అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును (2)
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీ కోసమే – ఆశ్రయమైన నా యేసయ్యా ||అతిపరిశుద్ధుడా||
సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2)
ముందెన్నడూ చవిచూడని
సరిక్రొత్తదైన ప్రేమామృతం (2)
నీలోనే దాచావు ఈనాటికై
నీ ఋణం తీరదు ఏనాటికి (2) ||అతిపరిశుద్ధుడా||
సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2)
కృప వెంబడి కృప పొందగా
మారాను మధురముగా నే పొందగా (2)
నాలోన ఏ మంచి చూసావయ్యా
నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా (2) ||అతిపరిశుద్ధుడా||
సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక (2)
ఉన్నావులే ప్రతిక్షణమునా
కలిసున్నావులే ప్రతి అడుగున (2)
నీవేగా యేసయ్యా నా ఊపిరి
నీవేగా యేసయ్యా నా కాపరి (2) ||అతిపరిశుద్ధుడా||