22 songs found

శత కోటి రాగాలు వల్లించిన|Shatha Koti Raagaalu Vallinchina

శత కోటి రాగాలు వల్లించిన / నా యేసుకే నేను స్తుతి పాడనా / దినమెల్ల ప్రభు సాక్ష్యమే చాటగా / ఈ నూతన వత్సరాన అడుగు పెట్టిన – ఆనందించనా / హ్యాపీ న్యూ ఇయర్ (2) / మై విషెస్ టు ఆల్ హియర్ (2) / నా కంటి పాపై నా ఇంటి వెలుగై / నన్నాదరించాడు నా యేసుడే / నా మంచి కోరి నా మేలు కోరి / నను పెంచుతున్నాడు నా యేసుడే / నా వల్ల ప్రభుకేమి ఒరిగేది లేదు (2) / అయినా నను ప్రేమిస్తాడు / కన్న తల్లిలా నను లాలిస్తాడు ||హ్యాపీ|| / నా ఆశ తానై – నా శ్వాస తానై / నన్ను నడుపుతున్నాడు నా యేసుడే / నాలోన యుక్తయి – నాలోన బలమై / నను దరికి చేర్చాడు నా యేసుడే / ఏమైనా నేనేమి ప్రభుకివ్వగలను (2) / వరదలా దీవిస్తాడు / కన్న తండ్రిలా నను మెప్పిస్తాడు ||హ్యాపీ||

శరణం శరణం శరణం దేవా|Sharanam Sharanam Sharanam Devaa

శరణం శరణం శరణం దేవా – కరుణ నాథుడా (2) / కరుణ నాథుడా – ఈ తరుణమే ప్రభో (2) ||శరణం|| / పాపరహిత దేవకుమారా – శాపవాహకా (2) / శాపవాహకా – నిత్య కోప రహితుడా (2) ||శరణం|| / పరిపూర్ణ దేవుడా – నరావతారుడా (2) / నరావతారుడా – మా యేసు నాథుడా (2) ||శరణం|| / దయామయుండ క్రీస్తు యేసు – దాక్షిణ్య ప్రభువా (2) / దాక్షిణ్య ప్రభువా – బాహుళ్య దేవుడా (2) ||శరణం|| / నమ్మదగిన లోకరక్షకా – సర్వోపకారుడా (2) / సర్వోపకారుడా – సర్వశక్తిమంతుడా (2) ||శరణం|| / సాత్వికుండా – సర్వజనుల కాంక్షణీయుడా (2) / కాంక్షణీయుడా – వాత్సల్య దేవుడా (2) ||శరణం|| / రిక్తుడై తగ్గించుకొనిన – వినయపూర్ణుడా (2) / వినయపూర్ణుడా – మముగాచు దేవుడా (2) ||శరణం|| / సత్యవంతుడవు – మాదు నిత్యదేవుడా (2) / నిత్యదేవుడా – మా మంచి బోధకుడా (2) ||శరణం|| / సర్వలోక సృష్టికర్త – సత్యదేవుడా (2) / సత్యదేవుడా – మా నిత్యజీవమా (2) ||శరణం|| / ఎల్లరిలో శ్రేష్ఠుడా – మా వల్లభుండవు (2) / వల్లభుండవు హల్లెలూయ పాడెదం (2) ||శరణం||

శాశ్వత కృపను|Shaashwatha krupanu

శాశ్వత కృపను నేను తలంచగా / కానుకనైతిని నీ సన్నిధిలో (2) ||శాశ్వత|| / నా హృదయమెంతో జీవముగల దేవుని / దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2) / నా దేహమెంతో నీకై ఆశించే (2) ||శాశ్వత|| / దూతలు చేయని నీ దివ్య సేవను / ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2) / ధూపార్తిని చేపట్టి చేసెద (2) ||శాశ్వత|| / భక్తిహీనులతో నివసించుటకంటెను / నీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2) / వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2) ||శాశ్వత|| / సీయోను శిఖరాన సిలువ సితారతో / సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద (2) / సీయోను రారాజువు నీవేగా (2) ||శాశ్వత|| / నూతనమైన ఈ జీవ మార్గమందున / నూతన జీవము ఆత్మాభిషేకమే (2) / నూతన సృష్టిగా నన్ను మార్చెను (2) ||శాశ్వత||

శాశ్వతమైన ప్రేమతో|Shaashwathamaina Prematho

శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా / నీ ప్రేమే నను గెల్చెను / విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా / నీ కృపయే నను మార్చెను / నీ ప్రేమ ఉన్నతం – నీ ప్రేమ అమృతం / నీ ప్రేమ తేనె కంటే మధురము / నీ ప్రేమ లోతులో – నను నడుపు యేసయ్యా / నీ ప్రేమలోని నే వేరు పారి నీకై జీవించినా / ప్రేమతో… ప్రేమతో… / యేసయ్యా నిను వెంబడింతును / ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… / యేసయ్యా నిను ఆరాధింతును ||శాశ్వతమైన|| / నా తల్లి గర్భమునందు నే పిండమునైయుండఁగా / దృష్టించి నిర్మించిన ప్రేమ / నా దినములలో ఒకటైన ఆరంభము కాకమునుపే / గ్రంధములో లిఖియించిన ప్రేమ / నా ఎముకలను నా అవయములను / వింతగా ఎదిగించి రూపించిన ప్రేమ / తల్లి ఒడిలో నేను పాలు త్రాగుచున్నప్పుడు / నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమ / తన సొంత పోలిక రూపులోన నను సృష్టించిన ప్రేమ / ప్రేమతో… ప్రేమతో… / నీ కోసం సృజియించావయ్యా / ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… / నను మురిపెంగా లాలించావయ్యా ||శాశ్వతమైన|| / నే ప్రభువును ఎరుగక యుండి అజ్ఞానముతో ఉన్నప్పుడు / నను విడువక వెంటాడిన ప్రేమ / నా సృష్టికర్తను గూర్చి స్మరణే నాలో లేనప్పుడు / నా కోసం వేచిచూచిన ప్రేమ / బాల్య దినముల నుండి నను సంరక్షించి / కంటి రెప్పలా నన్ను కాపాడిన ప్రేమ / యవ్వన కాలమున కృపతో నను కలిసి / సత్యమును బోధించి వెలిగించిన ప్రేమ / నే వెదకకున్నను నాకు దొరికి నను బ్రతికించిన ప్రేమ / ప్రేమతో… ప్రేమతో… / యేసయ్యా నను దర్శించినావయ్యా / ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… / నను ప్రత్యేకపరిచావేసయ్యా ||శాశ్వతమైన|| / నే పాపినై యుండగానే నాకై మరణించిన ప్రేమ / తన సొత్తుగా చేసుకున్న ప్రేమ / విలువే లేనట్టి నాకై తన ప్రాణపు విలువని చెల్లించి / నా విలువని పెంచేసిన ప్రేమ / లోకమే నను గూర్చి చులకన చేసినను / తన దృష్టిలో నేను ఘనుడన్న ప్రేమ / ఎవరూ లేకున్నా నేను నీకు సరిపోనా / నీవు బహు ప్రియుడవని బలపరచిన ప్రేమ / నా ముద్దు బిడ్డ నువ్వంటూ నన్ను తెగ ముద్దాడిన ప్రేమ / యేసయ్యా… యేసయ్యా… / నాపై ఇంత ప్రేమ ఏంటయ్యా / యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… / నను నీలా మార్చేందులకేనయ్యా ||శాశ్వతమైన|| / పలు మార్లు నే పాడినప్పుడు బహు చిక్కులలోనున్నప్పుడు / కరుణించి పైకి లేపిన ప్రేమ / నేనే నిను చేసానంటూ నేనే భరియిస్తానంటూ / నను చంకన ఎత్తుకున్న ప్రేమ / నా తప్పటడుగులు తప్పకుండ సరి చేసి / తప్పులను మాన్పించి స్థిరపరచిన ప్రేమ / నన్ను బట్టి మారదుగా నన్ను చేరదీసెనుగా / షరతులే లేనట్టి నా తండ్రి ప్రేమ / తనకిష్టమైన ఘనమైన పాత్రగా నను మలచిన ప్రేమ / ప్రేమతో… ప్రేమతో… / నను మరలా సమకూర్చావేసయ్యా / ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… / నీ సాక్ష్యంగా నిలబెట్టావయ్యా ||శాశ్వతమైన|| / కష్టాల కొలుముల్లోన కన్నీటి లోయల్లోన / నా తోడై ధైర్యపరచిన ప్రేమ / చెలరేగిన తుఫానులలో ఎడతెగని పోరాటంలో / తన మాటతో శాంతినిచ్చింది ప్రేమ / లోకమే మారిననూ మనుషులే మరచిననూ / మరువనే మరువదుగా నా యేసు ప్రేమ / తల్లిలా ప్రేమించి తండ్రిలా బోధించి / ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ / క్షణమాత్రమైన నను వీడిపోని వాత్సల్యత గల ప్రేమ / ప్రేమతో… ప్రేమతో… / నా విశ్వాసం కాపాడవయ్యా / ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… / బంగారంలా మెరిపించావయ్యా ||శాశ్వతమైన|| / ఊహించలేనటువంటి కృపాలని నాపై కురిపించి / నా స్థితి గతి మార్చివేసిన ప్రేమ / నా సొంత శక్తితో నేను ఎన్నడును పొందగలేని / అందలమును ఎక్కించిన ప్రేమ / పక్షి రాజు రెక్కలపై నిత్యము నను మోస్తూ / శిఖరముపై నన్ను నడిపించు ప్రేమ / పర్వతాలపై ఎప్పుడు క్రీస్తు వార్త చాటించే / సుందరపు పాదములు నాకిచ్చిన ప్రేమ / తన రాయబారిగా నన్ను ఉంచిన యేసే ఈ ప్రేమ / ప్రేమతో… ప్రేమతో… / శాశ్వత జీవం నాకిచ్చావయ్యా / ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… / నను చిరకాలం ప్రేమిస్తావయ్యా ||శాశ్వతమైన||

శిరము మీద ముళ్ల సాక్షిగా|Shiramu Meeda Mulla Saakshigaa

శిరము మీద ముళ్ల సాక్షిగా / కార్చిన కన్నీళ్ల సాక్షిగా / పొందిన గాయాల సాక్షిగా / చిందిన రుధిరంబు సాక్షిగా (2) / యేసు నిన్ను పిలచుచున్నాడు / నీ కొరకే నిలచియున్నాడు (3) / సర్వ పాప పరిహారం కోసం / రక్త ప్రోక్షణం అవశ్యమని (2) / మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని / పరమాత్ముడే బలియై తిరిగి లేవాలని / ఆర్య ఋషులు పలికిన ఆ వేదం సత్యం / యేసులోనే నెరవేరెనుగా / సర్వ పాప పరిహారో / రక్త ప్రోక్షణం అవశ్యం / తద్ రక్తం పరమాత్మేనా / పుణ్య దాన బలియాగం / ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం / క్రీస్తులోనే నెరవేరెనుగా / యేసే బలియైన పరమాత్మ ||శిరము|| / మహా దేవుడే ఇలకేతెంచి / యజ్ఞ పశువుగా వధ పొందాలని (2) / కాళ్లలోన చేతులలో మూడు మేకులుండాలని / శిరముపైన ఏడు ముళ్ల గాయాలు పొందాలని / బ్రాహ్మణాలు పలికిన ఆ వేద సత్యం / క్రీస్తులోనే నెరవేరెనుగా / చత్వారః శ్రీద్న త్రయో అస్య పాదాద్రి / శీర్ష్యే సప్త హస్తాసో అస్య త్రిదావద్ధో / వృషభో రోర వీతి మహో దేవో / మద్యామ్ ఆవివేశత్తిథి / బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి / యేసులోనే నెరవేరెనుగా / యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా ||శిరము||

శిలనైన నన్ను|Shilanaina Nannu

శిలనైన నన్ను శిల్పివై మార్చావు / నాలోని ఆశలు విస్తరింపచేసావు (2) / నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు (2) / నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన|| / మోడుబారిన నా జీవితం / నీ ప్రేమతోనే చిగురింపచేసావు (2) / నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2) / వర్ణించలేను లెక్కించలేను (2) / నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన|| / ఏ విలువలేని అభాగ్యుడను నేను / నీ ప్రేమచూపి విలువనిచ్చి కొన్నావు (2) / నాయెడల నీకున్న తలంపులు విస్తారం (2) / నీ కొరకే నేను జీవింతు ఇలలో (2) / నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన|| / ఊహించలేను నీ ప్రేమ మధురం / నా ప్రేమ మూర్తి నీకే నా వందనం (2) / నీ ప్రేమే నాకాధారం – నా జీవిత లక్ష్యం (2) / నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన||