22 songs found
శుద్ధ రాత్రి! సద్ధణంగా / నందరు నిద్రపోవ / శుద్ధ దంపతుల్ మేల్కొనగా / బరిశుద్దుడౌ బాలకుడా! / దివ్య నిద్ర పొమ్మా / దివ్య నిద్ర పొమ్మా / శుద్ధ రాత్రి! సద్ధణంగా / దూతల హల్లెలూయ / గొల్లవాండ్రకు దెలిపెను / ఎందు కిట్టులు పాడెదరు? / క్రీస్తు జన్మించెను / క్రీస్తు జన్మించెను / శుద్ధ రాత్రి! సద్ధణంగా / దేవుని కొమరుడ / నీ ముఖంబున బ్రేమలొల్కు / నేడు రక్షణ మాకు వచ్చె / నీవు పుట్టుటచే / నీవు పుట్టుటచే
శుద్ధ హృదయం కలుగజేయుము (3) / నీ వాత్సల్యం నీ బాహుళ్యం / నీ కృపా కనికరం చూపించుము (2) / పాపము చేసాను దోషినై ఉన్నాను (2) / తెలిసియున్నది నా అతిక్రమమే / తెలిసియున్నది నా పాపములే (2) / నీ సన్నిధిలో నా పాపములే / ఒప్పుకొందునయ్యా (2) / శుద్ధ హృదయం కలుగజేయుము (2) / నాలోనా నాలోనా (2) / శుద్ధ హృదయం కలుగజేయుము (3) / నీ జ్ఞానమును నీ సత్యమును / నా ఆంతర్యములో పుట్టించుము (2) / ఉత్సాహ సంతోషం నీ రక్షనానందం / కలుగజేయుము నా హృదయములో (4) / నీ సన్నిధిలో పరిశుద్దాత్మతో / నన్ను నింపుమయ్యా (2) ||శుద్ధ||
శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా / పాపము బాప వచ్చితివయ్యా / శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా / రక్షణ భాగ్యం తెచ్చితివయ్యా / సిద్ధపడే శుద్ధ దేహం / సిలువనెక్కె సందేశం / ఆసనమో తండ్రి చిత్తం / ఆరంభమో కల్వరి పయనం ||శుద్ధు|| / చెమట రక్తముగా మారెనే / ఎంతో వేదనను అనుభవించే / ప్రార్ధించెను గిన్నె తొలగించుమని యేసు / జ్ఞాపకమాయెనే తండ్రి చిత్తం (2) ||సిద్ధపడే|| / చిందించె రక్తము నా కొరకే / ప్రవహించే రక్తము పాపులకై / రక్తపు బొట్టు ఒకటి లేకపోయే / ప్రక్కలో బల్లెపు పోటు గ్రక్కున దిగెనే (2) ||సిద్ధపడే||
శుభవేళ – స్తోత్రబలి / తండ్రీ దేవా – నీకేనయ్యా / ఆరాధన – స్తోత్రబలి / తండ్రీ దేవా – నీకేనయ్యా / తండ్రీ దేవా – నీకేనయ్యా (2) ||శుభవేళ|| / ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా (2) / సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ (2) ||శుభవేళ|| / ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా (2) / నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి (2) ||శుభవేళ|| / యెహోవా షమ్మా – మాతో ఉన్నవాడా (2) / మాతో ఉన్నవాడా – యెహోవా షమ్మా (2) ||శుభవేళ|| / యెహోవా షాలోం – శాంతి నొసగు వాడా (2) / శాంతి నొసగువాడా – యెహోవా షాలోం (2) ||శుభవేళ||
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం / భజియించి నే పొగడనా స్వామీ (2) / శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం / హల్లేలూయా హల్లేలూయా / హల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా (2) ||శృతిచేసి|| / దానియేలును సింహపు బోనులో / కాపాడినది నీవెకదా (2) / జలప్రళయములో నోవాహును గాచిన / బలవంతుడవు నీవెకదా (2) / నీవెకదా (3) ||హల్లేలూయా|| / సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన / సత్య హితుడవు నీవెకదా (2) / పాపులకొరకై ప్రాణమునిచ్చిన / కరుణామయుడవు నీవెకదా (2) / నీవెకదా (3) ||హల్లేలూయా||
శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా / సాగిపోవుటే నాకు నా యేసు నేర్పెనే – (2) ||శోధనా|| / నడవలేక నా పడవ నది సముద్రమందున / నడుపుట నా వల్ల కాక నేనెడుస్తుండగా (2) / చూచెనే యేసు చెంతకు చేరెనే (2) / ఆయనుండి నా పడవ ఆ దరికి చేర్చెనే (2) ||శోధనా|| / పాపమని దొంగ యూభి పడిపోవుచుండగా / పైకి తీయువాడు లేక మునిగి పోవుచుండగా (2) / చూచెనే యేసు చేయి చాచెనే (2) / లేవనెత్తి శుద్ధి చేసి తన బండపై నిలిపెనే (2) ||శోధనా||
శ్రమయైనా బాధైనా – హింసలెన్ని ఎదురైనా / క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు / ఖడ్గమే ఎదురైనా – శోధనలు ఎదురైనా / క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు / నా రాజు వచ్చుచున్నాడు – భీకరుడై వచ్చుచున్నాడు – (2) / సర్వోన్నతుడు మేఘారూఢిగా – తీర్పును తీర్చ రానున్నాడు / ఎదురేలేని కొదమసింహం – మహా ఉగ్రతతో రానున్నాడు / ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు? / ఎవరు? ఎవరు?ఎవరు? ఎవరు? / శౌర్యుడు ధీరుడు వీరుడు శూరుడు / యోగ్యుడు శ్రేష్ఠుడు అర్హుడు ఘనుడు / అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు – సర్వము చేసిన సృష్టికర్త / మహోన్నతుడు మహేశ్వరుడు – సర్వము గెలిచిన సర్వేశ్వరుడు / దేవాది దేవుడు రాజాధి రాజు – ప్రభువుల ప్రభువు నిత్య దేవుడు / విశ్వాసమే నా బలము – నిత్యజీవము చేపట్టుటే నా భాగ్యము / శ్రమలేలేని బాధేలేని – ఆ లోకంలో నిరంతరం జీవింతును / విమోచకుడు సజీవుడు – నా కనులారా నే చూచెదను / యుగయుగములకు మహారాజునితో – పాలించుటకే పోరాడెదను / ఓ క్రైస్తవా సోలిపోకుమా – తీర్పు నుండి నీ ఆత్మను తప్పించుకో / మోసపోకుమా జారిపోకుమా – నీ రక్షణన్ జాగ్రత్తగా కాపాడుకో / మంచి పోరాటం నువ్వు పోరాడు – నీ పరుగునే కడముట్టించు / విశ్వాసమును కాపాడుము – యేసుని చేర వెయ్యి ముందడుగు ||శ్రమయైనా||
శ్రమలందు నీవు నలిగే సమయమున / ప్రభు నీకు తోడుండునని / యోచించలేదా? గమనించలేదా? / ఇమ్మానుయేలుండునని ||శ్రమలందు|| / శ్రమలందు ఏలియాకు కాకోలముచేత / ఆహారము పంపించ లేదా? (2) / ఈనాడు నీకు జీవాహారముతో / నీ ఆకలి తీర్చుట లేదా? (2) ||శ్రమలందు|| / శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి / రాజ్యాధికారమీయలేదా? (2) / ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి / పరలోక రాజ్యమీయలేదా? (2) ||శ్రమలందు||
శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2) / నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2) ||శ్రీ యేసుండు|| / ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2) / ఇమ్మానుయేలనెడి నామమందున (2) ||శ్రీ యేసుండు|| / సత్రమందున పశువులశాల యందున (2) / దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2) ||శ్రీ యేసుండు|| / పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2) / పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2) ||శ్రీ యేసుండు|| / గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2) / దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2) ||శ్రీ యేసుండు|| / మన కొరకొక్క శిశువు పుట్టెను (2) / ధరను మన దోషములబోగొట్టెను (2) ||శ్రీ యేసుండు|| / పరలోకపు సైన్యంబు గూడెను (2) / మింట వర రక్షకుని గూర్చి పాడెను (2) ||శ్రీ యేసుండు|| / అక్షయుండగు యేసు పుట్టెను (2) / మనకు రక్షణంబు సిద్ధపరచెను (2) ||శ్రీ యేసుండు||
శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామం / జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం / సాటిలేని నామం – స్వస్థపరచే నామం / అన్ని నామముల కన్నా నిత్యమైన నామం / యేసు నామం మధుర నామం / యేసు నామం సుమధుర నామం (2) ||శ్రేష్టమైన|| / త్రోవ చూపి సరియైన దారిలో నన్ను నడిపించే నామం / దుష్ట శక్తులు బంధకములు తొలగించే / తరములెన్నో మారినా మనుజులంతా మారినా (2) / మారని నామం మహిమ నామం / మరణము గెల్చిన శ్రీ యేసు నామం (2) ||శ్రేష్టమైన|| / జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం / కలవరము నను వెంటాడినను ధైర్యమునిచ్చె ప్రభు నామం / భారమెంతో ఉన్నను శాంతినొసగే దివ్య నామం (2) / మారని నామం మహిమ నామం / మరణము గెల్చిన శ్రీ యేసు నామం (2) ||శ్రేష్టమైన||