115 christmas songs available. Lyrics in Roman and Telugu script.
ఎర్రాటి సూరీడు పడమటికి పయణమైయ్యిండు / తెల్లాటి జాబిల్లి మల్లెవోలె వికసించింది / ఓరి ఐజాకు…. ఓఓ ఓఓ / లై లై లై .. లై లై లై / నల్లా నల్లాని చీకటి / ఓరి ఐజాకు.. తెల్లా తెల్లాని యెన్నెల (2) / నల్లా నల్లని నీ హృదయము / యేసుకిస్తే తెల్లగ మారును (2) / తూర్పున చుక్క బుట్టె పాకలో యేసు బుట్టె / దూతొచ్చి వార్త జెప్పె గొల్లాలు గంతులేసె / తూర్పున చుక్క బుట్టె పాకలో యేసు బుట్టె / దూతొచ్చి వార్త జెప్పె చేయి రా సందడి చేయి (2) / సీకట్ల సుక్క బుట్టెరో / ఓరి ఐజాకు.. బెత్లెహేము ఎలిగి పాయెరో (2) / నీ మనస్సులో యేసు బుడితే / నీ బతుకే ఎలిగి పొవును (2) ||తూర్పున చుక్క|| / చల్లా చల్లాని చలిరో / ఓరి ఐజాకు.. ఎచ్చా ఎచ్చాని మంటారో / చల్లగుంటే సల్లారి పొతవ్ / ఎచ్చగుంటే యేసుతో ఉంటవ్ (2) ||తూర్పున చుక్క|| / హోయి ల హోయి లా రే / హోయి ల హోయి లా రే / హోయి ల హోయి లా రే / హోయి ల హోయి లా రే (2) / నల్లా నల్లాని చీకటి / ఓరి ఐజాకు.. తెల్లా తెల్లాని యెన్నెల (2) / హోయి ల హోయి లా రే / హోయి ల హోయి లా రే / హోయి ల హోయి లా రే / హోయి ల హోయి లా రే (2)
జన్మించె జనంబులకు ఇమ్మానుయేలు / జన్మించె జనంబులను రక్షింపను (2) / జననమొందె బేత్లెహేము పురమున / జనంబులారా సంతసించుడి – సంతసించుడి ||జన్మించె|| / లేఖనములు తెల్పినట్లు దీనుడై / లోకేశుడు జన్మించెను ప్రసన్నుడై (2) / లాకమందు దూతలు బాక నాదంబుతో (2) / ఏక స్వరము తోడ పాడిరి (2) ||జన్మించె|| / నీతి సూర్యుడుదయించె నుర్విలో / పాతకంబులెల్ల వీడెను కాంతికి (2) / నీతి న్యాయ తీర్పును నూతన శక్తియు (2) / సంతసమప్పె దీన ప్రజలకు (2) ||జన్మించె||
నా నా నా న న న / నా నా నా న న న / నా నా నా న న న.. / న న న న నా (3) / రారండి జనులారా / మనం బేతలేం పోదామా / యూదుల రాజు జన్మించినాడు / వేవేగ వెళ్లుదమా / జన్మ తరియింప తరలుదమా.. / సర్వోన్నత స్థలములలోన / దేవునికి మహిమ అమెన్ ఆమెన్ / ఆయనకు ఇష్టులైన వారికి / సమాధానమెల్లపుడూ / రారండి జనులారా / మనం బేతలేం పోదామా / యూదుల రాజు జన్మించినాడు / వేవేగ వెళ్లుదమా / జన్మ తరియింప తరలుదమా.. / నా నా నా న న న / నా నా నా న న న / నా నా నా న న న.. / న న న న నా (2) / పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ / మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్ (2) / యేసు మనల ప్రేమిస్తూ పుట్టాడండోయ్ / మన పాపం కొరకు పుట్టాడండోయ్ (2) / యేసుని చేర్చుకో రక్షకునిగ ఎంచుకో (2) / పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ / మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్ (2) / పాడుడి గీతములు హల్లేలూయ / మీటుడి నాదములు హల్లేలూయ / పాప రహితుడు హల్లేలూయ / పాప వినాషకుడు హల్లేలూయా / ఆకశమున వింత గొలిపెను / అద్భుత తారను గాంచిరి (2) / పయణించిరి జ్ఞానులు ప్రభు జాడకు (2) / పాడుడి గీతములు హల్లేలూయ / మీటుడి నాదములు హల్లేలూయ / పాప రహితుడు హల్లేలూయ / పాప వినాషకుడు హల్లేలూయా / రాజులకు రాజు యేసయ్య / పశువుల పాకలో పుట్టాడయ్యా / రాజులకు రాజు యేసయ్య / నీ కొరకు నా కొరకు పుట్టాడయ్యా / గొల్లలు జ్ఞానులు వచ్చిరయ్యా / దూతలు పాటలు పాడిరయ్యా (2) / ఈ వార్తను చాటింప పోదామయ్యా (2) / పోదాము… అహా పోదాము… / పద పోదాము… మనం పోదాము… / పోదాము పోదాము పయణమవుదాము / శుభవార్త చెప్ప పోదాము (2) / అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము / శుభవార్త చాటి చెప్ప సాగిపోదాము (2) / పోదాము పోదాము పయణమవుదాము / శుభవార్త చెప్ప పోదాము (2) / శ్రీ యేసన్న నట రాజులకు రాజు అట (2) / రాజులందారికయ్యో యేసే రాజు అట (2) / పదరా హే పదరా హే / పదరా పోదాము రన్న / శ్రీ యేసుని చూడ / పదరా పోదాము రన్న (4) / నా నా నా న న న / నా నా నా న న న / నా నా నా న న న.. / న న న న నా (2)
క్రీస్తు పుట్టెను హల్లెలూయా (2) / జగమంతా పండుగాయెను – సర్వలోకానికి సందడాయెను (2) / చీకు చింత వీడిపోయె – చీకటంత తొలగిపోయె (2) / నవ్యకాంతులెగసె ఇలలో – దివ్యకాంతుడేసు రాకతో… / ఉల్లాసమే ఉత్సాహమే – జగమంతా జయోత్సాహమే (2) / చెట్టెక్కిన లంచగొండి జక్కయ్య / పాప శాపముతో నిండియుండగా / యేసు అడుగు పెట్టెను / ఆ ఇంటిలో – రక్షణకాంతులే విరజిల్లెను (2) ||చీకు చింత|| / గెరాసేను జనములలో కొందరు / రోగాలు దయ్యాలతో బాధనొందగా / యేసు అడుగుపెట్టెను / ఆ ఊరిలో – విడుదలకాంతులే ప్రకాశించెను (2) ||చీకు చింత|| / మరణమాయె యాయీరు కూతురు / వేదన రోదన కన్నీటిలో / యేసు అడుగుపెట్టెను / ఆ ఇంటిలో – జీవపుకాంతులే ప్రజ్వలిల్లెను (2) ||చీకు చింత|| / వేదనతో నలిగిపోవుచున్నావా / యేసు నీ కొరకై ఉదయించెను / లెమ్ము తేజరిల్లుమ్ము / నీ ఇంటికి – వెలుగు వచ్చియున్నది (2) ||క్రీస్తు పుట్టెను||
రాజు పుట్టెను రాజు పుట్టెను / లోకమంతా సందడి ఆయెను (2) / ఊరు వాడా పండుగాయెను (2) / కాంతులతో మెరసిపోయెను (2) / రాజు పుట్టెను మహారాజు పుట్టెను / లోకమంతా సందడి ఆయెను / దూతలు వెళ్లిరి గొల్లలకు తెల్పిరి / లోక రక్షకుడు పుట్టాడని (2) / అంధకారమైన బ్రతుకును మార్చుటకు / చీకటినుండి వెలుగులో నడుపుటకు (2) / రాజు పుట్టెను మహారాజు పుట్టెను / లోకమంతా సందడి ఆయెను ||రాజు పుట్టెను|| / జ్ఞానులు వెళ్లిరి యేసుని చూచిరి / సంతోషముతో ఆరాధించిరి (2) / మన జీవితము మార్చుకొనుటకు / ఇదియే సమయము ఆసన్నమాయెను (2) / రాజు పుట్టెను మహారాజు పుట్టెను / లోకమంతా సందడి ఆయెను ||రాజు పుట్టెను||
ఉదయించినాడు నా జీవితాన / నా నీతిసూర్యుడు నా యేసయ్యా / నా నీతిసూర్యుడు నా యేసయ్యా (2) / సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ / ఇష్టులైన వారికిల సమాధానము (2) ||ఉదయించినాడు|| / మతిలేని నా జీవితాన్ని – మరువలేదు నా మెస్సయ్యా (2) / మరియమ్మ గర్భాన జన్మించినాడు / మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా (2) / మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా ||ఉదయించినాడు|| / గురిలేని ఈ యాత్రలోన – గుర్తించి నన్ను పిలిచెను (2) / గుణవంతుడైన నా యేసయ్యనే / గురిగా నేను నిలుపుకుంటినే (2) / గురిగా నేను చేసుకుంటినే ||ఉదయించినాడు|| / కష్టాల కడగండ్లలోన కన్నీరు నే కార్చగా (2) / కడతేర్చుటకు కరుణామయునిగా / ఇలలో నాకై ఏతెంచెను (2) / ఇలలో నాకై ఏతెంచెను ||ఉదయించినాడు||
దూత పాట పాడుడీ – రక్షకున్ స్తుతించుడీ / ఆ ప్రభుండు పుట్టెను – బేత్లెహేము నందున / ఓ బేత్లెహేము గ్రామమా! సద్దేమిలేకయు / నీవొంద గాఢనిద్రపై – వెలుంగు తారలు / ఓ సద్భక్తులారా! లోక రక్షకుండు / బేత్లెహేమందు నేడు జన్మించెన్ / శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ సైన్యము / ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను / నమస్కరింప రండి నమస్కరింప రండి / నమస్కరింప రండి యుత్సాహముతో / ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు / పొలములలో తమ మందలను కాయుచునున్నప్పుడు / భూనివాసులందరు – మృత్యు భీతి గెల్తురు / నిన్ను నమ్మువారికి – ఆత్మ శుద్ధి కల్గును / జ్ఞానులారా మానుడింక యోచనలన్ జేయుట / మానుగాను వెదకుడేసున్ చూచుచు నక్షత్రమున్ / సద్దేమి లేక వచ్చెగా! ఈ వింత దానము / ఆరీతి దేవుడిచ్చుపై వరాల్ నరాళికి / రండి నేడు పుట్టినట్టి / రాజునారాధించుడి (2) / నీకు నమస్కరించి నీకు నమస్కరించి / నీకు నమస్కరించి పూజింతుము / యేసు పుట్టగానే వింత – (2) / ఏమి జరిగెరా దూతలెగసి వచ్చెరా – (2) / నేడు లోక రక్షకుండు – (2) / పుట్టినాడురా ఈ పుడమి యందున – (2) / పశువుల పాకలో పచ్చగడ్డి పరుపులో – (2) / పవళించెను… పవళించెను… / పవళించెను నాథుడు మన పాలిట రక్షకుడు – (2) / దూతల గీతాల మోత విను బేతలేమా / పరమ దూతల గీతాల మోత విను బేతలేమా / ఎన్నెన్నో యేడుల నుండి నిరీక్షించినట్టి – (2) / పరమ దూతల గీతాల మోత విను బేతలేమా – (2)
ఏలో ఏలో ఏలో అంటూ – వచ్చారండి గొల్లలు / సంతోషాలే పొంగేనండి – హైలెస్సా / దారే చూపే దేవుడొచ్చే – ఉల్లాసంగా ఊరు ఆడే / సంగీతాలే పాడాలండి – హైలెస్సా / అంధకారాన్ని తొలగించే మహనీయుడు / పుట్టినాడండి యేసయ్య మన దేవుడు / నిన్నే కోరి – నిన్నే చేరి / ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు ||ఏలో|| / లోకాలనేలేటి రారాజురా – ఉదయించే సూరీడై వచ్చాడురా / ఆకాశ వీధి – మెరిసేటి దారి – ఒక తార మురిసిందిగా (2) / దూతాళి పాడి – కొలిచారు చూడు – ఘనమైన ఒక వేడుక / ఆ గొల్లలేగా – దరువేసే చూడు – మెస్సయ్య పుట్టాడని / మన మెస్సయ్య పుట్టాడని ||ఏలో|| / వెన్నెల్లో పూసింది ఓ సందడి – పలికింది ఊరంతా ఈ సంగతి / ఈ దీనుడంట – పసిబాలుడంట – వెలిసాడు మహరాజుగా (2) / మనసున్నవాడు – దయ చూపువాడు – అలనాటి అనుబంధమే / కనులారా చూడు – మనసారా వేడు – దిగి వచ్చె మనకోసమే / ఇల దిగి వచ్చె మనకోసమే ||ఏలో|| / ఆ నింగి తారల్లా వెలగాలిరా – జగమంత చూసేలా బ్రతకాలిరా / వెలిగించు వాడు – మనలోని వాడు – నిలిచాడు మన తోడుగా (2) / సలి గాలి రాత్రి – పిలిసింది సూడు – మనలోన ఒక పండగ / భయమేల నీకు – దిగులేల నీకు – యేసయ్య మనకుండగా / మన యేసయ్య మనకుండగా ||ఏలో||
రాజులకే రారాజు పుట్టాడోయ్ / దివి నుంచి భువికే వచ్చాడోయ్ / ఊరూ వాడా కలిసి రారండోయ్ / సంబరాలు సంబరాలు చేయండోయ్… / అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని / పాటలు పాడి ఆరాధింప ఊరూ వాడా రండి రండి (2) / పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని (2) / ఆర్భాటించి చాటించి మోగించేద్దామా / సంబరాలు సంబరాలు చేసేద్దామా – (4) / పుట్టుకతోనే రాజై పుట్టిన రాజులకు రారాజు యేసయ్యని / సృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని (2) / జన్మ పాపమే లేనివాడని / నీదు భారము మోయువాడని (2) ||ఆర్భాటించి|| / వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు యేసయ్యని / కష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యని (2) / మార్గం సత్యము జీవం యేసని / మోక్ష ద్వారమై పుట్టినాడని (2) ||ఆర్భాటించి|| / సంబరాలు సంబరాలు చేసేద్దామా (5) / క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా
రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా / నిన్ను నన్ను పరముకు చేర్చ భువికొచ్చాడమ్మా (2) / పాపమే లేనోడమ్మా పాపుల రక్షకుడమ్మా / ప్రాణమియ్య వెనుకాడని ప్రేమామయుడోయమ్మా / మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా / జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా (2) / ప్రవక్తల ప్రవచనాలు నేరవేర్చాడమ్మా / మోడుబారిన బ్రతుకులలో దావీదు చిగురమ్మా (2) / బాలుడై వచ్చాడమ్మా భారమే మోసాడమ్మా / విడుదలనే ఇచ్చిన దేవుని గొర్రెపిల్లమ్మా ||మన కోసం|| / వినరే ప్రేమామయుని చరితం వినరే జనులారా / నమ్మితే చాలు మోక్షమునిచ్చును నమ్ము మనసారా (2) / వెల తానే చెల్లించి తన వారసులుగ ఎంచి / నిత్యం తనతో ఉండే భాగ్యమునిచ్చాడమ్మా ||మన కోసం||
సర్వోన్నత స్థలములలో సమాధానము / ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను (2) / హల్లెలూయా అర్పణలు – ఉల్లముతో చెల్లింతుమ్ / రాజాధి రాజునకు – హోసన్నా ప్రభువునకు (2) ||సర్వోన్నత|| / పశువుల పాకలో మనకు శిశువు జన్మించె / పొత్తిగుడ్డలలో చుట్టగ పవళించిన తండ్రి (2) / ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త (2) / నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు (2) ||హల్లెలూయా|| / మన వ్యసనములను బాప మొత్తబడుట కొరకై / మన సమాధానార్థ శిక్ష మోపబడుట కొరకై (2) / మన దోషము బాప – మానవరూపమున (2) / జనియించె బాలుండు ఇమ్మానుయేలుండు (2) ||హల్లెలూయా||
అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని చూడరే / పుడమియే పరవశించె పసిబాలుని చూడగనే… పసిబాలుని చూడగనే / ఆకాశమే పట్టనోడు – ధరణిలో పుట్టినాడు / దావీదు పురమునందు దీనుడై – వెలసినాడు రక్షకుడు (2) / ఆనందమే మహా ఆనందమే – అందరికి ఇలలో సంతోషమే / ఆశ్చర్యమే ఇది అద్భుతమే – యేసు జననం అద్భుతమే (2) / అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు / ఆది అంతమైన పరలోక నాథుడు (2) / ఆదియందు వాక్యంబుగా – సృష్టి కార్యము జరిగించినాడు / అనాది నుండి జ్ఞానంబుగా – సృష్టి క్రమము నడిపించినాడు (2) / అన్నిటిని కలిగించిన మహరాజు / కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు (2) ||ఆనందమే|| / ప్రేమను పంచే ప్రేమామయుడు / రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు (2) / పాపమే లేని సుగుణాల సుందరుడు / శాపము బాపను జన్మించెను చూడు (2) / నిత్యముండు నీతి సూర్యుడు – సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు / ప్రేమను పంచే పావనాత్ముడు – పశుల పాకలో పవళించినాడు (2) / సర్వాధికారియైన మహరాజు / దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు (2) ||ఆనందమే|| ||ఆకాశమే||