21 songs found

హల్లెలూయ పాట|Hallelooyaa Paata

హల్లెలూయ పాట – యేసయ్య పాట / పాడాలి ప్రతి చోట – పాడాలి ప్రతి నోట / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (4) ||హల్లెలూయ|| / కష్టాలుయే కలిగినా – కన్నీరుయే మిగిలినా (2) / స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| / చెరసాలలో వేసినా- సంకెళ్లు బిగియించినా (2) / స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| / నీ తల్లి నిను మరిచినా – మరువడు నీ దేవుడు (2) / స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| / శోధనలు నిను చుట్టినా – సంతోషమే తట్టినా (2) / స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| / సింహాల కెరవేసినా – అగ్నిలో పడవేసినా (2) / ధీరుడవై సాగుమా – ప్రభు సిల్వనే చాటుమా (2) ||హల్లెలూయ||

హల్లెలూయా ఆరాధన|Hallelujah Aaraadhana

హల్లెలూయా ఆరాధన / రాజాధి రాజు యేసునకే / మహిమయు ఘనతయు / సర్వాధికారి క్రీస్తునకే (2) / చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ / ఆ ప్రభుని కీర్తించెదం / నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో / స్తోత్రార్పణ చేసెదం / హల్లెలూయా ఆరాధన / రాజాధి రాజు యేసునకే / మహిమయు ఘనతయు / సర్వాధికారి క్రీస్తునకే / రూపింప బడక ముందే / నన్ను ఎరిగితివి / నా పాదములు జారకుండా / రక్షించి నడిపితివి (2) / చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ / ఆ ప్రభుని కీర్తించెదం / నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో / స్తోత్రార్పణ చేసెదం / హల్లెలూయా ఆరాధన / రాజాధి రాజు యేసునకే / మహిమయు ఘనతయు / సర్వాధికారి క్రీస్తునకే / అభిషేక వస్త్రము నిచ్చి / వీరులుగా చేసితివి / అపవాది క్రియలను జయించే / ప్రార్థన శక్తినిచ్చితివి (2) / చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ / ఆ ప్రభుని కీర్తించెదం / నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో / స్తోత్రార్పణ చేసెదం / హల్లెలూయా ఆరాధన / రాజాధి రాజు యేసునకే / మహిమయు ఘనతయు / సర్వాధికారి క్రీస్తునకే

హల్లెలూయా యేసు ప్రభున్|Hallelooya Yesu Prabhun

హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి / వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి / బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి / ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి / రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ / హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి / తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి / పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి / బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి / నిరంతరము మారని యేసుని స్తుతియించుడి ||రాజుల|| / సూర్య చంద్రులారా ఇల దేవుని స్తుతియించుడి / హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి / అగ్నివడగండ్లార మీరు కర్తను స్తుతియించుడి / హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి ||రాజుల|| / యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి / జీవితమున్ ప్రభుపనికై సమర్పించి స్తుతియించుడి / పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి / ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి ||రాజుల|| / అగాథమైన జలములారా దేవుని స్తుతియించుడి / అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి / దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి / పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి ||రాజుల||