126 songs found

సంగీత నాదముతో|Sangeetha Naadamutho

సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో / నీ ప్రేమ గీతం పాడెద / నీ గోప్ప కార్యం చాటెద / నా జీవితం మార్చిన యేసయ్యా / ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా ||సంగీత|| / నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి / కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2) / పాపములు క్షమియించి నను మార్చిన / దోషములు భరియించి దరిచేర్చిన ||నీ ప్రేమ|| / నా కష్ట సమయమున నా చెంతనే నిలచి / విడువక నడిపించిన విధమును వివరించెద (2) / క్షేమమును కలిగించి నను లేపిన / దీవెనలు కురిపించి కృపచూపిన ||నీ ప్రేమ|| / నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి / కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద (2) / వాక్యముతో దర్శించి బలపరిచిన / సత్యముతో సంధించి స్థిరపరిచిన ||నీ ప్రేమ||

సంతోషముతో నిచ్చెడు వారిని|Santhoshamutho Nichchedu Vaarini

సంతోషముతో నిచ్చెడు వారిని / నెంతో దేవుడు ప్రేమించెన్ / వింతగ వలసిన-దంతయు నొసంగును / వినయ మనసుగల విశ్వాసులకును ||సంతోషముతో|| / అత్యాసక్తితో నధిక ప్రేమతో / నంధకార జను-లందరకు / సత్య సువార్తను జాటించుటకై / సతతము దిరిగెడు సద్భక్తులకు ||సంతోషముతో|| / వేద వాక్యమును వేరు వేరు గ్రా / మాదుల నుండెడు బాలురకు / సాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడి / సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు ||సంతోషముతో|| / దిక్కెవ్వరు లేకుండెడి దీనుల / తక్కువ లన్నిటి దీర్చుటకై / నిక్కపు రక్షణ – నిద్ధరలో నలు / ప్రక్కలలో బ్రక-టించుట కొరకై ||సంతోషముతో|| / ఇయ్యండీ మీ కీయం బడు నని / యియ్యంగల ప్రభు యే-సనెను / ఇయ్యది మరువక మదిని నుంచుకొని / యియ్యవలెను మన యీవుల నికను ||సంతోషముతో|| / భక్తి గలిగి ప్రభు పని కిచ్చుఁట బహు / యుక్త మటంచు ను-దారతతో / శక్తి కొలది మన భుక్తి నుండి యా / శక్తితో నిరతము నియ్య వలెను ||సంతోషముతో||

సంతోషించుడి యందరు|Santhoshinchudi Yandaru

సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి / యొక వింతగు కీర్తన బాడ వచ్చితిని / సంతోషించుడి నాతో సంతోషించుడి ||సంతోషించుడి|| / అంధకార మయమైన భూమి నా / ద్యంతము వెలిగింప – దాని యా-వేశము దొలఁగింప / వందితుండు క్రీస్తేసు నాథుడు – వచ్చె బ్రకాశుండై / భూమికి నిచ్చె ప్రకాశంబు ||సంతోషించుడి|| / కాన నంధకారంబు దొలఁగఁ ప్ర / కాశించెను లెండు – మీరు ప్ర-కాశింపను రెండు / మానవులను సంతోష పర్చనై – మహిని నవతరించె / భక్తుల మనము సంతసించె ||సంతోషించుడి|| / మిన్ను నుండి సంతోషోదయము / మిగుల ప్రకాశించె – హృదయములఁ – దగుల ప్రకాశించె / మున్ను జేయబడిన వాగ్ధత్థము – తిన్నగ నెరవేరే / భక్తుల కన్ను లాస దీరె ||సంతోషించుడి|| / ప్రీతియైన నీ పండుగ గూర్చి / నూతన కీర్తనను – గలసికొని – నాతో పాడుచును / నీ తరి దూరస్థుల-కీ వార్తను – నే తీరును నైనఁ / దెలుపఁగ నాతురపడవలెను ||సంతోషించుడి|| / పాపులపై దేవునికి గలిగిన / ప్రబలమైన దయను – లోకమునఁ – జూపింపఁ గవలెను / జూపక పోయిన లోపము మనపై – మోపబడును నిజము / వేగము జూపుద మా పథము ||సంతోషించుడి||

సందడి – 3|Sandadi 3

సందడి చేద్దామా – సంతోషిద్దామా / రారాజు పుట్టేనని / గంతులు వేద్దామా – గానము చేద్దామా / శ్రీ యేసు పుట్టేనని (2) / మనసున్న మారాజు పుట్టేనని / సందడి చేద్దామా – సంతోషిద్దామా / మన కొరకు మారాజు పుట్టేనని / సందడి చేద్దామా… / సందడే సందడి… / సందడే సందడి సందడే సందడి / సందడే సందడి (4) / బెత్లహేములో సందడి చేద్దామా / పశుశాలలో సందడి చేద్దామా / దూతలతో చేరి సందడి చేద్దామా / గొల్లలతో చూచి సందడి చేద్దామా (2) / మైమరచి మనసారా సందడి చేద్దామా / ఆటలతో పాటలతో సందడి చేద్దామా / శాలలో చేరి క్రీస్తుని చూచి / సంతోషించి సందడి చేద్దామా / అర్ధరాత్రిలో సందడి చేద్దామా / చుక్కను చూచి సందడి చేద్దామా / దారి చూపగ సందడి చేద్దామా / గొర్రెల విడిచి సందడి చేద్దామా (2) / మైమరచి మదినిండా సందడి చేద్దామా / మన కొరకు పుట్టేనని సందడి చేద్దామా / శాలలో చేరి క్రీస్తుని చూచి / సంతోషించి సందడి చేద్దామా / రాజును చూచి సందడి చేద్దామా / హృదయమార సందడి చేద్దామా / కానుకలిచ్చి సందడి చేద్దామా / సాగిలపడి సందడి చేద్దామా (2) / మైమరచి మనసిచ్చి సందడి చేద్దామా / మన కొరకు పుట్టేనని సందడి చేద్దామా / శాలలో చేరి క్రీస్తుని చూచి / సంతోషించి సందడి చేద్దామా

సందేహమేల|Sandehamela

సందేహమేల సంశయమదేల / ప్రభు యేసు గాయములను పరికించి చూడు / గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2) ||సందేహమేల|| / ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే / నీ పాప శిక్షను తానే – భరియించెనే (2) / ప్రవహించె రక్త ధార నీ కోసమే / కడు ఘోర హింసనొందె నీ కోసమే (2) ||సందేహమేల|| / ఎందాక యేసుని నీవు – ఎరగనందువు / ఎందాక హృదయము బయట – నిలవమందువు (2) / యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా / యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) ||సందేహమేల|| / ఈ లోక భోగములను – వీడజాలవా / సాతాను బంధకమందు – సంతసింతువా (2) / యేసయ్య సహనముతోనే చెలగాటమా / ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2) ||సందేహమేల|| / లోకాన ఎవ్వరు నీకై – మరణించరు / నీ శిక్షలను భరియింప – సహియించరు (2) / నీ తల్లియైన గాని నిన్ను మరచునే / ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2) ||సందేహమేల||

సంబరాలు చేసేద్దామా|Sambaraalu Cheseddaamaa

రాజులకే రారాజు పుట్టాడోయ్ / దివి నుంచి భువికే వచ్చాడోయ్ / ఊరూ వాడా కలిసి రారండోయ్ / సంబరాలు సంబరాలు చేయండోయ్… / అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని / పాటలు పాడి ఆరాధింప ఊరూ వాడా రండి రండి (2) / పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని (2) / ఆర్భాటించి చాటించి మోగించేద్దామా / సంబరాలు సంబరాలు చేసేద్దామా – (4) / పుట్టుకతోనే రాజై పుట్టిన రాజులకు రారాజు యేసయ్యని / సృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని (2) / జన్మ పాపమే లేనివాడని / నీదు భారము మోయువాడని (2) ||ఆర్భాటించి|| / వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు యేసయ్యని / కష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యని (2) / మార్గం సత్యము జీవం యేసని / మోక్ష ద్వారమై పుట్టినాడని (2) ||ఆర్భాటించి|| / సంబరాలు సంబరాలు చేసేద్దామా (5) / క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా