2 communion songs available. Lyrics in Roman and Telugu script.
యేసువా.. యేసువా.. / యేసువా నా యేసువా (2) / మీ జ్ఞాపకార్థముగా భుజించుచున్నాము / మీ దివ్య దేహమును / తమ ఆజ్ఞానుసారముగా పానము చేసెదము / మీ తీరు రుధిరమును ||యేసువా|| / ఆనాడు మీ దేహమును హింసించి చంపితిమి (2) / ఈనాడు ఆ దేహమే మేము గాచుచుండెనుగా (2) / మేము గాచుచుండెనుగా ||యేసువా|| / ఆనాడు మీ రక్తమును చిందింప చేసితిమి (2) / ఈనాడు ఆ రక్తమే మేము శుద్ధి పరచెనుగా (2) / మేము శుద్ధి పరచెనుగా ||యేసువా|| / మా పాప భారమును సిలువగ మోసితివి (2) / మార్గము చూపితివి రక్షణ నొసగితివి (2) / రక్షణ నొసగితివి ||యేసువా||
నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా (2) / విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా (2) ||నీ చేతిలో|| / తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును / ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి (2) ||నీ చేతిలో|| / అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు / ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి (2) ||నీ చేతిలో|| / హింసకుడు దూషకుడు హానికరుడైన / సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి (2) ||నీ చేతిలో||