115 christmas songs available. Lyrics in Roman and Telugu script.
క్రీస్తేసు పుట్టెను.. లోక రక్షకునిగా.. / పశులపాక పావనమై.. పరవశించెనుగా… / పరవశించెనుగా… / క్రీస్తేసు పుట్టెను లోక రక్షకునిగా / పశులపాక పావనమై పరవశించెనుగా / గొర్రెల కాపరులు సంతోషముతో / గంతులు వేసెను ఆనందముతో (2) / తూర్పు దిక్కున చుక్క వెలిసెను / లోక రక్షకుడు భువికి వచ్చెను (2) ||క్రీస్తేసు|| / హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ / మెర్రి మెర్రి క్రిస్మస్ / ఆదివాక్యము శరీరధారియై లోకమందు సంచరించెను / చీకటిని చీల్చి జనులందరికి వెలుగును ప్రసాదించెను (2) / పాపములు తీసి పరిశుద్ధపరచి రక్షణ వరమందించే / ఆ యేసు రాజును స్తుతియించి ఘనపరచ రారండి (2) ||తూర్పు దిక్కున|| / సంతోషము సమాధానము కృపా కనికరము / మన జీవితములో ప్రవేశించెను బహుదీవెనకరము (2) / సంబరాలతో సంతోషాలతో వేడుకొన రారండి / బంగారము సాంబ్రాణి బోళము సమర్పించ రారండి (2) ||తూర్పు దిక్కున||
క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి / దేవాది దేవుడు వెలసెను ఈ ధరణిలో (2) / ఆనందము మహదానందము / సంతోషము బహు సంతోషము (2) / మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ / హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ (2) ||క్రిస్మస్|| / శోధనలేమైనా – బాధలు ఎన్నైనా / రండి క్రీస్తు నొద్దకు… / రక్షణ ఇచ్చెను – ప్రభువైన యేసు నాథుడు (2) ||ఆనందము|| / చింతయే నీకున్నా – శాంతియే కరువైనా / రండి క్రీస్తు నొద్దకు… / నెమ్మది ఇచ్చెను – ప్రియమైన దైవ తనయుడు (2) ||ఆనందము||
బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి / ఊహలకు అందని అద్భుతము జరిగెను / లోక చరిత మార్చిన దైవకార్యము / కన్య మరియ గర్భమందు శిశువు పుట్టెను / అహహ్హ ఆశ్చర్యము ఓహొహ్హో ఆనందము / రారాజు యేసు క్రీస్తుని జననము / అహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యము / సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము / నన్నాన నా.. నా.. నా న నా న నా (4) / తనన్న నన్నాన నా – (3) తనననా (2) / ధన్యులం హీనులం మనము ధన్యులం / దైవమే మనల కోరి దరికి చేరెను / మనిషిగా మన మధ్య చేరె దీన జన్మతో / పశువుల తొట్టెలోన నిదుర చేసెను / అంటూ బాల యేసుని చూడ వచ్చి గొల్లలు / మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి ||బేత్లెహేము || / పుట్టెను యూదులకు రాజు పుట్టెను / వెతికిరి ఆ రాజు జాడ కొరకు వెతికిరి / నడిపెను ఆకశాన తార కనపడి / నిలిచెను యేసు ఉన్న చోటు తెలిపెను / తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు / యేసు చెంత మోకరించి కానుకలర్పించిరి ||బేత్లెహేము || / దొరికెను రక్షకుడు మనకు దొరికెను / తోడుగా ఇమ్మానుయేలు మనకు దొరికెను / దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను / యేసుని రూపమే మనకు సాక్ష్యము / యేసు జన్మ నింపెను లోకమంత సంబరం / నింపెను నిరీక్షణ కృపయు సమాధానము ||బేత్లెహేము ||
తార జూపిన మార్గమదే… జ్ఞానులు చేరిన గమ్యమదే… / గొల్లలు గాంచిన స్థానమదే… లోక రక్షకుని గూర్చినదే… / ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది (2) / ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా.. / ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా…. / తార జూపిన మార్గమదే – జ్ఞానులు చేరిన గమ్యమదే / గొల్లలు గాంచిన స్థానమదే – లోక రక్షకుని గూర్చినదే (2) / ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది / పరిశుద్ధ ప్రవక్తలు పలికినది – పరలోక సైన్యము పాడినది (2) / ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా.. / ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయ.. / ఆహా హల్లెలూయా.. ఆహా హల్లె.. లూయా.. ||తార జూపిన|| / దైవాజ్ఞను ధిక్కరించుటయే – పాపము ఓ సోదరా / ఆ పాపముతో లోకమంతా – నిండిపోయెను సోదరీ (2) / పాపమేమో మరణమును వెంట దెచ్చెగా / ఆ మరణమేమో నీకు నాకు సంక్రమించెగా / భయము లేదు మనకింకా ఓ సోదరా / అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా / భయము లేదు మనకింకా ఓ సోదరీ / అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా.. ఆ.. ఆ.. ఆ.. ||ఆహా హల్లెలూయా|| / దైవ చిత్తము నెరవేర్చుటకే – క్రీస్తేసు పరము వీడగా / పాప రుణమును చెల్లించుటకై – పావనుడే పుడమి చేరెగా (2) / సిలువలో సాతాను తల చితకద్రొక్కెగా / రుధిరమిచ్చి నిన్ను నన్ను శుద్ధి చేయగా / బంధకములు తెంపబడెగా ఓ సోదరా / సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా / బంధకములు తెంపబడెగా ఓ సోదరీ / సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా.. ఆ.. ఆ.. ఆ.. ||ఆహా హల్లెలూయా|| / దైవ వాక్యము బోధించుటకు – పావనాత్మ పంపబడెగా / లోక పాపము ఒప్పించుటయే – ఆదరణకర్త కార్యమాయెగా (2) / అంధకారమంత బాపి వెలుగు నిచ్చుగా / అనుదినము నిన్ను నన్ను నడిపించునుగా / సందేహమేల సమయమిదే ఓ సోదరా / నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా / సందేహమేల సమయమిదే ఓ సోదరీ / నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా… ఆ.. ఆ.. ఆ.. ||ఆహా హల్లెలూయా||
కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం / లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం / దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను / దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము / లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం – (2) ||కోటి కాంతుల|| / రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా / మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా (2) / మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను / ఆ వరమునే తను విడచెను నరరూపిగా వెలసెను / సృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చెనా / శోధనా బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా / ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే – (2) ||కోటి కాంతుల|| / మహిమగల మహిమోన్నతుడు పశువులశాలలో పసివానిగా / కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా (2) / ఏనాటికి మన తోడుగా ఉండాలని అండగా / ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించెగా / అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగా / ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించెగా / సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే – (2) ||కోటి కాంతుల||
తారా వెలిసెను ఈ వేళ / యేసు పుట్టిన శుభవేళ (2) / వెలిగెను ఈ లోకం – మదిలో నిండెను ఆనందం / తరగని రక్షణను – మనకై తెచ్చెను ఆ దైవం (2) / రండి వార్తను చాటుదాము / ఆ రక్షణను పంచుదాము (2) ||తారా|| / పశుల పాకే పావనమాయె / మంద గొల్లలే తన వారాయె (2) / జ్ఞానులొచ్చిరి ఆరాధింప / రాజులలో భీతిని నింప (2) ||తారా|| / పాపమెరుగని నీతి పరుడు / లోకమును కాచే రక్షకుడు (2) / కన్య మరియా గర్భమున / పుట్టెను దేవుని అంశమున (2) ||తారా|| / రాజులకు రాజైన తనకు / ఇచ్చుటకు ఏమున్నది మనకు (2) / వెండి బంగారముల కన్నా / హృదములనర్పిస్తే మిన్నా (2) ||తారా||
క్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమే / రాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకేతెంచెలే (2) / ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే / ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2) ||క్రిస్మస్ కాలం|| / పరిశుధ్ధుడు జన్మించెను – పశువుల పాకలో / లోకాలనేలే రారాజుగా – ఆ బెత్లేహేములో (2) / యూదా గోత్రములో – ఒకతార కాంతిలో (2) ||క్రిస్మస్ కాలం|| / కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తను / బంగారు సాంబ్రాణి బోళములు – అర్పించిరి జ్ఙానులు (2) / దూతలు స్త్రోత్రించిరి – ఆ ప్రభుని ఘనపరచిరి (2) ||క్రిస్మస్ కాలం|| / ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా / మన పాప పరిహార బలియార్ధమై గొఱ్ఱేపిల్లగా / ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా / మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా (2) / ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే / ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2) ||క్రిస్మస్ కాలం||
క్రిస్మస్ ఆనందం సంతోషమే / నా యేసుని జన్మదినమే / యూదుల రాజుగ జన్మించెనే / పశులతొట్టెలో పరుండబెట్టెనే (2) / క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ / క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం|| / సంతోషం సంబరం – రాజులకు రాజు పుట్టెను / ఆనందం మనకు అనుదినం – ఇక ఇమ్మానుయేలు వచ్చెను (2) / క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ / క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం|| / గొల్లలు జ్ఞానులు – దర్శించి పూజించిరి / విలువైన కానుకలను – అర్పించి ప్రణమిల్లిరి (2) / క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ / క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం|| / ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త – బలవంతుడైన దేవుడు / నిత్యుడగు తండ్రి సమధాన కర్త – ఇమ్మనుయేలు యేసుడు (2) / క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ / క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం||
వినరే యో నరులారా – వీనుల కింపు మీర / మనల రక్షింప క్రీస్తు – మానుజావతారుడయ్యె – వినరే / అనుదినమును దే-వుని తనయుని పద / వనజంబులు మన-మున నిడికొనుచును ||వినరే|| / నర రూపు బూని ఘోర – నరకుల రారమ్మని / దురితము బాపు దొడ్డ – దొరయౌ మరియా వరపుత్రుడు / కర మరు దగు క-ల్వరి గిరి దరి కరి / గి రయంబున ప్రభు – కరుణను గనరే ||వినరే|| / ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్ష / బూని తన మేని సిలువ – మ్రాను నణచి మృతి బొందెను / దీన దయా పరు-డైన మహాత్ముడు / జానుగ యాగము – సలిపిన తెరంగిది ||వినరే|| / ఇల మాయావాదుల మాని – యితడే సద్గురు డని / తలపోసి చూచి మతి ని-శ్చల భక్తిని గొలిచిన వారికి / నిల జనులకు గలు-ములనలరెడు ధని / కుల కందని సుఖ-ములు మరి యొసఁగును ||వినరే|| / దురితము లణప వచ్చి – మరణమై తిరిగి లేచి / నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగ జనె / బిరబిర మన మం-దర మా కరుణా / శరనిధి చరణ మె – శరణని పోదము ||వినరే||
సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి / యొక వింతగు కీర్తన బాడ వచ్చితిని / సంతోషించుడి నాతో సంతోషించుడి ||సంతోషించుడి|| / అంధకార మయమైన భూమి నా / ద్యంతము వెలిగింప – దాని యా-వేశము దొలఁగింప / వందితుండు క్రీస్తేసు నాథుడు – వచ్చె బ్రకాశుండై / భూమికి నిచ్చె ప్రకాశంబు ||సంతోషించుడి|| / కాన నంధకారంబు దొలఁగఁ ప్ర / కాశించెను లెండు – మీరు ప్ర-కాశింపను రెండు / మానవులను సంతోష పర్చనై – మహిని నవతరించె / భక్తుల మనము సంతసించె ||సంతోషించుడి|| / మిన్ను నుండి సంతోషోదయము / మిగుల ప్రకాశించె – హృదయములఁ – దగుల ప్రకాశించె / మున్ను జేయబడిన వాగ్ధత్థము – తిన్నగ నెరవేరే / భక్తుల కన్ను లాస దీరె ||సంతోషించుడి|| / ప్రీతియైన నీ పండుగ గూర్చి / నూతన కీర్తనను – గలసికొని – నాతో పాడుచును / నీ తరి దూరస్థుల-కీ వార్తను – నే తీరును నైనఁ / దెలుపఁగ నాతురపడవలెను ||సంతోషించుడి|| / పాపులపై దేవునికి గలిగిన / ప్రబలమైన దయను – లోకమునఁ – జూపింపఁ గవలెను / జూపక పోయిన లోపము మనపై – మోపబడును నిజము / వేగము జూపుద మా పథము ||సంతోషించుడి||
పూరబ్ దిశా మే చమ్కా ఏక్ తారా / జగ్ సారా రోషన్ హువా / భక్తో కె సాగర్ దేఖే తో ఉస్కో / ఖుషియాయే ఝూమ్ ఉఁటే (2) / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) / బేతలెహెమ్ మే జబ్ జియా యా / ఈశు జో జనమ్ లియా / ఆకాష్ మే దూర్ చమ్కా తో సారా / ఆలం భీ రోషన్ హువా (2) ||పూరబ్|| / పండిత్ పూజారి ఏక్ సాత్ మిల్ కర్ / గుడియా కే అందర్ చలే / ప్రభూ కి దర్శన్ పాతే హీ అప్నే / సర్ కో ఝుకాకే ఖడే (2) ||పూరబ్|| / మసీహా కే పావన్ చరనో మే ఆకర్ / భక్తో నే ఐసా కియా / ధన్ దౌ-లత్ ఔర్ అప్నా సబ్ కుచ్ / ప్రభు కో నిచ్చావర్ కియా (2) ||పూరబ్||
లాలి లాలి జోలాలి – బాల యేసునకు లాలి / కన్య మరియా తనయునకు – పాడ రండి జోలాలి (2) / లోక రక్షకునకు లాలి – శాంతి కర్తకు జోలాలి (2) / మాదు తండ్రికి మా లాలి (2) ||లాలి|| / చీకటి దొంతరల తెరలకు – తెరను దింపగా వచ్చినావని / పాప శాపపు తాపములకు – రక్షణను ఇల తెచ్చినావని (2) / మానవుల మోచకుడా లాలి – ధరణిఁ పై దైవమా జోలాలి (2) / మాదు తండ్రికి మా లాలి (2) ||లాలి|| / దారి తెలియని మానవాళికి – దారి నీవై వెలసినావని / మరణ ఛాయలు రూపుమాపగ – జీవ కిరణమై మెరిసినావని (2) / సత్య రూపునకు లాలి – నీతి సూర్యునకు జోలాలి (2) / మాదు తండ్రికి మా లాలి (2) ||లాలి||