21 songs found

హల్లేలూయా యని పాడి|Hallelooyaa Yani Paadi

హల్లేలూయా యని పాడి స్తుతింపను / రారే జనులారా మనసారా ఊరూరా / రారే జనులారా ఊరూరా నోరారా ||హల్లేలూయా|| / పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని (2) / కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని (2) / తోడు నిడగా నిన్ను కాపాడే నాధుడని (2) / పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా|| / బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని (2) / అన్నాదమ్ముళ్ల కన్నా ప్రియమైన దేవుడని (2) / కన్నాబిడ్డల కన్నా కన్నుల పండుగని (2) / పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా|| / రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని (2) / నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2) / నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2) / పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||

హీనమైన బ్రతుకు నాది|Heenamaina Brathuku Naadi

హీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని (2) / దాపు జేరితిని శరణు కోరితిని / దిక్కు నీవే నాకు ఇలలో / లేరు ఎవ్వరు నాయను వారు ||హీనమైన|| / మనిషికి మమత ఉన్నందుకా – గుండె కోత / మదిలో నిన్ను నింపుకున్నందుకా – విధి రాత (2) / కరుణించి నన్ను కష్టాలు బాపు (2) / కరుణామయా క్రీస్తేసువా ||హీనమైన|| / తల్లి తండ్రి కన్న మిన్న – నీ మధుర ప్రేమ / భార్య భర్తల కన్న మిన్న – మారని నీ ప్రేమ (2) / పాపి కొరకు ప్రాణమర్పించిన (2) / త్యాగ శీలివి నీకే స్తోత్రము ||హీనమైన|| / నిన్న నేడు రేపు యేసు – మారనే మారవు / లోకులంత మారిపోయిన – స్థిరమైన వాడవు (2) / వెరువను జడియను (2) / నీ కంటి పాపను నను కాచే దైవమా ||హీనమైన||

హృదయమనెడు తలుపు నొద్ద|Hrudayamanedu Thalupu Nodda

హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు / నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2) ||హృదయ|| / పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ / నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2) ||హృదయ|| / కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు / యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2) ||హృదయ|| / ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని / నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను (2) ||హృదయ|| / అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు / మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును (2) ||హృదయ|| / జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు / మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు (2) ||హృదయ|| / సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు / తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు (2) ||హృదయ|| / చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు / నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను (2) ||హృదయ|| / అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు / మీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ (2) ||హృదయ|| / బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు / గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి (2) ||హృదయ||

హే ప్రభుయేసు|Hey Prabhu Yesu

హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా / సిల్వధరా – పాపహరా – శాంతికరా ||హే ప్రభు|| / శాంతి సమాధానాధిపతీ / స్వాంతములో ప్రశాంతనిధీ (2) / శాంతి స్వరూపా జీవనదీపా (2) / శాంతి సువార్తనిధీ ||సిల్వధరా|| / తపములు తరచిన నిన్నెగదా / జపములు గొలిచిన నిన్నెగదా (2) / విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2) / సఫలత నీవెగదా ||సిల్వధరా|| / మతములు వెదకిన నిన్నెకదా / వ్రతములుగోరిన నిన్నెగదా (2) / పతితులు దేవుని సుతులని నేర్పిన (2) / హితమతి వీవెగదా ||సిల్వధరా|| / పలుకులలో నీ శాంతికధ / తొలకరి వానగా కురిసెగదా (2) / మలమల మాడిన మానవ హృదయము (2) / కలకలలాడె కదా ||సిల్వధరా|| / కాననతుల్య సమాజములో / హీనత జెందెను మానవత (2) / మానవ మైత్రిని సిల్వ పతాకము (2) / దానము జేసెగదా ||సిల్వ ధరా|| / దేవుని బాసిన లోకములో / చావుయే కాపురముండె గదా (2) / దేవునితో సఖ్యంబును జగతికి (2) / యీవి నిడితివి గదా ||సిల్వ ధరా|| / పాపము చేసిన స్త్రీని గని / పాపుల కోపము మండె గదా (2) / దాపున జేరి పాపిని బ్రోచిన (2) / కాపరి వీవెగదా ||సిల్వ ధరా|| / ఖాళీ సమాధిలో మరణమును / ఖైదిగ జేసిన నీవే గదా (2) / ఖలమయుడగు సాతానుని గర్వము (2) / ఖండనమాయె గదా ||సిల్వ ధరా|| / కలువరిలో నీ శాంతి సుధా / సెలయేరుగ బ్రవహించె గదా (2) / కలుష ఎడారిలో కలువలు పూయుట (2) / సిలువ విజయము గదా ||సిల్వ ధరా||

హోసన్న హోసన్నా|Hosanna Hosannaa

నా చిన్ని హృదయముతో / నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్ / పగిలిన నా కుండను / నా కుమ్మరి యొద్దకు తెచ్చి / బాగుచేయమని కోరెదన్ (2) / హోసన్న హోసన్నా యూదుల రాజుకే / హోసన్న హోసన్నా రానున్న రారాజుకే / మట్టి నుండి తీయబడితిని / మరలా మట్టికే చేరుదును (2) / మన్నైన నేను మహిమగ మారుటకు / నీ మహిమను విడచితివే (2) / హోసన్న హోసన్నా యూదుల రాజుకే / హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2) / అడుగులు తడబడిన వేళలో / నీ కృపతో సరి చేసితివే (2) / నా అడుగులు స్థిరపరచి నీ సేవకై / నడిచే కృప నాకిచ్చితివే (2) / హోసన్న హోసన్నా యూదుల రాజుకే / హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2) / ఈ లోక యాత్రలో / నాకున్న ఆశంతయూ (2) / నా తుది శ్వాస విడచే వరకు / నీ పేరే ప్రకటించాలని (2) / హోసన్న హోసన్నా యూదుల రాజుకే / హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2)