క్రిస్మస్ | Christmas Telugu Songs

115 christmas songs available. Lyrics in Roman and Telugu script.

శ్రీ యేసుండు జన్మించె|Sri Yesundu Janminche

శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2) / నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2) ||శ్రీ యేసుండు|| / ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2) / ఇమ్మానుయేలనెడి నామమందున (2) ||శ్రీ యేసుండు|| / సత్రమందున పశువులశాల యందున (2) / దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2) ||శ్రీ యేసుండు|| / పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2) / పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2) ||శ్రీ యేసుండు|| / గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2) / దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2) ||శ్రీ యేసుండు|| / మన కొరకొక్క శిశువు పుట్టెను (2) / ధరను మన దోషములబోగొట్టెను (2) ||శ్రీ యేసుండు|| / పరలోకపు సైన్యంబు గూడెను (2) / మింట వర రక్షకుని గూర్చి పాడెను (2) ||శ్రీ యేసుండు|| / అక్షయుండగు యేసు పుట్టెను (2) / మనకు రక్షణంబు సిద్ధపరచెను (2) ||శ్రీ యేసుండు||

ఓ సద్భక్తులారా|O Sadbhaktulaaraa

ఓ సద్భక్తులారా – లోక రక్షకుండు / బెత్లేహేమందు నేడు జన్మించెన్ / రాజాధి రాజు – ప్రభువైన యేసు / నమస్కరింప రండి నమస్కరింప రండి / నమస్కరింప రండి ఉత్సాహముతో / సర్వేశ్వరుండు – నర రూపమెత్తి / కన్యకు బుట్టి నేడు వేంచేసెన్ / మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూ / నీకు నమస్కరించి నీకు నమస్కరించి / నీకు నమస్కరించి పూజింతుము / ఓ దూతలారా – ఉత్సాహించి పాడి / రక్షకుండైన యేసున్ స్తుతించుడి / పరాత్పరుండా – నీకు స్తోత్రమంచు / నమస్కరింప రండి నమస్కరింప రండి / నమస్కరింప రండి ఉత్సాహముతో / యేసు ధ్యానించి – నీ పవిత్ర జన్మ / ఈ వేల స్తోత్రము నర్పింతుము / అనాది వాక్య – మాయే నర రూప / నమస్కరింప రండి నమస్కరింప రండి / నమస్కరింప రండి ఉత్సాహముతో

ఇళ్లలోన పండుగంట|Illalona Panduganta

ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట / ఎందుకో ఎందుకే కోయిలా / చెప్పవే చెప్పవే కోయిలా / మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసె నేడు / ఎందుకో ఎందుకే కోయిలా / చెప్పవే చెప్పవే కోయిలా / ఆ… అర్దరాత్రి కాలమందు వెన్నెల… ఆహా / ఆశ్చర్యకరుడంట వెన్నెల… ఆహా (2) / జన్మించినాడంట వెన్నెలా / ఈ అవనిలోనంట వెన్నెలా (2) ||ఇళ్లలోన|| / హా… ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా / చెప్పవే చెప్పవే కోయిలా (2) / ఆ… యూదా దేశమందు వెన్నెల… ఆహా / బెత్లెహేము పురమునందు వెన్నెల… ఆహా (2) / రాజులకు రాజంట వెన్నెలా / ఆ రాజు యేసంట వెన్నెల (2) ||ఇళ్లలోన|| / ఆహ… తార చూపు దారిలోనే వచ్చినారు ఎవ్వరే కోయిలా / చెప్పవే చెప్పవే కోయిలా (2) / ఆ తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల… ఆహా / దర్శింప వచ్చినారు వెన్నెల… ఆహా (2) / బంగారు సాంబ్రాణి బోళం / తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా (2) ||ఇళ్లలోన|| / ఆ… దివి నుండి ఈ భువికి వచ్చినాడు ఎందుకే కోయిలా / చెప్పవే చెప్పవే కోయిలా (2) / పాపులైన మనకోసం వెన్నెల… ఆహా / ప్రాణాన్ని అర్పించి వెన్నెల… ఆహా (2) / పరలోకానికి మార్గం వెన్నెలా / ఉచితంగా ఇచ్చినాడు వెన్నెలా (2) ||ఇళ్లలోన|| / హా.. పరలోకం చేరుటకై నేనేమి చెయ్యాలి కోయిలా / చెప్పవే చెప్పవే కోయిలా (2) / యేసయ్యను నమ్ముకో వెన్నెల… ఆహా / పాపాలను ఒప్పుకో వెన్నెల… ఆహా (2) / క్రొత్తగా జన్మించు వెన్నెలా / రక్షణను పొందుకో వెన్నెలా (2) ||ఇళ్లలోన||

దూత పాట పాడుడి|Dootha Paata Paadudi

దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి / ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున / భూజనంబు కెల్లను – సౌఖ్య సంభ్రమాయెను / ఆకసంబు నందున – మ్రోగు పాట చాటుడి / దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి / ఊర్ధ్వ లోకమందున – గొల్వగాను శుద్దులు / అంత్య కాలమందున – కన్య గర్భమందున / బుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభో / ఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమా / దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి / రావే నీతి సూర్యుడా – రావే దేవా పుత్రుడా / నీదు రాక వల్లను – లోక సౌఖ్య మాయెను / భూ నివాసులందరూ – మృత్యు భీతి గెల్తురు / నిన్ను నమ్ము వారికి – ఆత్మ శుద్ది కల్గును / దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి

అందాల తార|Andaala Thaara

అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో / అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ / ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో / ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార|| / విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగ దోచెను / వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున / విశ్వాలనేలెడి దేవ కుమారుని వీక్షించు దీక్షతో / విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల తార|| / యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు / ఎరిగిన దారి తొలగిన వేళ యెదలో కృంగితి / యేసయ్యతార యెప్పటివోలె యెదురాయె త్రోవలో / ఎంతో యబ్బుర పడుచు విస్మయ మొందుచు యేగితి స్వామి కడకు ||అందాల తార|| / ప్రభు జన్మ స్ధలము పాకయేగాని పరలోక సౌధమే / బాలుని జూడ జీవితమంత పావనమాయెను / ప్రభుపాదపూజ దీవెనకాగ ప్రసరించె పుణ్యము / బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్థన ||అందాల తార||

Christmas Telugu Songs — Page 10 | UEC Telugu Church