీ వాగ్ధానమే నన్ను బలపరచెనే / పరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే (2) ||స్తుతి|| / చెరలోనైన స్తుతి పాడుచు / మరణము వరకు నిను ప్రకటించెదా (2) / ప్రాణమా … కృ౦గిపోకే ఇంకొంత కాలం (2) / యేసు మేఘాలపై త్వరగా రానుండగా / నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా (2) ||స్తుతి||
యేసయ్యా ప్రాణ నాథా – ఎంతో మంచోడివయ్యా / సిలువలో ప్రాణం పెట్టినావయ్యా / రక్తమిచ్చి కొన్నావయ్యా యేసయ్యా / నన్ను.. రక్తమిచ్చి కొన్నావయ్యా యేసయ్యా / మరణాంధకారములో పడియున్న వేళ / ఉదయించినావు ఓ నీతి సూర్యుడా (2) / కురిసింది కల్వరి ప్రేమ నీ రుధిర ధారలై (2) / నిను వీడి క్షణమైనా నే బ్రతుకలేను (2) ||యేసయ్యా|| / మరణ పాశాలన్ని ఛేదించినావు / ప్రేమ పాశాలతో దీవించినావు (2) / నీ ప్రేమ బానిసగా నను చేసుకున్నావు (2) / మోడైన నా బ్రతుకు చిగురింపజేశావు (2) ||యేసయ్యా|| / మృతిని గెల్చి లేచావు మహిమను దాల్చావు / ఈ మట్టి దేహాన్ని మహిమతో నింపావు (2) / నా సృష్టికర్తవు నా క్రీస్తు నీవు (2) / రానున్న రారాజు నీ వధువు నేను (2) ||యేసయ్యా||
సజీవుడవైన యేసయ్యా / నిన్నాశ్రయించిన నీ వారికి / సహాయుడవై తృప్తి పరచితివే / సముద్రమంత సమృద్ధితో (2) / ఆనందించెద నీలో – అనుదినము కృప పొంది / ఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో (2) / ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యము / దాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు (2) / శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి / శ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2) ||సజీవుడవైన|| / క్షేమము నొందుటయే – సర్వ జనులకు – ప్రయాసగా మారే / క్షేమాధారము నీవై – దీర్ఘాయువుతో – సంతృప్తి పరతువు నన్ను (2) / నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే / నిత్యమైన నీ సత్య వాక్యముతో (2) ||సజీవుడవైన|| / నలువది ఏండ్లు – నీ స్వాస్థ్యమును – మోసినది నీవే / నీ కృప కాంతిలో – నా చేయి విడువక – నడిపించుచున్నది నీవే (2) / పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే / పరిపూర్ణమైన నీ ఉపదేశమును (2) ||సజీవుడవైన||
గీతం గీతం జయ జయ గీతం / చేయి తట్టి పాడెదము (2) / యేసు రాజు లేచెను హల్లెలూయ / జయ మార్భటించెదము (2) || గీతం|| / చూడు సమాధిని మూసినరాయి / దొరలింపబడెను / అందు వేసిన ముద్ర కావలి నిల్చెను / దైవ సుతుని ముందు || గీతం|| / వలదు వలదు యేడువవలదు / వెళ్ళుడి గలిలయకు / తాను చెప్పిన విధమున తిరిగి లేచెను / పరుగిడి ప్రకటించుడి || గీతం|| / అన్న కయప వారల సభయు / అదరుచు పరుగిడిరి / ఇంక దూత గణముల ధ్వనిని వినుచు / వణకుచు భయపడిరి || గీతం|| / గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి / జయ వీరుడు రాగా / మీ మేళతాళ వాద్యముల్ బూర / లెత్తి ధ్వనించుడి || గీతం||